
‘పుష్ప’ సినిమా కోసం సుకుమార్ ఓ కొండ మీదకు అయిదు వందల మందిని తీసుకెళ్లడానికి దారి చేసినట్లు, రోప్ కేమేరా వంటి టెక్నాలజీని కూడా వాడినట్లు చెబుతున్నారు. ఈ విషయాన్ని సుకుమార్ ని పక్కన పెట్టుకుని దేవి శ్రీ ప్రసాద్ స్ఫష్టం చేశాడు. ఉప్పెన సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న సుక్కు, దేవి ఈ సంగతి చెబుతూ.. కొండ మీదకు అయిదు వందల మందిని తీసుకెళ్లడం ఒక్క సుక్కుకే సాధ్యం అన్నట్లు చెప్పుకొచ్చాడు. కాగా ఆ కొండ మీద సీన్ విజువలైజ్ చేసుకుని చూసుకుంటే అద్భుతంగా వుంటుందని అంటున్నారు.
Also Read: హైపర్ ఆది పెళ్లి.. అమ్మాయి ఎవరో తెలుసా?
మొత్తానికి పుష్ప సినిమాతో కొత్త సుకుమార్ ను చూస్తారని కూడా నిర్మాతలు చెప్పుకొస్తున్నారు. పైగా పుష్ప లాంటి సినిమా ఊహించడమే కష్టం అని కూడా అంటున్నారు. ఈ రేంజ్ లో చెబుతున్నారు అంటే మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. క్రియేటివ్ డైరెక్టర్ గా సుకుమార్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ మూవీని స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఆగష్టు 13న విడుదల చేస్తున్నారు. అయితే సినిమాను కుదిరితే సంవత్సారాల పాటు చెక్కుతూ కూర్చోటానికి మొగ్గు చూపే సుకుమార్, ముందుగా నిర్ణయించిన తేదీకి మూవీని పూర్తి చేస్తాడా అంటే.. అనుమానమే.
ఇండస్ట్రీలో వినిపిస్తుంది.
Also Read: ‘ఆదిపురుష్’ కు పోటీగా ‘రామాయణ్’.. రాముడిగా మహేష్.. హనమంతుడిగా బన్నీ?
‘పుష్ప’ సినిమా రేపటి నుండి సాంగ్ షూట్ లో బిజీ అవ్వనుంది. శేఖర్ మాస్టర్ కంపోజ్ చేస్తోన్న ఈ సాంగ్ లో కాస్త రొమాన్స్ ఘాటుగా ఉంటుందని.. అలాగే సాంగ్ లో బన్నీ – రష్మిక మధ్య లవ్ బిల్డప్ షాట్స్ ఉంటాయని.. అలాగే బన్నీ మాస్ స్టెప్స్ కూడా ఈ సాంగ్ లో ఉంటాయని తెలుస్తోంది. అన్నట్టు ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటెలాను ఫైనల్ చేసింది చిత్రబృందం. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించనున్నారు. ఎప్పుడూ బిజీగా ఉండే దేవీ శ్రీ, ఈసారి కూల్ గా తీరిగ్గా కూర్చుని మరీ పుష్ప సినిమాకి ట్యూన్స్ కంపోజ్ చేస్తుండటంతో… ఈ సినిమా మ్యూజిక్ పై భారీ అంచనాలు ఉన్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్