Telangana Leader VH Demand: ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటు లొల్లి ఆగడం లేదు. తమ ప్రాంతాలను వేరే జిల్లాలో కలపొద్దని డిమాండ్లు పెరుగుతున్నాయి. మరోవైపు విజయవాడకు ఎన్టీఆర్, మన్యంకు అల్లూరి, కడపకు వైఎస్ఆర్ పేర్లు పెట్టిన జగన్ కు మరికొన్ని ప్రతిపాదనలు వస్తున్నాయి. కర్నూలు జిల్లాకు మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలనే ప్రతిపాదన డీఎస్ వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు కోసం ఎంతో చేసిన సంజీవయ్యను జగన్ ఎలా మరిచిపోయారనే వాదన వస్తోంది. దీంతో జగన్ మారోమారు పునరాలచించుకోవాల్సిన అవసరం ఏర్పడింది.

చారిత్రక ప్రాధాన్యం దృష్ట్యా ప్రజల డిమాండ్ల మేరకే నిర్ణయాలు తీసుకుంటున్నా కొన్ని చోట్ల మాత్రం సఖ్యత కుదరడం లేదు. జిల్లా కేంద్రాల ఏర్పాటు విషయంలో ఏకాభిప్రాయం రావడం లేదు. దీంతో ప్రజల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ వేగవంతమైన సందర్భంలో ఇంకా కొన్నింటి విషయంలో ఎటూ తేలడం లేదు. దీంతోనే ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది. ఫలితంగా ఉద్యమం చేసేందుకు సైతం వెనుకాడటం లేదు.
కొత్త జిల్లాల ఏర్పాటుపై తెలంగాణలో కూడా చర్చ సాగుతోంది. పేర్ల కేటాయింపులో ఆసక్తికర చర్చ సాగుతోంది. కొన్ని చోట్ల అసంతృప్తులు వస్తున్నా సర్కారు మాత్రం పట్టించుకోవడం లేదు. కర్నూలు జిల్లా విషయంలో వీహెచ్ తెచ్చిన ప్రతిపాదనపై అందరిలో ఆలోచన రేకెత్తిస్తోంది. సంజీవయ్య పేరును ఎందుకు మరచిపోయారనే ప్రశ్నలు అందరిలో వస్తున్నాయి. ఈ మేరకు జగన్ పై ఒత్తిడి తీసుకురానున్నట్లు తెలుస్తోంది.
Also Read: తెలంగాణ బీజేపీ ముఖ్యనేతలు పోటీ చేసే అసెంబ్లీ స్థానాలివే..!
కడప జిల్లాలో రాజంపేట పెద్ద సెంటర్ అయినా రాయచోటిని జిల్లా కేంద్రం చేయడంపై కూడా విమర్శలు పెరుగుతున్నాయి. సొంత పార్టీ నేతలే జగన్ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు చిత్తూరు జిల్లాపై కూడా విమర్శల దాడి కొనసాగుతోంది. మదనపల్లిని జిల్లా కేంద్రంగా చేయాలనే డిమాండ్లు వచ్చినా దాన్ని రాయచోటిలో కలపడంతో పురపాలక సంఘం కార్యవర్గం రాజీనామా చేస్తామని చెప్పడం కొసమెరుపు.
విశాఖపట్నం, కృష్ణా జిల్లాల్లో సైతం ఆందోళనలు పెరుగుతున్నాయి. సర్కారు నిర్ణయాల వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రభుత్వంపై అందరి అభిప్రాయాలు నెరవేర్చాల్సిన అవసరం ఉన్నందున సర్కారు ఏ మేరకు నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.
Also Read: జగన్ కు మరో రెండు షాక్ లు.. సమ్మెలోకి ఆర్టీసీ, వైద్యఉద్యోగులు
[…] Also Read: Telangana Leader VH Demand: కర్నూలుకు సంజీవయ్య పేరు ఎం… […]