https://oktelugu.com/

Rajyasabha: నాలుగు దక్షిణాది రాష్ట్రాల నుంచి నలుగురు.. రాజమౌళి తండ్రికి రాజ్యసభ ఇచ్చిన మోడీ

Rajyasabha: దేశంలో అంతా ఉత్తరాది ప్రబల్యమే.. నరేంద్రమోడీ నుంచి మొదలుపెడితే అమిత్ షా వరకూ అంతా వారే.. ఇక దేశంలో ఇన్నాళ్లు ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్యను కూడా రెన్యూవల్ చేయడం లేదని.. ఆయన కూడా రిటైర్ అయిపోతున్నాడని వార్తలు. దక్షిణాదిపై కేంద్రం చిన్నచూపు అని విమర్శలు.. ఈ క్రమంలోనే మోడీ ఆశ్చర్యపరిచాడు. అనూహ్య నిర్ణయాలకు మారుపేరైన మోడీ మరోసారి రాష్ట్రపతి రాజ్యసభ కోటాలో ఇద్దరు సినీ కళా దిగ్గజాలు.. మరో క్రీడా దిగ్గజం.. ఓ సామాజిక సేవకుడికి రాజ్యసభ […]

Written By:
  • NARESH
  • , Updated On : July 6, 2022 / 09:07 PM IST
    Follow us on

    Rajyasabha: దేశంలో అంతా ఉత్తరాది ప్రబల్యమే.. నరేంద్రమోడీ నుంచి మొదలుపెడితే అమిత్ షా వరకూ అంతా వారే.. ఇక దేశంలో ఇన్నాళ్లు ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్యను కూడా రెన్యూవల్ చేయడం లేదని.. ఆయన కూడా రిటైర్ అయిపోతున్నాడని వార్తలు. దక్షిణాదిపై కేంద్రం చిన్నచూపు అని విమర్శలు.. ఈ క్రమంలోనే మోడీ ఆశ్చర్యపరిచాడు. అనూహ్య నిర్ణయాలకు మారుపేరైన మోడీ మరోసారి రాష్ట్రపతి రాజ్యసభ కోటాలో ఇద్దరు సినీ కళా దిగ్గజాలు.. మరో క్రీడా దిగ్గజం.. ఓ సామాజిక సేవకుడికి రాజ్యసభ సీటు ఇచ్చి అందరినీ ఫిదా చేశాడు.

    దేశంలో బీజేపీ వచ్చాక ఎంతో సేవ చేసే వారికి.. క్షేత్రస్థాయిలో ఎంతో గొప్ప గొప్ప పనులు చేసే వారికి ప్రాధాన్యతనిస్తున్నారు. ఖమ్మంలో వనాలు పెంచే ఓ మామూలు వ్యక్తికి సైతం పద్మ అవార్డులు ఇచ్చి కేంద్రం గౌరవించింది. ఇప్పుడు అదే కోవలో దక్షిణాది నలుగురు ప్రముఖులకు రాజ్యసభ సీట్లు ఇచ్చి గౌరవించింది.

    ప్రముఖ దర్శకుడు రాజమౌళి తండ్రి, సినీ కథా రచయిత వి. విజయేంద్రప్రసాద్ తోపాటు సంగీత దిగ్గజం ఇళయరాజా, పరుగుల రాణి పీటీ ఉషా, సామాజిక సేవకుడు వీరేంద్ర హెగ్డేలను రాజ్యసభకు నామినేట్ చేసి ప్రధాని మోడీ ప్రభుత్వం అందరినీ సర్ ప్రైజ్ చేసింది. బాహుబలి, భజరంగీ భాయ్ బాన్, ఆర్ఆర్ఆర్ లాంటి దేశం గర్వించే సినిమాలకు కథను అందించింది మన విజయేంద్రప్రసాద్ నే.. ఇక దక్షిణాదిలో ఇళయరాజా సంగీత మేస్ట్రోగా పేరొందాడు. వీరిద్దరికీ రాజ్యసభ ఇవ్వడంపై అందరిలోనూ ప్రశంసలు కురుస్తున్నాయి.

    మోడీ ఈ మేరకు ఈ నలుగురు దక్షిణాది దిగ్గజాలకు రాజ్యసభ టికెట్లు ఇస్తున్నట్టు ట్విట్టర్ లో ప్రకటించి వారి సేవలను కొనియాడారు. ఇళయరాజా సంగీత భావాలు అనేక తరాలకు నిలిచిందని.. పీటీ ఉష జీవితం అందరికీ ఆదర్శమన్నారు. విజయేంద్రప్రసాద్ దశాబ్ధాల పాటు సృజనాత్మక సేవలు అందించారని.. ఆయన సేవలు మన సంస్కృతిని విశ్వవ్యాప్తం చేశాయని మోడీ కొనియాడారు.

    Tags