
ప్రతిపక్ష నేత చంద్రబాబు లక్ష్యంగా వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు. కాలం చెల్లిన ఆలోచనలకు ఎంత పదును పెట్టినా ప్రయోజనం ఉండదు బాబూ అంటూ ట్వీట్ చేశారు.
నేను రెండు రాష్ట్రాలు తిరుగుతున్నానని తెలంగాణా డిజిపికి కంప్లెయింట్ ఇప్పించి అడ్డంగా దొరికి పోయావని పేర్కొన్నారు. మరి వైజాగ్ వెళ్లడానికి డిజిపిలను అడగకుండా కేంద్రం అనుమతి కోరుతూ ఎందుకు లేఖ రాశావు అంటూ ప్రశ్నించారు. నీ డ్రామాలు తెలియనంత అమాయకులెవరూ లేరని హితవు పలికారు
23 సీట్లతో చిత్తుగా ఓడి ఏడాది తిరగకముందే చంద్రబాబు తనకు తానే భజన చేసుకుంటున్నాడని పేర్కొన్నారు. తన పరిపాలనను తానే మెచ్చుకుంటుంటే చూసే వారికి విడ్డురంగా ఉందన్నారు.