Telangana Election Results 2023: కాంగ్రెస్ విజయం.. వైరల్ అవుతున్న రోజా మాటలు

నవంబర్ 30వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు జరిగాయి. ఈ సందర్భంగా రోజా భారత రాష్ట్ర సమితికి ఓటు వేయాలని, భారత రాష్ట్ర సమితి అధికారంలోకి వస్తేనే తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని వ్యాఖ్యలు చేస్తూ.. ఓటర్లను అభ్యర్థించారు.

Written By: Anabothula Bhaskar, Updated On : December 3, 2023 5:56 pm

Telangana Election Results 2023

Follow us on

Telangana Election Results 2023: రాజకీయ నాయకులను మాత్రాన ఏది పడితే అది మాట్లాడితే చెల్లుబాటు కాదు. సోషల్ మీడియా బలంగా ఉన్న ఈ రోజుల్లో రాజకీయ నాయకులు ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. ఇందులో ఏ మాట కొంచెం తప్పుగా మాట్లాడినా దాని పర్యవసనాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ప్రస్తుతం ఇదే పరిస్థితిని సినీనటి, ఏపీ మంత్రి రోజా చవిచూస్తున్నారు. సాధారణంగానే పరుష పదజాలానికి కేరాఫ్ అడ్రస్ గానిలిచే రోజా అంతకుముందు ఆమె మాట్లాడిన మాటలు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన నేపథ్యంలో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇంతకీ ఏమన్నారంటే

నవంబర్ 30వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు జరిగాయి. ఈ సందర్భంగా రోజా భారత రాష్ట్ర సమితికి ఓటు వేయాలని, భారత రాష్ట్ర సమితి అధికారంలోకి వస్తేనే తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని వ్యాఖ్యలు చేస్తూ.. ఓటర్లను అభ్యర్థించారు. భారత రాష్ట్ర సమితికి ముందస్తుగా శుభాకాంక్షలు తెలిపారు. కచ్చితంగా భారత రాష్ట్ర సమితి అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. కానీ తీరా ఎన్నికల ఫలితాలు వచ్చేసరికి పూర్తిగా తేడా కొట్టేసింది. ఇప్పుడు రోజా చేసిన వ్యాఖ్యలను కొంతమంది నెటిజెన్లు ట్రోల్ చేస్తున్నారు.

అందుకే ఓడిపోయింది

రోజా సోషల్ మీడియా వేదిక చేసిన వ్యాఖ్యల వల్లే కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందని నెటిజన్లు మండిపడుతున్నారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరిందని.. అప్పుడు ఏం జరిగిందో తెలుసునని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు భారత రాష్ట్ర సమితికి అనుకూలంగా మాట్లాడి.. ఆ పార్టీ ఓటమికి కారణమైందని మండిపడుతున్నారు. మరికొందరు మాత్రం రోజా ముందస్తుగా శుభాకాంక్షలు మాత్రమే చెప్పిందని.. ప్రజావ్యతిరేకత తీవ్రంగా ఉన్నప్పుడు ఆమె మాత్రం ఏం చేస్తుందని అంటున్నారు. కాగా రోజా తెలంగాణలో తన ఆస్తులను కాపాడుకునేందుకే భారత రాష్ట్ర సమితికి అనుకూలంగా వ్యాఖ్యలు చేసిందని.. కానీ ఇప్పుడు ఆ పార్టీ అధికారానికి దూరమైందని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ విజయం.. రోజా చేసిన కామెంట్లు.. ఇప్పుడు వైరల్ గా మారాయి