Homeఅంతర్జాతీయంVijay Mallya Kingfisher RCB : విజయ్ మాల్యా దివాళా తీయలేదు.. కింగ్ ఫిషర్, ఆర్సీబీని...

Vijay Mallya Kingfisher RCB : విజయ్ మాల్యా దివాళా తీయలేదు.. కింగ్ ఫిషర్, ఆర్సీబీని కొనేయగలడు.. అన్ని ఆస్తులున్నాయి మరి..

Vijay Mallya Kingfisher RCB : మనదేశంలో కేసులు ఎదుర్కొంటూ.. వాటిని పరిష్కరించుకునేంత సామర్థ్యం లేక.. దేశం విడిచి పారిపోయాడు విజయ్ మాల్యా. ఒక వ్యాపారి, ఒక క్రీడాకారుడు, డబ్బును ప్రేమించే వ్యసనపరుడు.. విజయ్ మాల్యాలో ఉన్నారు . కింగ్ ఫిషర్ విమానయాల సంస్థలు మూసివేసిన తర్వాత మాల్యా దరిద్రం మొదలైంది. ఆర్థికంగా అవకతవకలు.. తీసుకున్న అప్పులను తిరిగి చెల్లించకపోవడం వంటి తీవ్రమైన ఆరోపణల తర్వాత 2016లో దేశాన్ని విడిచి మాల్యా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మళ్లీ ఇండియాలో అడుగుపెట్టలేదు.. రాజ్ షమానీ అనే యూట్యూబ్ నిర్వహించిన పాడ్ కాస్ట్ లో విజయ్ మాల్యా పాల్గొన్నాడు. ఈ సందర్భంగా రాజ్ అనేక విషయాలను మాల్యాను అడిగాడు. ఆర్థిక అవకతవకల నుంచి మొదలుపెడితే కింగ్ ఫిషర్ క్యాలెండర్ వరకు ప్రతి విషయాన్ని మొదటి ప్రస్తావించాడు..” నేను దొంగతనం చేయలేదు. అయినప్పటికీ నన్ను దొంగ అని అంటున్నారు. ప్రభుత్వం నన్ను లక్ష్యంగా చేసుకుంది. మీడియా అడ్డగోలుగా కథనాలను ప్రసారం చేసింది.. బ్యాంకుల నుంచి 4000 కోట్ల కంటే ఎక్కువగా తీసుకొని ఉంటాను. వడ్డీ మొత్తం కలిపి 6,203 కోట్లు అవుతుంది కావచ్చు. కానీ ప్రభుత్వం నా ఆస్తులను స్వాధీనం చేసుకొని 14, 131.60 కోర్టులో రికవరీ చేసింది. నేను చెల్లించాల్సిన దానికంటే ఎక్కువ డబ్బు తీసుకున్నప్పటికీ.. తన దొంగ అని అంటున్నారని” విజయ్ మాల్యా వాపోయాడు..

అపారమైన ఆస్తులు

పేరుకు విజయ్ మాల్యా దివాళ తీశాడు అని అందరూ అనుకుంటున్నారు. కానీ అందరికీ అపరమైన ఆస్తులు ఉన్నాయి.. మనదేశంలోనే కాకుండా విదేశాలలో కూడా అతనికి వ్యాపారాలు ఉన్నాయి.. విజయ్ మాల్యాకు కార్నివాల్ టెర్రస్ ప్రాంతంలో 18, 19 నెంబర్ ప్లాట్లు ఉన్నాయి. ఇది లండన్ లో 19వ శతాబ్దంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన భవనం..

ఇంగ్లీష్ గడ్డపై హెర్ట్ ఫోర్డ్ షైర్ ప్రాంతంలో లేడి వాక్ మాన్షన్ ఉంది.

దేశ ఆర్థిక రాజధాని లోని నేపియన్ సీ రోడ్ ప్రాంతంలో భారీ బిల్డింగ్ ఉంది.

కర్ణాటక రాజధాని లోని కింగ్ ఫిషర్ టవర్ ప్రాంతంలో ఒక పెద్ద పెంట్ హౌస్ ఉంది.

అమెరికాలోని కాలిఫోర్నియాలో అత్యంత విలాసవంతమైన భవనం ఉంది.

శ్వేత దేశ ఆర్థిక రాజధాని లో ట్రంప్ ప్లాజా పేరుతో పెంట్ హౌస్ ఉంది.

ఇక ఫ్రాన్స్ ప్రాంతంలోని సెయింట్ మార్గ రీట్ ద్వీపంలో లే గ్రాండ్ జార్డిన్ ఎస్టేట్ ఉంది.

ఈ ఆస్తుల విలువ వందల కోట్లల్లో ఉంటుంది. ఇప్పటికిప్పుడు ఈ ఆస్తులు మొత్తం అమ్మేస్తే.. విజయ్ మాల్యా కింగ్ ఫిషర్ కంపెనీని సులభంగా కొనేయగలడు. అంతేకాదు తన మానస పుత్రిక రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చట్టం కూడా సొంతం చేసుకోగలడు. కాకపోతే ఇవి సాధ్యం కావు. ఎందుకంటే విజయ్ మాల్యా కు సంబంధించిన నేరాలు ఇంకా విచారణ పూర్తి చేసుకోలేదు. అంతేకాదు ఆయనపై ఆర్థిక మోసాలకు సంబంధించిన కేసులు ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ పరిష్కారమయ్యి.. ఇండియాలో విజయ్ మాల్యా అడుగు పెట్టాలంటే అది అయ్యే పని కాదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version