Viral Video: పువ్వ పుట్టగానే పరిమళిస్తుంది. చిన్నప్పుడే కనిపించు సిరిగళ్ల గుణం అంటారు. దేశభక్తి అనేది ఎక్కడో ఉండదు మన దేహంలోనే ఉంటుంది. మన నరనరాల్లో ప్రవహిస్తుంది. పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్లుగా ఆ బుడతడు చిన్నప్పుడే తన దేశభక్తిని చాటుతూ అందరిని ఆశ్చర్యపరచాడు. పసిప్రాయంలోనే దేశం పట్ల తన గౌరవాన్ని ప్రదర్శిస్తూ అందరిచేత శభాష్ అనిపించుకున్నాడు. ఫలితంగా దేశవ్యాప్తంగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ చివరికి కేంద్రమంత్రి దృష్టిలో కూడా పడటం విశేషం.

వివరాల్లోకి వెళితే బెంగుళూరు విమానాశ్రయంలో జరిగిన సంఘటన అందరిని ఆశ్చర్యపరచింది. తండ్రితో కలిసి నాలుగేళ్ల కుర్రాడు విమానాశ్రయానికి వచ్చాడు. లోపలికి వెళ్లేటప్పుడు అక్కడే ఉన్న సీఆర్పీఎఫ్ జవాన్లను చూసి తండ్రి చేయి వదిలిపెట్టి వారి వద్దకు వెళ్లి సెల్యూట్ చేశాడు. దీంతో వారు కూడా ప్రతిగా ప్రతి సెల్యూట్ చేశారు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు. పసివాడిలో ఉన్న దేశభక్తికి పొంగిపోయారు. కుర్రాడి చేష్టలకు మురిసిపోయారు.
అతడి పేరు వీర్ అర్జున్. అక్టోబర్ 18న జరిగిన సంఘటనపై నెటిజన్లు పలు రకాలుగా పోస్టులు పెడుతున్నారు. బుడతడి దేశభక్తికి పరవశించిపోతున్నారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వీడియోను కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సైతం రీ పోస్టు చేసి బాలుడిపై ప్రశంసలు కురిపించారు.
At #Bengaluru airport – a young Indian snaps off a salute to our men in uniform. Respect n Patriotism is learnt young. #Respect #JaHind 🇮🇳🙏🏻👏🏻
Video courtesy @MihirkJha 🙏🏻
— Rajeev Chandrasekhar 🇮🇳 (@Rajeev_GoI) October 24, 2021
కుర్రాడి దేశభక్తి దేశవ్యాప్తంగా సంచలనం అవుతోంది. చిన్నారి చేసిన పనికి నెటిజన్లు కొనియాడుతున్నారు. దేశభక్తికి నిజమైన అర్థం చెప్పే సంఘటనగా అభివర్ణిస్తున్నారు. దేశాన్ని ప్రేమించే గుణం ఉన్న పసివాడిని వేనోళ్ల పొగడుతున్నారు. అతడి తల్లిదండ్రులను అభినందిస్తున్నారు. దేశభక్తిలో కుర్రాడు అందరిని మించిపోయాడని చెబుతున్నారు.