Vladimir Putin India Visit: దశాబ్దాలుగా అమెరికా ప్రపంచం మీద పెత్తనం సాగిస్తోంది. అన్ని దేశాల మీద తనదైన నిఘా ఏర్పాటు చేసుకున్న అమెరికా.. తను చెప్పినట్టుగా ప్రపంచ దేశాలు వినే విధంగా ఒత్తిడి తీసుకొస్తూ ఉంటుంది. గతంలో భారత్ కూడా ఇదే విధంగా చేసింది. రష్యా కూడా ఇందుకు మినహాయింపు కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ముఖ్యంగా భారత్ అమెరికా చెప్పినట్టు వినే పరిస్థితి లేదు. ఇక రష్యా అయితే అమెరికాతో ఎప్పటినుంచో నువ్వా నేనా అన్నట్టుగా వ్యవహరిస్తోంది. రష్యా అధ్యక్షుడిగా పుతిన్ వ్యవహరిస్తున్న నాటి నుంచి అమెరికాకు పక్కలో బల్లెం మాదిరిగా మారిపోయాడు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అని దగ్గర నుంచి అమెరికాతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.
ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక గమనాన్ని మార్చే సత్తా ఉన్న దేశాలలో భారత్, రష్యా కు ఉంటాయి. వ్యూహాత్మక వాణిజ్యం విషయంలో కూడా ఈ రెండు దేశాలు కలిసి ముందుకు వెళుతున్నాయి. ప్రస్తుతం ఈ రెండు దేశాల అధిపతులు అనేక సందర్భాలలో తటస్థ వేదికల మీద, రష్యాలో కలుసుకున్నారు. ఇప్పుడు రష్యా అధిపతి పుతిన్ దాదాపు ఏడు సంవత్సరాల తర్వాత భారత గడ్డ మీద అడుగు పెట్టారు. పుతిన్ కు స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వాగతం పలికారు పాలెం విమానాశ్రయం నుంచి ఇద్దరు నేతలు ఒకే కారులో ప్రయాణించారు. ప్రస్తుతం ఆ వాహనం గురించి విపరీతమైన చర్చ నడుస్తోంది. నరేంద్ర మోడీ తను ఉపయోగించే అత్యంత విలాసవంతమైన రేంజ్ రోవర్ కారును పక్కనపెట్టి, ఒక సాధారణ ఫార్చునర్ లో పుతిన్ ను తీసుకెళ్లడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.
టయోటా కంపెనీకి చెందిన ఆ ఫార్చునర్ మహారాష్ట్ర నెంబర్ తో రిజిస్టర్ అయింది. మరోవైపు పుతిన్ కూడా “ఆరస్ సెనేట్ లిమోసిన్” లో కాకుండా ఫార్చునర్ లో రావడం ఆశ్చర్యాన్ని కలిగించింది. వాస్తవానికి నరేంద్ర మోడీ, పుతిన్ అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రయాణ సాగిస్తారు. అయితే తమ సెక్యూరిటీ నిబంధనలను పక్కనపెట్టి వీరిద్దరూ అలా ప్రయాణించడం చూసే వాళ్లకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ప్రపంచ దేశాల సైతం వీరిద్దరి కలయికను ఆశ్చర్యంగా చూశాయి.
ఉక్రెయిన్ దేశంతో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో రష్యా నుంచి అమెరికా క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేసింది. వాస్తవానికి ప్రపంచ దేశాలు అమెరికాకు బయపడి రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేయడానికి భయపడిన క్రమంలో భారత్ మాత్రం రష్యాకు అండగా నిలిచింది. రష్యా కూడా అనేక విషయాలలో భారతదేశానికి వెన్ను దన్నుగా నిలబడింది. ముఖ్యంగా మోడీ హయాంలో రష్యాతో భారత్ సంబంధాలు మెరుగుపడ్డాయి. ఈ క్రమంలో నరేంద్ర మోడీ, పుతిన్ మధ్య విపరీతమైన స్నేహం ఏర్పడింది. అది కాస్త ఇంతటి చనువుకు దారితీసింది.. పుతిన్ ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను కలిసినప్పటికీ టచ్ మీ నాట్ అన్నట్టుగానే వ్యవహరించారు. కానీ నరేంద్ర మోడీతో మాత్రం దోస్త్ మేరా దోస్త్ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. బ్రిక్ కూటమిలో రష్యా, భారత్ కీలకంగా ఉన్నాయి. వ్యూహాత్మక వ్యాపారంలో కూడా ఈ రెండు దేశాలు బలమైన శక్తులుగా ఉన్నాయి. బహుశా అటువంటి సంకేతాలను అమెరికా కు బలంగా ఇవ్వడానికి పుతిన్, మోడీ ఇలా వ్యవహరించి ఉంటారని విశ్లేషకులు చెబుతున్నారు.