Homeఆంధ్రప్రదేశ్‌Viveka Murder Daughter Sunitha revealed: ఎంపీ టికెట్ కోసమే వివేకా హత్య.. సంచలన నిజాలు...

Viveka Murder Daughter Sunitha revealed: ఎంపీ టికెట్ కోసమే వివేకా హత్య.. సంచలన నిజాలు బయటపెట్టిన కుమార్తె సునీత

Viveka Murder Daughter Sunitha revealed: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు కీలక మలుపులు తిరుగుతోంది. సీబీఐ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. తుది దశకు చేరుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇక అరెస్ట్ ల పర్వం ప్రారంభంకానుందని ప్రచారం సాగుతోంది. ఇటువంటి తరుణంలో వివేకా కుమార్తె సునీత బాంబు పేల్చారు. ఎంపీ టిక్కెట్ కోసమే తన తండ్రిని పొట్టన పెట్టుకున్నారని ఆరోపించారు. ఎంపీ అవినాష్ రెడ్డే అసలు సూత్రధారి అని ఆరోపిస్తూ ఆమె హైకోర్టులో ఇంప్లిడ్ పిటీషన్ దాఖలు చేశారు. అందులో కీలక అంశాలను ప్రస్తావించారు. ఎంపీ అవినాష్ రెడ్డి ద్వారానే దస్తగిరితో పాటు కీలక నిందితులకు డబ్బులు చేరాయని తెలిపారు. వివేకా హత్యకు ముందు అవినాష్ ఇంట్లోనే సునీల్ యాదవ్ ఉన్నాడని పేర్కొన్నారు.

చాలా రోజులుగా వివేకాపై కక్ష పెంచుకున్నారని గుర్తుచేశారు. 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించారని చెప్పారు. 2019 ఎన్నికల్లో ఎంపీ సీటు ఇస్తారనే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని పిటీషన్ లో పేర్కొన్నారు. వివేకా పీఏ ఎంవీ కృష్ణారెడ్డి చెప్పే ముందే హత్య గురించి అవినాష్‌కు తెలుసని తెలిపారు. హత్య చేశాక అందరినీ కాపాడుకుంటాడని, ఎర్రగంగిరెడ్డి మిగిలిన నిందితులకు అవినాశ్ చెప్పాడని సునీతారెడ్డి పేర్కొన్నారు. ‘మా నాన్న చనిపోయారని శివప్రసాద్ రెడ్డి అవినాష్ కు సమాచారం ఇచ్చారు. వివేకా ఇంటికి వచ్చిన శశికళకు గుండెపోటుతో చనిపోయినట్టు అవినాష్ చెప్పాడు. పోలీసులు కూడా గుండెపోటుతో పాటు రక్తపు వాంతులు చేసుకొని చనిపోయినట్టు అబద్దాలు చెప్పారు. హత్య కాదు, సాధారణ మరణం అని చిత్రీకరించే ప్రయత్నం చేశారు. వివేకాను తానే హత్య చేసినట్టు ఒప్పుకుంటే అవినాష్ రూ.10 కోట్లు ఇవ్వజూపాడని గంగధార్ రెడ్డి స్టేట్ మెంట్ ఇచ్చినట్టు’ సునీత తన నివేదికలో పేర్కొన్నారు.

సరిగ్గా సీబీఐ పట్టుబిగిస్తున్న తరుణంలో సునీత ఇంప్లిట్ పిటీషన్ వేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు ఆయన తండ్రి భాస్కరరెడ్డికి సీబీఐ నోటీసులిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇద్దర్ని ఏకకాలంలో విచారణ చేపడుతుండడంతో అరెస్టులుంటాయని ప్రచారం జరుగుతోంది. సరిగ్గా ఇటువంటి సమయంలో సునీత హైకోర్టును ఆశ్రయించడం సంచలనంగా మారింది. హత్యకేసులో సహకరించకుండా ఎంపీ అవినాష్ రెడ్డి కోర్టులో తప్పుడు కేసులు పెడుతున్నాడని.. తనతో పాటు తన భర్త, కుటుంబసభ్యులను బెదిరిస్తున్నాడని.. అటు దర్యాప్తు అధికారులను ప్రభావితం చేస్తున్నాడని.. ఏపీ అధికారులు కేసు విచారణలో సహకరించడం లేదని.. తదితర వివరాలతో సునీత సమగ్రంగా ఇంప్లిట్ పిటీషన్ వేయడం చర్చనీయాంశమైంది. ఈ కేసు విచారణలో త్వరలో సంచలనాలు నమోదయ్యే చాన్స్ కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Today 22 July 2026 Horoscope: ఈ రాశుల వారి ఆదాయం ఈరోజు రెండింతలు.. ఏ పని...

Today 22 july 2026 horoscope : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు తులా రాశిలో సంచారం చేయనున్నాడు. దీంతో కొన్ని...

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Oktelugu Epaper
Exit mobile version