Vijay Diwas: భారత్ తో సరిహద్దును పంచుకున్న పాకిస్తాన్ ఇప్పటికీ రెండు సార్లు ప్రత్యక్ష యుద్ధంలో తలపడింది. చాలా సార్లు పరోక్ష యుద్ధం చేసింది. ఉగ్రవాదులను ఎగదోసింది. దొంగదెబ్బలు తీసింది. చాలా వరకు భారత్ కే విజయాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ఇరు దేశాల మధ్య 1971లో జరిగిన యుద్ధంలో భారత్ అద్భుత విజయాన్నిసొంతం చేసుకుంది. ఈ యుద్ధంతో బంగ్లాదేశ్ కు స్వాతంత్ర్యం వచ్చింది. తమ ప్రాణాల్ని పణంగా పెట్టి సైనికులు భారత్ ను గెలిపించారు. ఈ యుద్ధం జరిగి నేటితో 50 ఏళ్లు పూర్తవుతుంది. ఆ యుద్ధానికి సంబంధించిన గుర్తులు ఇప్పటికీ భారతీయుల్లో చెరగని ముద్రగా ఉన్నాయి. అయితే 1971లో అసలేం జరిగింది..? ఆ యుద్ధంలో జరిగిన సంఘటనలేంటి..? ఒక్కసారి మననం చేసుకుందాం..
1971లో తూర్పు పాకిస్తాన్లో జరిగిన ఎన్నికల ఫలితాలను ఆ దేశం తొక్కి పెట్టడంతో బంగ్లాదేశ్ విముక్తి అంశం తెరపైకి వచ్చింది. ఈ వివాదం యుద్ధానికి దారి తీసింది. పాకిస్తాన్ నుంచి విడిపోయి సొంత దేశాన్ని ఏర్పాటు చేసకోవాలని 1971 మార్చి 26న బంగ్లాదేశ్ పిలుపునిచ్చింది. ఆ తరువాత రోజు వారి స్వాతంత్ర్య పోరాటానికి భారతదేశం పూర్తి మద్దతు ప్రకటించింది. అప్పట్లో పాకిస్తాన్ మిలటరీ బెంగాలీలపై ప్రధానంగా హిందువులపై ఎన్నో దారుణాలకు పాల్పడింది. దీంతో సుమారు 10 మిలియన్ల మంది ప్రజలు మన దేశానికి వలస వచ్చారు.
పాకిస్తాన్ వైమానిక దళం మన దేశంలోని వాయువ్య ప్రాంతంలో దాడులు చేయడం ప్రారంభించింది. ఈక్రమంలో 1971 డిసెంబర్ 3న పాకిస్తాన్ ఇండియాలోని 11 వైమానిక స్థావరాలపై దాడులు ప్రారంభించింది. అయితే పాకిస్తాన్ కదలికలను ముందుగానే గ్రహించిన భారత్ సత్వరమే స్పందించింది. వైమానిక దళం జెట్ లు పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్, ఎయిర్ ఫీల్డులపై బాబు దాడి చేశాయి. అవి ఇండయా గడ్డపై పడకుండానే వాటిని నిలువరించింది. ఈ క్రమంలో భారత వాయుసేన రోజుకు 500 కంటే ఎక్కవ సోర్టీలను అమలు చేసింది. ఇది రెండో ప్రపంచ యుద్ధం కంటే ఎక్కువ. మరోవైపు పాకిస్తాన్ కూడా భారత్ లోని అన్ని రంగాలపై దాడులకు ఎగబడింది. రాజస్థాన్ లోని జైసల్మేర్ జిల్లాలోని లోంగేవాలపై ఇస్లామాబాద్ నుంచి దాడి చేసింది. తొమ్మిది మిలియన్లకు పైగా పాకిస్తాన్ లోని హిందూ శరణార్థులు ఆ సమయంలో భారత్లోకి ప్రవేశించారు.
Also Read: తెలంగాణ ఉద్యమంలో తెరవెనుక ఏం జరిగింది.. తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ నేత విఠల్’ చెప్పిన సంచలన నిజాలు
తూర్పు పాకిస్తాన్ లోని ముక్తి బాహిని గెరిల్లా దళాలు భారత బలగాలతో చేతులు కలిపి పాకిస్తాన్ సైన్యంతో కలిసి పోరాటం చేశాయి. ముక్తి బాహిని గెరిల్లా సభ్యులకు భారత సైన్యం శిక్షణ ఇచ్చి ఆయుధాలను అందజేసింది. అప్పట్లో సోవియట్ యూనియన్ దేశం కూడా బంగ్లాదేశ్ విముక్తికి సహకరించింది. అయితే అమెరికా మాత్రం పాకిస్తాన్ కు మద్దతుగా నిలిచింది. ఓ యుద్ధ విమానాన్ని బంగాళాఖాతం వద్ద పాకిస్తాన్ తరుపున మోహరించారు.
ఇలా 13 రోజుల పాటు నిరంతరాయంగా యుద్ధం జరిగిన తరువాత డిసెంబర్ 16న ఢాకాలో 93,000 మందికిపైగా పాకిస్తానీ సైనికులను బలవంతంగా లొంగిపోయేలా చేసింది. అప్పటి భారత ప్రధానమంత్రి ఇందిరా గాంధీతో కలిసి వ్యహాత్మక ఆలోచనలో కూడా సోవియన్ యూనియన్ తో శాంతి, స్నేహం, సహకరానికి సంబంధించిన ఇండో, సోవియన్ ఒప్పందాన్ని చేసుకున్నాయి. సోవియట్ ఒత్తిడితో చివరికి అమెరికా, చైనాలను పాకిస్తాన్ కు మద్దతుగా ఇండియాపైకి రాకుండా చేశాయి. అయితే ఈ యుద్ధం మొత్తంలో భారత్, పాకిస్తాన్ కు చెందిన 3,800 మంది సైనికుల ప్రాణాలు కోల్పోయారు. తూర్పు పాకిస్తాన్, బంగ్లాదేశ్లోని 3 లక్షల మంది పౌరులు మరణించారని అంచనా వేశారు. ఆ తరువాత 1972లో జరిగిన సిమ్లా ఒప్పందంలో భాగంగా 93,000 సైనికులకు విముక్తి కల్పించారు.