AP Political Alliances : జగన్ మోహన్ రెడ్డి, చంద్రబాబు దొందూ దొందే.. రాష్ట్రప్రయోజనాలను తాకట్టు పెట్టినప్పుడు ఎవ్వరినీ ఊపేక్షించకూడదు. జనసేన రాష్ట్రప్రయోజనాల కోసం జనం పక్షం వహించాలి. ఎందుకంటే ఎన్నికల పొత్తులు వేరు.. రాష్ట్ర ప్రయోజనాలు వేరు. ప్రజల కోసం ఆలోచించాలి. ప్రధానంగా చూస్తే.. ఓ పెద్ద పెట్టుబడిని ఆంధ్రా ప్రభుత్వం ఇటీవల పోగొట్టుకుంది. నాడు చంద్రబాబు, ఈనాడు జగన్ మోహన్ రెడ్డి అదే నిర్లక్ష్యం చేశారు.
విభజన చట్టంలో ఓ మేజర్ పోర్టు ఇస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. ఈ పోర్టు విషయంలో నాడు చంద్రబాబు, నేడు జగన్ ఇద్దరూ కలిసి రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచారు. హామీలు నెరవేర్చడం లేదని కేంద్రంపై దుమ్మెత్తిపోసే వీరిద్దరూ కూడా ఈ విషయంలో ఫెయిల్ అయ్యారు.
గడ్కరీ నాడు చంద్రబాబుకు లేఖ రాస్తే దుగ్గరాజపట్నంను ఎంపిక చేస్తే ‘ఇస్రో’ అడ్డుకుంది. వేరే పోర్ట్ సజెస్ట్ చేయాలని కేంద్రం చెబితే చంద్రబాబు ఒప్పుకోలేదు. చంద్రబాు దుగ్గరాజపట్నంకే పట్టుబట్టాడు. నవయుగ కంపెనీకి మేలు చేసేందుకు చంద్రబాబు ఇలా కుట్ర చేశారని సమాచారం. చంద్రబాబుకు సన్నిహితులకు దీన్ని దోచిపెట్టేందుకు ఇలా చేసినట్టు తెలిసింది. కేంద్రం ఒప్పుకోలేదు.
ఇక జగన్ ప్రభుత్వం వచ్చాక కూడా రామాయపట్నంను కేంద్రం పోర్టు చేస్తానంటే ఒప్పుకోవడం లేదు. జగన్ దీనిపై నిర్లక్ష్యం వహించాడు. కేబినెట్ 65500 కోట్లను ఆమోదించి సాక్షన్ చేసినా జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఏదో ఒక పోర్టును జగన్ సూచించినా ఇంత పెట్టుబడి ఏపీకి దక్కింది. ఈ విషయంలో చంద్రబాబు, జగన్ ఫెయిల్ అయ్యారని చెప్పొచ్చు.
రాష్ట్ర ప్రయోజనాల కోసం జనసేన జనం పక్షమే ఉండాలన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు.