Homeజాతీయ వార్తలుVijay Sangeeta Divorce: రెండో భార్యగా నైనా ఉంటా.. విజయ్ సీఎం కాగానే మనసు మార్చుకున్న...

Vijay Sangeeta Divorce: రెండో భార్యగా నైనా ఉంటా.. విజయ్ సీఎం కాగానే మనసు మార్చుకున్న మొదటి భార్య

Vijay Sangeeta Divorce: తమిళనాడులో విజయ్ త్వరలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయన పార్టీకి మ్యాజిక్ ఫిగర్ రాకపోయినప్పటికీ.. విజయ్ ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. పైగా ఇప్పటికే తన పార్టీ కీలక నేతల ద్వారా కాంగ్రెస్ అగ్ర నాయకత్వంతో మంతనాలు జరుపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీనిపై డిఎంకె అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ విజయ్ ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదని తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి.. పార్టీ నాయకులతో చర్చలు జరుపుతున్న విజయ్ ఇప్పటికే మంత్రివర్గం కూర్పు పై ఒక క్లారిటీకి వచ్చినట్టు తెలుస్తోంది.

రాజకీయంగా విజయ్ దూకుడు కొనసాగించినప్పటికీ.. కుటుంబ జీవితంలో మాత్రం విజయ్ ఇబ్బంది పడుతూనే ఉన్నారు. విజయ్ భార్య సంగీత ఎన్నికలకు ముందు ఆయనతో విడాకులు కావాలని కోర్టు మెట్లు ఎక్కారు. ఆయన ఒక నటి తో సంబంధాలు కొనసాగిస్తున్నారని.. అందువల్లే ఆయన నుంచి తనకు విడాకులు మంజూరు చేయాలని ఆమె ఆ ఫిర్యాదులో కోరారు. సంగీత భారీగా భరణాన్ని కోరిన నేపథ్యంలో.. విజయ్ అంత మొత్తం ఇవ్వలేడని చెప్పినట్టు అప్పట్లో తమిళ్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత సంగీత కోరిన భరణం మొత్తం ఇస్తానని సంకేతాలు పంపినట్టు కూడా వార్తలు వచ్చాయి.

సంగీత, విజయ్ విడాకుల వ్యవహారం కోర్టు మెట్ల దాకా ఎక్కిన నేపథ్యంలో.. ఈ కేసును మే 15 కు చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టు వాయిదా వేసింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి హోదాలో విజయ్ కోర్టు ఎదుట హాజరవుతారా.. లేదా మినహాయింపు కొడతారా.. అనే విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది. ఈ చర్చ ఎలా సాగుతుండగానే విజయ్, సంగీత కు సంబంధించిన మరో వ్యవహారం ఇప్పుడు ఒకటి వెలుగులోకి వచ్చింది..

విజయ్ ముఖ్యమంత్రి అవుతున్న నేపథ్యంలో తమిళనాడు ప్రధమ మహిళ హోదాను వదులుకోవడానికి సంగీత సిద్ధంగా లేరని తెలుస్తోంది. అందువల్లే తాను విజయ్ భార్యగా ఉండేందుకు సిద్ధమని సంకేతాలు పంపినట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.. త్రిష రెండో భార్యగా ఉన్నప్పటికీ తనకు ఇబ్బంది లేదని.. తను విజయ్ తో ఉంటానని సంగీత చెప్పినట్టు తెలుస్తోంది. అయితే ఇంతవరకు సంగీత ఈ విషయంలో ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. కనీసం తన సోషల్ మీడియా ఖాతా ద్వారా కూడా ఈ విషయాన్ని చెప్పలేదు. కొంతమంది గాసిప్ రాయుళ్లు మాత్రం పిచ్చిపిచ్చిగా వార్తలను ప్రసారం చేస్తున్నారు.. వాస్తవానికి విడాకుల కేసు కోర్టు మెట్ల దాకా వచ్చినప్పుడు సంగీత తన నిర్ణయాన్ని ఎలా వెనక్కి తీసుకుంటారని చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే విజయ్ కొడుకు తండ్రితో చాలా రోజులుగా దూరంగా ఉంటున్నాడు. తన పేరులో ఉన్న విజయ్ ని తొలగించుకున్నాడు.. విజయ్ కూతురు దివ్య కూడా తల్లితో ఉంటున్నది. ఆమె విదేశాలలో చదువుతున్నది. తన తండ్రి ఈ స్థాయిలో విజయం సాధించినప్పటికీ జేసన్, దివ్య ఇంతవరకు ఎటువంటి ప్రకటనలు సోషల్ మీడియాలో చేయలేదు. కనీసం తన తండ్రికి శుభాకాంక్షలు చెప్పినట్టు కూడా వార్తలు రాలేదు. విజయ్ భారీ విజయం సాధించిన తర్వాత ఆయన ఇంట్లో సంబరాలు జరిగాయి. అక్కడ దివ్య కనిపించలేదు.. జేసన్ కూడా లేడు. అలాంటప్పుడు విజయ్ తో కలిసి ఉంటానని సంగీత ఎలా అంటారని తమిళ విశ్లేషకులు చెబుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

India vs Zimbabwe : ఆరు ఓటముల తర్వాత.. అయ్యర్ పొలంలో మొలకలు.. కానీ ఇది సరిపోదు..

India vs Zimbabwe : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలోను వైట్ వాష్.. బ్యాటింగ్ బలంగా లేదు. బౌలింగ్ గొప్పగా లేదు.. ఫీల్డింగ్ చెప్పుకొనే స్థాయిలో లేదు. ఆటగాళ్లు ఏమైనా...

Dharmendra Pradhan : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. నరేంద్ర మోడీ తదుపరి ఏం చేయబోతున్నారు..

Dharmendra Pradhan : సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రధాన్ రాజీనామా చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనలకు తలవంచి.. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ప్రధానమంత్రి నరేంద్ర...

Narendra Modi : కొత్త విద్యాశాఖ మంత్రి ఇతనే అనూహ్యంగా మోడీ మనస్సు ఇతడి మీదికే ఎందుకంటే..

Narendra Modi : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కొత్త విద్యాశాఖ మంత్రి ఎవరు అనే చర్చ మొదలైంది. వాస్తవానికి ధర్మేంద్ర రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న తర్వాత.. నరేంద్ర మోడీ వెంటనే...

Donald Trump : ఈయూ జరిమానాలపై కన్నెర్రజేసిన ట్రంప్‌.. అమెరికా కంపెనీల రక్షణకు చర్యలు!

Donald Trump : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఏడాది కాలంపాటు అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని తరలించడం, అమెరికా వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సరుకులపై...

Harish Rao : బిజెపిలోకి హరీష్ రావు.. కేటీఆర్ ఏమన్నారంటే..

Harish Rao : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏదో ఒక సందర్భంలో మీడియాలో బలంగా ప్రచారానికి.. నాయకుల మధ్య చర్చకు కారణమయ్యే అంశం ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీలో హరీష్...
Oktelugu Epaper
Exit mobile version