Vivekananda Reddy Murder Case: వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసు నీరుగార్చే ప్రయత్నం జరుగుతోందా? కేసు రాజీకి తీవ్రస్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయా? ఆయన కుమార్తె సునీతను దారిలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారా? ఇందుకు రాజకీయ పదవులు ఎరగా వేస్తున్నారా? అంటే పులివెందుల రాజకీయ సర్కిల్ నుంచి అవుననే సమాధానం వినిపిస్తోంది. వివేకానందరెడ్డి హత్య అనంతరం ఆమె కుమార్తె రూపంలో జగన్ కు అనేక సవాళ్లు ఎదురవుతున్న ద్రుష్ట్యా సంధి మార్గమే శ్రేయస్కరమని అటు కుటుంబపెద్దలు, పార్టీ పెద్దలు భావిస్తున్నారు. అందుకే ఆమెకు వచ్చే ఎన్నికల్లో జమ్మలమడుగు టిక్కెట్ ఆఫర్ చేశారని టాక్ నడుస్తోంది. కాదు కాదు పులివెందుల స్థానాన్ని ఇచ్చేందుకు సైతం జగన్ వెనుకాడడం లేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి., అయితే ఇది ఎంతవరకూ వాస్తవమన్నది మాత్రం తెలియడం లేదు. అయితే దీనిపై ప్రయత్నాలు జరుగుతున్నాయని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.

సరిగ్గా ఎన్నికలకు ముందు..
గడిచిన ఎన్నికలకు ముందు వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. చంద్రబాబు అండ్ కో హత్య చేశారంటూ జగన్ ఊరూ వాడ ప్రచారం చేశారు. సరిగ్గా ఎన్నికలకు రెండు నెలల ముందు ఘటన జరగడం, నారాసుర రక్తచరిత్ర అంటూ జగన్ తన మీడియాలో ప్రచారం చేయడంతో ప్రజల నుంచి విపరీతమైన సానుభూతి వచ్చింది. అది ఎన్నికల్లో జగన్ కు లాభించింది. చంద్రబాబుకు మాత్రం కోలుకోలేని దెబ్బ తగిలింది.,నాడు ఘటనలపై కేసును సీబీ సీఐడీకి అప్పగించారు. కానీ విపక్షనేతగా జగన్ ఘటనపై సీబీఐ దర్యాప్తునకు డిమాండ్ చేశారు. దీంతో ఈ కేసును సీబీఐ కు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం జగన్ స్వరం మారింది. దీనిపై సీబీఐ దర్యాప్తు అవసరం లేదని జగన్ భావించారు. కానీ ఈ సమయంలో వివేకానందరెడ్డి కుమార్తె తెరపైకి వచ్చారు. వివేకానందరెడ్డి హత్య కేసు విషయంలో జరుగుతున్న జాప్యంపై ప్రశ్నించారు. న్యాయస్థానాన్ని సైతం ఆశ్రయించారు. దీంతో సీబీఐ విచారణ వేగవంతం చేయాలని కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది.
Also Read: Central Government- Power Reform: విద్యుత్ సంస్కరణలో కేంద్రం మున్ముందుకే
కొలిక్కిరాని కేసు..
` అయితే నెలలు గడుస్తున్నా సీబీఐ కేసును కొలిక్కి తేలేకపోతోంది. కొంతమంది నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించింది. కీలక నిందితులుగా భావిస్తున్న వారు మాత్రం బయట స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ఈ విషయంలో కీలక నిందితులను సంరక్షించేందుకు సీఎం జగన ప్రయత్నిస్తున్నారన్నది ఆయనపై ఆరోపణ. అయితే ఈ మొత్తం వ్యవహారంలో వైఎస్ కుటుంబంలో చీలక వచ్చింది. మెజార్టీ కుటుంబసభ్యులు వివేకానందరెడ్డి హత్య కేసులో జరుగుతున్న పరిణామాలపై ఆగ్రహంతో ఉన్నారు. అదే సమయంలో తెలంగాణా వైఎస్సార్ పార్టీ అధ్యక్షురాలు, జగన్ సోదరి షర్మిళ కూడా సునీతకు మద్దతుగా ఉన్నారు. దీంతో వివేకానందరెడ్డి హత్య కేసులో సునీత జగన్ కు నలుసుగా తయారయ్యారు. జరిగిందేదో జరిగిపోయింది. మీకు రాజకీయంగా పదవులిస్తామంటూ జగన్ ఆఫర్ పెట్టినట్టు తెలుస్తోంది. కానీ సునీత నుంచి మాత్రం నిరాసక్తత వ్యక్తమైందని బయట టాక్ నడుస్తోంది.

గతం నుంచే ..
అయితే ఆది నుంచి వివేకానందరెడ్డి కుమార్తె సునీతపై వైసీపీ ఒక రకమైన ప్రచారం సాగించింది. వైసీపీ ప్రభుత్వ సలహాదారు, ఆ పార్టీ కీలక నాయకుడు సజ్జల రామక్రిష్టారెడ్డి అయితే డాక్టర్ సునీత టీడీపీ తరుపున పోటీ చేస్తారని కూడా ప్రకటించారు. అయితే ఈ ప్రచారాన్ని డాక్టర్ సునీత ఖండించారు. తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని సైతం ప్రకటించారు. తన తండ్రి హత్య కేసులో నిందితులకు శిక్ష పడితే చాలని కోరారు. అయితే ఇప్పుడు ఏకంగా పులివెందుల అసెంబ్లీ స్థానాన్నే కట్టబెడతామని ప్రచారం సాగుతుండడంతో డాక్టర్ సునీత ఏమాత్రం రియాక్ట్ అవుతారో చూడాలి మరీ.
Also Read:YS Vijayamma- YSRTP: వైఎస్సార్ టీపీని విజయమ్మ విజయతీరాలకు చేరుస్తుందా?
[…] […]