AP Capitals: ఏపీ సీఎం జగన్ మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకున్నట్టు హైకోర్టు తెలిపారు. ఈ మేరకు అత్యవసర కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి సమాలోచనలు జరిపారు. కాసేపట్లో అసెంబ్లీలో ఈ బిల్లును వెనక్కి తీసుకోబోతున్నారు. ఈ క్రమంలోనే మధ్యాహ్నం 2.30 గంటలకు జగన్ అసెంబ్లీలో ప్రకటన చేయబోతున్నట్టు సమాచారం.
Also Read: మోడీ బాటలో జగన్.. మూడు రాజధానులపై సంచలన నిర్ణయం.. కేసీఆరే కారణమా?
ఏపీలో 2019 డిసెంబర్ 17న ఏపీకి మూడు రాజధానులను నిర్ణయిస్తూ అసెంబ్లీలో జగన్ సర్కార్ బిల్లును ప్రవేశపెట్టింది. కర్నూలును న్యాయరాజధానిగా.. విజయవాడను శాసన రాజధానిగా.. విశాఖను పరిపాలన రాజధానిగా చేశారు.
అయితే నాడు సీఎం చంద్రబాబు ప్రతిపాదించిన అమరావతి రాజధానిని జగన్ మూడు రాజధానులు చేయడంపై రైతులు, మేధావులు 50కు పైగా పిటీషన్లు హైకోర్టులో వేశారు. దీంతో మూడు రాజధానులకు బ్రేక్ పడింది. ఈ క్రమంలోనే సీఎం జగన్ మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించి సంచలనం సృష్టించారు.
హైకోర్టులో కేసులు తేలకపోవడంతో జగన్ మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకొని పకడ్బందీగా ఏకైక రాజధానిని చేయాలని జగన్ డిసైడ్ అయినట్లు సమాచారం. ఈ క్రమంలోనే విశాఖను ఏపీకి రాజధానిని చేయాలని జగన్ నిర్ణయించినట్టు సమాచారం. కర్నూలు, విజయవాడలను పక్కనపెట్టి ఇక విశాఖనే ఏపీకి ఏకైక రాజధానిగా జగన్ ప్రకటిస్తాడని.. ఈ మేరకు బిల్లును అసెంబ్లీలో పెడుతారని ప్రచారం సాగుతోంది. న్యాయ చిక్కులు లేకుండా పకడ్బందీగా విశాఖను రాజధానిగా ప్రకటించే బిల్లును రూపొందించినట్టు సమాచారం. మధ్యాహ్నం సీఎం జగన్ అసెంబ్లీలో దీనిపై ప్రకటన చేస్తారని అంటున్నారు. మరి ఏం జరుగుతుందనేది వేచిచూడాలి.
Also Read: తగ్గేదేలే! జస్ట్ గ్యాప్ ఇచ్చాడంతే.. ఏపీ రాజధానిపై జగన్ సంచలనం