Vijay Sangeetha reunion: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్.. తన భార్య సంగీతతో కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు. విజయ్ త్రిషతో సన్నిహిత సంబంధం కొనసాగిస్తున్నారని తమిళనాడు మీడియాలో కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. వాటికి బలం చేకూర్చే విధంగా త్రిష, విజయ్ అనేక సందర్భాలలో కనిపించారు. లియో, గోట్ సినిమాలో వారిద్దరు కలిసి నటించారు. అంతకుముందు త్రిషతో విజయ్ కలిసి నటించిన గిల్లి సినిమా సరికొత్త చరిత్ర సృష్టించింది.
విజయ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రమాణ స్వీకార కార్యక్రమానికి త్రిష వచ్చింది. త్రిషను ఆయన తల్లి సాదరంగా ఆహ్వానించింది.. విజయ్ తండ్రి కూడా ఆమెను ప్రేమతో దగ్గరికి తీసుకున్నాడు. విజయ్ ఎన్నికల ఫలితాలలో ఎక్కువ సీట్లు సాధించిన తర్వాత.. తిరుపతి వెళ్ళిన త్రిష.. నేరుగా ఆయన ఇంటికి వచ్చి శుభాకాంక్షలు తెలియజేసింది. ఆ సమయంలో గంటపాటు త్రిష విజయ్ తో కలిసి ఉంది. ఇటీవల అజిత్ మాతృమూర్తి చనిపోయినప్పుడు త్రిష విజయ్ తో కలిసి వచ్చింది. అంతకుముందు ఓ వేడుకకు విజయ్ తోనే కలిసి కనిపించింది త్రిష.
సంగీత ఎన్నికలకు ముందే విజయ్ తో తనకు విడాకులు కావాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ వాయిదాలో ఉంది. త్వరలో వారిద్దరి విడాకులకు సంబంధించి కోర్టు కీలకని తీర్పును వెల్లడించే అవకాశం ఉంది. ఇది ఇలా ఉండగానే విజయ్, సంగీత మళ్లీ కలిసిపోతున్నారని వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు జోక్యం చేసుకోవడంతో వారిద్దరు కలిసి జంటగా జీవించడానికి అంగీకారం తెలిపినట్టు తెలుస్తోంది.
ముఖ్యంగా విజయ్ తల్లి శోభ ఇద్దరి మధ్య దూరాన్ని తగ్గించడానికి ప్రయత్నించినట్టు సమాచారం. అయితే ఇంతవరకు అధికారికంగా ఈ విషయంపై ప్రకటన రాలేదు. ఒకవేళ విజయ్, సంగీత కలిసిపోతే త్రిష పరిస్థితి ఏంటి అనే చర్చ కూడా నడుస్తోంది. వచ్చే రోజుల్లో వీరిద్దరి వ్యవహారం ఎటు దారితీస్తుందో చూడాలి.
విజయ్ సీఎం అయిన తర్వాత భార్య సంగీత శుభాకాంక్షలు తెలియజేయలేదు. కుమారుడు జేసన్, కుమార్తె కూడా సోషల్ మీడియాలో కనీసం విషస్ కూడా చెప్పలేదు. కుమారుడు ఏకంగా తన పేరు నుంచి విజయ్ పేరు ని తొలగించుకోవడం విశేషం. అతడు సందీప్ కిషన్ తో సిగ్మా పేరుతో ఓ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇందులో ఫరియా అబ్దుల్లా హీరోయిన్.

