Vanama Raghava: వనమా రాఘవ పేరు ప్రస్తుతం రాష్ర్టవ్యాప్తంగా మారుమోగుతోంది. అతడి మూలంగా చాలా కుటుంబాలు బాధితులుగా మారారు. కానీ కొందరు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రాకపోగా కొందరు మాత్రం అతడి తీరును తప్పుపడుతూ పలుమార్లు ఫిర్యాదు చేశారు. దీంతో రాఘవ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసుల లిస్టులో కూడా రాఘవ పేరు ప్రముఖంగానే ఉన్నా చర్యలు తీసుకోవడానికి మాత్రం వెనుకంజ వేసినట్లు తెలుస్తోంది.
రాఘవ అరెస్టులో కూడా పోలీసులు అందరిని తప్పుదారి పట్టిస్తున్నారు. ఒకసారి అదుపులోకి తీసుకున్నామని చెబుతూ మరోసారి లేదని బుకాయిస్తున్నారు. దీంతో వారి ప్రవర్తనపై కూడా అనుమానాలు వస్తున్నాయి. రాఘవ ప్రోద్బలంతోనే అనేక ఆకృత్యాలు జరిగినట్లు తెలుస్తోంది. అయినా అతడిని పట్టుకోవడంలో పోలీసులు ఎందుకు వెనకడుగు వేస్తున్నారో అర్థం కావడం లేదు.
Also Read: మరో సెల్ఫీ వీడియో: రామకృష్ణ అక్కతో వనమా రాఘవకు అక్రమ సంబంధమా?
గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న రాఘవ కొద్దిరోజుల క్రితమే టీఆర్ఎస్ లో చేరారు. ప్రస్తుతం నేరగాడిగా పేరు పొందిన రాఘవను టీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఇప్పటికైనా టీఆర్ఎస్ రాఘవ విషయంలో గట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. రాఘవపై పలుమార్లు ఫిర్యాదులు వచ్చినా స్పందించలేదు. అతడి తీరుతో పలు కుటుంబాలు రోడ్డున పడిన విషయం తెలిసిందే.
ఇంత నేర ప్రవృత్తి కలిగిన రాఘవ విషయంలో టీఆర్ఎస్ పార్టీ ఇన్నాళ్లు ఎందుకు పట్టించుకోలేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాఘవ తండ్రి వెంకటేశ్వర్ రావు వయసు కూడా పెరిగిపోతోంది. ఇన్నాళ్లు రాజకీయ వారసుడు రాఘవ అనుకున్నా ప్రస్తుత పరిస్థితుల్లో అతడికి రాజకీయ భవిష్యత్ కనిపించడం లేదు. దీంతో రాజకీయ వారసుడి కొరత ఏర్పడనుంది. కానీ ప్రస్తుతం రాఘవ వ్యవహారం రాష్ర్టంలో సంచలనంగా మారింది.
Also Read: నా చావుకు రాఘవనే కారణం.. రామకృష్ణ మరో వీడియో బయటకు..