Vishaka Real Estate: ఏపీ ప్రభుత్వం ఇటీవల సంచలనాల నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. వీటిలో మూడు రాజధానుల బిల్లును రద్దు చేస్తూ అసెంబ్లీలో ప్రకటన చేసింది. సాంకేతిక కారణాల వల్ల మూడు రాజధానులను కొనసాగించలేమని సీఎం జగన్ స్వయంగా చెప్పారు. దీంతో ప్రస్తుతం ఒకే రాజధాని ఉంటుందనే అనుకోవచ్చు. అయితే మూడు రాజధానుల బిల్లు రద్దుతో సామాన్యులకు ఎలాంటి నష్టం జరగకపోవచ్చు.. కానీ ఓ వర్గానికి మాత్రం తీవ్ర వేదనను మిగిల్చింది. అప్పటి వరకు మూడు రాజధానులు ఉంటాయని ఎన్నో ఆశలు పెట్టుకున్న వారు సీఎం జగన్ రద్దు ప్రకటనతో ఒక్కసారిగా నిట్టూర్చారు. అంతేకాకుండా వారు పెట్టుబడి పెట్టిన కోట్ల రూపాయలు కంచికేనా..? అన్న చర్చ సాగుతోంది. ఇంతకీ మూడు రాజధానులపై ఆశలు పెట్టుకున్నవారెవరు..?ఎలాంటి పెట్టుబడులు పెట్టారు..? సీఎం ప్రకటనతో వారు ఎందుకు నష్టపోయారు..?

పరిపాలన వికేంద్రీకరణతో అభివృద్ధి సాధ్యమని భావించిన ఏపీ సీఎం జగన్ మూడు రాజధానులు ఉండాలని భావించారు. దీంతో 2019 డిసెంబర్ 17న సీఎం జగన్ తొలిసారిగా అసెంబ్లీలో మూడు రాజధానులు అమరావతి, విశాఖపట్నం, కర్నూలు ఉంటాయని ప్రకటన చేశారు. వీటిలో విశాఖ నుంచే పరిపాలన సాగిస్తామని అన్నారు. ఆ తరువాత డిసెంబర్ 20న జీఎన్ రావు కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి పంపింది. ఆ తరువాత 2020న హై పవర్ కమిటీ నివేదికపై మంత్రి మండలి తీవ్రంగా చర్చించింది. 22న శాసన మండలి బిల్లును తీసుకువచ్చింది. 2020 జూన్ 16న రెండో సారి వికేంద్రీకరణ బిల్లు మరోసారి ఆమోదం పొందడంతో గవర్నర్ ఆమోదం కోసం పంపించారు. అయితే న్యాయ పరమైన చిక్కులు, కోర్టు కేసులు ఉండడంతో గవర్నర్ న్యాయ సలహాలు తీసుకున్నారు. దీంతో రద్దు తప్ప మరో మార్గం లేదని ఆలోచింని నవంబర్ 23న రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
Also Read: తగ్గేదేలే! జస్ట్ గ్యాప్ ఇచ్చాడంతే.. ఏపీ రాజధానిపై జగన్ సంచలనం
మూడు రాజధానుల రద్దు ప్రకటనను పలువురు స్వాగతించారు. ముఖ్యంగా అమరావతి రాజధాని కోసం పోరాడుతున్న వారు సంబరాలు చేసుకున్నారు. కానీ విశాఖపట్నం కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు మాత్రం తీవ్ర వేదనతో ఉన్నారు. పరిపాలన రాజధానిగా విశాఖ అవుతుందని అనుకొని కొందరు బడా బాబులు ఈ ప్రాంతంలో ఎకరాల కొద్దీ భూములు కొనేశారు. కొందరు రియల్ వ్యాపారులు సైతం తమకు దొరికినంత భూమిని కొని తమ గుప్పిట్లో పెట్టుకున్నారు. ఇక రాజధాని అవడమే తరువాయి. వెంటనే కోట్ల రూపాయలకు భూములు అమ్మాలని నిర్ణయించుకున్నారు. రాజధాని అయితే ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుందని ఊదరగొడుతూ భూముల రేట్లను అమాంతంగా పెంచేశారు.
విశాఖలోని బీచ్ రోడ్డు మొదలు పెందుర్తి వరకు.. అటు అగనం పూడి నుంచి భీమిలీ వరకు దాదాపు భూములన్నీ కొందరి చేతుల్లోకి వెళ్లిపోయాయి. అంతేకాకుండా ఇక్కడి ఎంపీ కూడా ఇందులో భాగస్వాముడయ్యాడనే ప్రచారం ఉంది. ఇక విశాఖనే కాకుండా విజయనగరం పరిసర ప్రాంతాల్లో కూడా బడా బాబులు తిష్ట వేశారు. విజయనగరం జిల్లా భోగాపురం, కొత్త వలస మండలాల్లోనూ రియల్ వ్యాపారం మొదలుపెట్టారు. ఒకప్పుడు విశాఖలో గజం స్థలం కావాలంటే లక్షలోపు ఉండేది. కానీ కానీ ఇప్పుడు సీతమ్మధార, మరళీనగర్ ప్రాంతాల్లో కూడా కోటీశ్వరులు మాత్రమే స్థలాలు కొనే పరిస్థితికి వచ్చింది. అయితే సీఎం బిల్లు ఉపసంహరణతో భూములు కొన్న వారి ఆశలన్నీ ఆవిరైపోయాయి. రేపో, మాపో జగన్ ఇక్కడికి వచ్చి పరిపాలన చేస్తాడనుకుంటే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడేంటి..? అని బిల్డర్లు కుమిలిపోతున్నారట.
Also Read: విశాఖపట్నమే ఏపీకి ఏకైక రాజధాని.. సంచలన నిర్ణయం దిశగా జగన్?