https://oktelugu.com/

Vishal-Chandrababu : చంద్రబాబుపై పోటీ విషయంలో స్పందించిన హీరో విశాల్.. ఏపీ రాజకీయాలపై హాట్ కామెంట్స్

Vishal-Chandrababu : ఏపీ రాజకీయాలు.. ఏపీ మీడియాలో నిప్పు లేకున్నా పొగ పుడుతుంది. పచ్చగడ్డిని కూడా అంటించి మండించే రకం. చక్కగా సినిమాలు చేసుకుంటున్న వారిని.. వారి మానాన వారిని పనిచేసుకుంటున్న వారిని కూడా ఏపీ రాజకీయాల్లోకి లాగి రచ్చ చేస్తున్నారు. ఈ మధ్య నటి మీనా భర్త మరణిస్తే పావురాల వల్లే ఆమె భర్త ఊపిరితిత్తులు పాడయ్యాయని ఒక పుకారు సృష్టించారు. భర్త పోయిన బాధలో ఉన్న ఆమె తాజాగా ఈ వార్తలపై సోషల్ మీడియా సాక్షిగా […]

Written By:
  • NARESH
  • , Updated On : July 1, 2022 / 09:31 PM IST
    Follow us on

    Vishal-Chandrababu : ఏపీ రాజకీయాలు.. ఏపీ మీడియాలో నిప్పు లేకున్నా పొగ పుడుతుంది. పచ్చగడ్డిని కూడా అంటించి మండించే రకం. చక్కగా సినిమాలు చేసుకుంటున్న వారిని.. వారి మానాన వారిని పనిచేసుకుంటున్న వారిని కూడా ఏపీ రాజకీయాల్లోకి లాగి రచ్చ చేస్తున్నారు. ఈ మధ్య నటి మీనా భర్త మరణిస్తే పావురాల వల్లే ఆమె భర్త ఊపిరితిత్తులు పాడయ్యాయని ఒక పుకారు సృష్టించారు. భర్త పోయిన బాధలో ఉన్న ఆమె తాజాగా ఈ వార్తలపై సోషల్ మీడియా సాక్షిగా ఆవేదన వ్యక్తంచేస్తూ అవన్నీ తప్పుడు వార్తలని క్లారిటీ ఇచ్చారు.

    ఇప్పుడు హీరో విశాల్ ది అదే పరిస్థితి. గత కొన్ని రోజులుగా చంద్రబాబును కుప్పంలో ఓడగొట్టాలని అధికార వైసీపీ చేయని ప్రయత్నం లేదు. ఇప్పటికే మంత్రి పెద్దిరెడ్డిని అక్కడ రంగంలోకి దించేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీని చిత్తుగా ఓడించి చంద్రబాబుకు షాకిచ్చారు. చంద్రబాబు లాంటి 40 ఇయర్స్ ఇండస్ట్రీని ఓడించాలంటే ఖచ్చితంగా ఉద్దండుడైన నేత కావాలి.

    ఈ క్రమంలోనే చిత్తూరు జిల్లాకే చెందిన ప్రముఖ హీరో విశాల్ ను రంగంలోకి దించారు. విశాల్ ది చిత్తూరే అయినా ఆయన తమిళనాట స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. అక్కడ రాజకీయాల్లోనూ గత సారి పోటీచేసి తమిళనాట రాజకీయాల్లోకి ప్రవేశించారు.

    ఈ క్రమంలోనే వైసీపీ బ్యాచ్ చేసిందో.. లేక ఇక్కడి మీడియా అత్యుత్సాహమో తెలియదు కానీ.. గత కొన్ని రోజులుగా చంద్రబాబు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో హీరో విశాల్ వైసీపీ తరుఫున పోటీచేయబోతున్నాడని.. చంద్రబాబుతో తలపడుతున్నాడనే వార్తలు జోరందుకున్నారు. ఈ వార్తలపై తాజాగా హీరో విశాల్ స్పందించాడు. ఏపీ రాజకీయాలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు.

    ‘ఏపీలో వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుపై పోటీచేయాలనే విషయంలో తనను ఎవరూ సంప్రదించలేదని విశాల్ క్లారిటీ ఇచ్చారు. తనకు ఏపీ రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదన్నారు. కుప్పంలో చంద్రబాబుపై తాను పోటీకి దిగుతున్నట్టు వార్తలు అంతా అబద్ధమన్నారు. ఈ వార్తలు ఎవరు సృష్టించారో తెలియదన్నారు. నేను సినిమాల్లోనే ఉంటానని.. రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన తనకు లేదని’ విశాల్ ఒక ప్రకటన జారీ చేయాల్సి వచ్చింది.

    దీంతో ఇక కుప్పంలో చంద్రబాబుపై విశాల్ పోటీ అన్నది ఒట్టి తప్పుడు కథనాలు అని తేలిపోయింది. ఇదంతా చంద్రబాబును ఓడించాలనుకుంటున్న వైసీపీ బ్యాచ్ సృష్టించిన పుకార్లు అని తేటతెల్లమైంది.