Vande Bharat Express: వందేభారత్‌ గంటకు 180 కి.మీల స్పీడు ఉత్తదేనా? అంతా ఫేకా?

Vande Bharat Express: కేంద్ర ప్రభుత్వం, ఇండియన్‌ రైల్వే ఎంత్రో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వందేభారత్‌ రైళ్లు సరాసరిన గంటకు 83 కిలోమీటర్ల వేగంతో నడుస్తున్నాయని అధికారులు తెలిపారు. గంటకు 180 కి.మీ. గరిష్ట వేగంతో నడిచేలా తయారైన ఈ రైళ్లను మన ట్రాక్‌పై 130 కి.మీ. వేగంతో నడపవచ్చు. అయితే రైలు మార్గాల్లో నాణ్యత లేమి వల్ల తక్కువ వేగంతోనే నడుపుతున్నట్లు సమాచార హక్కు చట్టం కింద అందిన దరఖాస్తుకు రైల్వే శాఖ బదులిచ్చింది. కనిష్టం 64 […]

Written By: Raj Shekar, Updated On : April 18, 2023 2:24 pm
Follow us on

Vande Bharat Express

Vande Bharat Express: కేంద్ర ప్రభుత్వం, ఇండియన్‌ రైల్వే ఎంత్రో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వందేభారత్‌ రైళ్లు సరాసరిన గంటకు 83 కిలోమీటర్ల వేగంతో నడుస్తున్నాయని అధికారులు తెలిపారు. గంటకు 180 కి.మీ. గరిష్ట వేగంతో నడిచేలా తయారైన ఈ రైళ్లను మన ట్రాక్‌పై 130 కి.మీ. వేగంతో నడపవచ్చు. అయితే రైలు మార్గాల్లో నాణ్యత లేమి వల్ల తక్కువ వేగంతోనే నడుపుతున్నట్లు సమాచార హక్కు చట్టం కింద అందిన దరఖాస్తుకు రైల్వే శాఖ బదులిచ్చింది.

కనిష్టం 64 కి.మీ.. గరిష్టం 95 కి.మీ..
వందేభారత్‌ రైళ్లను భారత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టింది. ప్రయాణికులకు వేగవంతమైన కచ్చితమైన సేవలు అందించేందుకు ఈ రైళ్లను ప్రైవేటు భాగస్వామ్యంతో రైల్వే శాఖ ప్రవేశపెడుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 15 వందేభారత్‌ రైళ్లు పట్టాలెక్కాయి. అయితే ఈ రైళ్లలో ముంబై–షిర్డీ రైలు అత్యల్పంగా గంటకు 64 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. ఇక గరిష్ట వేగం న్యూఢిల్లీ – వారణాసి మధ్య గంటకు 95 కిలోమీటర్ల వేగంతో వందేభారత్‌ రైలు పరుగులు పెడుతోంది. మిగతా రైళ్లన్నీ ఈ వేగం మధ్యలోనే ఉన్నాయి.

ఆగ్రా మార్గంలో గరిష్ట వేగం..
ఇక ఆగ్రా కంటోన్మెంట్‌– తుగ్లకాబాద్‌ రైలు మాత్రం గంటకు 160 కి.మీ. వేగంతో ప్రయాణిస్తోంది. ఈ మార్యగంలో ట్రాక్‌ వందేభారత్‌ రైలుకు అనుగుణంగా ఉండడం, ట్రాఫిక్‌ కూడా తక్కువగా ఉండడంతో రైల్వే శాఖ ఈ ఒక్క మార్గంలో మాత్రం గరిష్ట వేగంతో రైలు నడుపుతోంది.

చెన్నైలో తయారీ…
చెన్నైలోని ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ని డిజైన్‌ చేసి తయారు చేసింది. భారత ప్రభుత్వం మేక్‌ ఇన్‌ ఇండియా చొరవ కింద మొదటి రైలును రూ.97 కోట్లతో 18 నెలల్లో తయారు చేశారు. గరిష్ట వేగం గంటకు 180 కిలోమీటర్లుగా తీర్చిదిద్దారు. ఈ అత్యాధునిక రైలును గతంలో ట్రైన్‌ 18 అని వ్యవహరించారు. ఆ తరువాత 2019, జనవరి 27న వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ అని పేరు పెట్టారు.

Vande Bharat Express

ప్రచారం వట్టిమాటేనా..
ఇక వందేభారత్‌ భారతదేశ రైలు అని కేంద్రం గర్వంగా చెబుతోంది. అయితే వేగం మాత్రం ప్రకటించినంత లేకపోవడంపై ప్రయాణికులు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రైళ్లో ఉన్న సౌకర్యాలపై సంతృప్తిగా ఉన్న ప్రయాణికులు వేగం పెంచాలని కోరుతున్నారు. అయితే ట్రాక్‌ సమస్యతోనే రైళ్ల వేగం తగ్గించామని రైల్వే అధికారులు చెబుతున్నారు. ట్రాక్‌ను ఆధునికీకరిస్తే వేగం పెంచేందుకు సిద్ధమని పేర్కొంటున్నారు. మరి రానున్న రోజుల్లో అయినా వందేభారత్‌ వేగం పెరుగుతుందో లేదో చూడాలి.