Homeఆంధ్రప్రదేశ్‌Vijayawada Murder Mystery: లగ్జరీ కారులో డెడ్ బాడీ.. విజయవాడలో కలకలం

Vijayawada Murder Mystery: లగ్జరీ కారులో డెడ్ బాడీ.. విజయవాడలో కలకలం

Vijayawada murderతెలుగు ప్రాంతాల్లో హత్యల పరంపర కొనసాగుతోంది. మొన్న మెదక్ జిల్లాలో ఓ వ్యక్తిని కారు డిక్కీలో ఉంచి కారుతో సహా దహనం చేసిన సంఘటన మరువకముందే విజయవాడలో మరో హత్య వెలుగు చూసింది. ఇలా హత్యలు జరుగుతుండడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. అసలు ఈ హత్యలకు కారణాలు అన్వేషించే పనిలో పోలీసులు ఉన్నా వీటి వరుస కొనసాగడంతో ప్రజల్లో సైతం ఆందోళనలు రేకెత్తుతున్నాయి.

విజయవాడలో కారులో మృతదేహం సంచలనం సృష్టించింది. మెగల్రాజపురం(Mogalrajapuram) మానర్ ప్లాజా ఎదురుగా ఉన్న రోడ్డులో పార్క్ చేసిన కారులో డెడ్ బాడీ కనిపించింది. దీంతో కారును ఓపెన్ చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏపీ 16ఎఫ్ఎఫ్ 9999 నెంబర్ లో ఉన్న ఫోర్డ్ ఎండ్యూయర్ యజమాని రాహుల్(Rahul) అని గుర్తించారు. విజయవాడలో జిక్సిన్ సిలిండర్స్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ యజమానిగా గుర్తించారు. ప్రస్తుతం కారు పార్కు చేసిన మాచవరంలోని కాలనీకి రాహుల్ కుటుంబం చేరుకుంది. దీంతో రాహుల్ మరణం మిస్టరీగా మారింది.

రాహుల్ నిన్న రాత్రి అదృశ్యమైనట్లు తెలుస్తోంది. ఉదయం కారులో మృతదేహం లభ్యమైంది. అయితే రాహుల్ ఎలా చనిపోయారు? ఎవరైనా హత్య చేశారా? లేక ఆత్మహత్య చేసుకున్నాడా? అసలు మాచవరం ఎందుకొచ్చాడు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కేసులో ఎన్నో అంతుచిక్కని సమస్యలు వెల్లువెత్తుతున్నాయి. రాహుల్ మర్డర్ పై పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు. కేసులో ప్రతి విషయాన్ని కూలంకషంగా పరిశీలించి ఓ అవగాహనకు వస్తారని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో వరుస హత్యలపై అందరిలో ఉత్కంఠ నెలకొంది. అసలు ఇందులో ఏం జరుగుతుందో తెలియడం లేదు. ఉన్నట్లుండి ప్రాణాలు కోల్పోయే వారి గురించి ఆరా తీస్తే పలు విషయాలు వెలుగు చూస్తున్నాయి. భూతగాదాలు, అక్రమ సంబంధాలు తదితర వాటితోనే ఎక్కువగా హత్యలు జరుగుతున్నాయని తెలుస్తోంది. దీంతో వీటిపై అందరిలో కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తానికి పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ జరిపి నిజినిజాలు నిగ్గు తేల్చాల్సి ఉంది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular