https://oktelugu.com/

వధువును చూసి తట్టుకోలేక వరుడు చేసిన పని వైరల్

వెర్రి వేపకాయంతే ఉంటుంది. కాని అది వేయి రకాలుగా ఉంటుంది అంటారు. వేలం వెర్రి అంటూ కూడా అంటుంటారు. ఒక్కో మనిషికి ఒక్కో విధంగా ఉంటుంది. మనిషి తనలోని వైవిధ్యాన్ని బయటపెట్టే క్రమంలో వింతలు, విశేషాలు చేస్తుంటారు. తనకు తోచిన విధంగా ఏదైనా సంచలనంగా చేయాలని ఆలోచిస్తుంటాడు. అందరు చేసేది చేస్తే ఏముంటుంది పెద్ద గొప్ప అంటుంటారు. నలుగురికి నచ్చినది నాకసలే నచ్చదులే అన్నారో సినీకవి. ఇందులో తరచి చూస్తే మన రూటే సపరేటు అని తెలుసుకోవచ్చు. […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : July 31, 2021 / 07:45 PM IST
    Follow us on

    వెర్రి వేపకాయంతే ఉంటుంది. కాని అది వేయి రకాలుగా ఉంటుంది అంటారు. వేలం వెర్రి అంటూ కూడా అంటుంటారు. ఒక్కో మనిషికి ఒక్కో విధంగా ఉంటుంది. మనిషి తనలోని వైవిధ్యాన్ని బయటపెట్టే క్రమంలో వింతలు, విశేషాలు చేస్తుంటారు. తనకు తోచిన విధంగా ఏదైనా సంచలనంగా చేయాలని ఆలోచిస్తుంటాడు. అందరు చేసేది చేస్తే ఏముంటుంది పెద్ద గొప్ప అంటుంటారు. నలుగురికి నచ్చినది నాకసలే నచ్చదులే అన్నారో సినీకవి. ఇందులో తరచి చూస్తే మన రూటే సపరేటు అని తెలుసుకోవచ్చు. ఆ కోవలో ఎందరో ఎన్నో రిస్క్ లు సైతం చేశారు.

    పెళ్లినాటి తంతు అందరికి జీవితాంతం గుర్తుంటుంది. దాన్ని ఫొటోలు, వీడియోల్లో బంధించి ఎప్పుడు పడితే అప్పుడు చూసుకుంటూ మురిసిపోతారు. మన పెళ్లి వేడుక అంటూ గొప్పలకు పోవడం తెలిసిందే. పెళ్లి నాటి గుర్తులు కలకాలం గుర్తుండి పోయేలా చేయడానికి నానా తంటాలు పడుతుంటారు. కొందరైతే డెకరేషన్ అదరగొడతారు. మరికొందరు భోజనాలు వెరైటీగా వడ్డిస్తారు. ఇంకొందరైతే అన్నింట్లో కూడా ప్రత్యేకత ప్రదర్శిస్తుంటారు.

    తాజాగా వివాహ మహోత్సంలో జరిగే మధురమైన క్షణాలను అందరితో పంచుకుంటుంటారు. ఇక్కడ ఓ పెళ్లి కొడుకు మాత్రం తన పెళ్లికి తానే ఆకర్షణగా నిలిచాడు. తాను చేసిన పనికి పెళ్లికూతురు కూడా సిగ్గు మొగ్గలేసింది. దీన్ని చూసిన వారందరు కూడా ఆశ్చర్య చకితులయ్యారు. వధువును కుటుంబ సభ్యులు వేదిపైకి తీసుకువస్తుండగా వరుడు పరుగున వెళ్లి పెళ్లి కూతురును తన భుజాలపై ఎత్తుకుని సంతోషం వ్యక్తం చేశాడు. దీంతో పెళ్లికి వచ్చిన వారందరు సైతం ఊహించని తంతుకు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీంతో వధువు కూడా ఏం చేయాలో తోచక వరుడి ఎదలో ఒదిగిపోయింది. ఈ వీడియో ప్రసార మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది.

    వీరిద్దరిని కెమెరాలు క్లిక్ మనిపించాయి. చివరికి పెళ్లికొడుకు ఆమెను దించి సోఫాలో కూర్చోబెట్టాడు. ఈ వీడియోను నిరంజన్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు చేయగా కొద్ది క్షణాల్లోనే వైరల్ గా మారింది. నెటిజన్లు హోరెత్తిస్తున్నారు. ఎందుకంత కంగారు బ్రదర్ అంటూ కామెంట్లు పెట్టారు. ఇప్పటివరకు ఈ వీడియోను 5 వేల మంది వరకు చూడడం గమనార్హం.