Homeఅంతర్జాతీయంUS Supreme Court Ends Abortion Rights: గర్భ స్రావం కుదరదు.. అది మహిళ హక్కు...

US Supreme Court Ends Abortion Rights: గర్భ స్రావం కుదరదు.. అది మహిళ హక్కు కాదు.. అమెరికాలో చీకటి అధ్యాయం

US Supreme Court Ends Abortion Rights: “సమాన పని.. సమాన వేతనం.. అడ,మగ ఇద్దరూ సమానం” క్లారా జట్కిన్ చేసిన ఈ నినాదాలతోనే అప్పట్లో అమెరికా హోరెత్తిపోయింది. తర్వాత పురుషాధిపత్య పార్టీలు మహిళలకు సమాన హక్కులను కల్పించాయి. మహిళలకు ఓ దినోత్సవం ఉండేలాగా మార్చి 8న వరల్డ్ ఉమెన్స్ డే కి శ్రీకారం చుట్టాయి. హక్కుల కోసం మొదట్లో పోరాటాలు జరిగినా.. వాటిని కాపాడుకోవడం లో ఎప్పుడూ ముందు ఉంటుంది కనుక అమెరికాని “కంట్రీ ఆఫ్ రైట్స్” అంటారు. అటువంటి దేశంలో చీకటి అధ్యాయానికి తెర లేసింది. తెలిసో తెలియకో గర్భం దాల్చిన ఒక మహిళ తాను గర్భస్రావం చేసుకునే హక్కు లేదని ఎప్పుడో 1970 నాటికి చట్టానికి అమెరికా కోర్టు సవరణలు చేసింది. రాజ్యాంగం హక్కును కల్పించలేదని ఆ దేశ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇక ఆ బాధ్యత రాష్ట్రాలకు అప్పగించడంతో నిబంధనలు కఠినతరం కానున్నాయి.

US Supreme Court Ends Abortion Rights
US Supreme Court Ends Abortion Rights

ఎందుకు సవరణలు చేశారు?

అమెరికా అంటేనే విశృంఖత్వానికి, అపరిమిత మైన్ స్వేచ్ఛకు పరాకాష్ట. మేజర్లు అయ్యాక పిల్లలు దాదాపు తల్లిదండ్రులతో విడిగా ఉంటారు. సంపాదన, అలవాట్లు,జీవిత భాగస్వామి ఎంపిక అంతా పిల్లల ఇష్టం. దీంతో వారు కట్టు తప్పుతున్నారు. పైగా సహజీవనం, డేటింగ్ వంటివి అక్కడ చట్ట బద్దం కనుక దారి తప్పుతున్నారు. ఈ సమయంలో గర్భాలు దాల్చుతున్నారు. నచ్చకంటే గర్భ స్రావాలు చేయించుకుంటున్నారు. వాస్తవానికి ఒకప్పుడు ఇలా గర్భ స్రావాలు చేసేవారు కాదు. అమెరికా క్రిస్టియన్ దేశం కాబట్టి బైబిల్ ప్రకారం కడుపులో పెరిగే పిండాన్ని చంపే హక్కు లేదని ఆ దేషస్థులు నమ్మే వారు కాదు. దీనికి తోడు 1969లో 22 ఏళ్ల జేన్‌ రో అనే అవివాహిత గర్భం దాల్చింది. నిరుద్యోగురాలు, పెళ్లి కాకపోవడంతో తాను గర్భ స్రావం చేయించుకోవాలని నిర్ణయించుకుంది. ఇందుకు ఆమె నివాసం ఉండే టెక్సాస్ కో గర్భస్రావం కోసం ప్రయత్నించింది.

Also Read: Rakul Preet Singh: నడుము ఊపుతూ రకుల్ హాట్ డాన్స్ వీడియో… నన్ను చంపేయ్ అంటూ మంచు లక్ష్మీ క్రేజీ కామెంట్

ఇందుకు అక్కడి చట్టాలు గర్భస్రావానికి ససేమిరా అన్నాయి దీంతో గత్యంతరం లేక ఆమె కోర్టును ఆశ్రయించింది. అప్పటి డల్లాస్‌ కౌంటీ జిల్లా అటార్నీ హెన్రీవేడ్‌ను ఈ కేసులో ప్రతివాదిగా చేర్చింది. అందుకే ఈ కేసు రో వర్సెస్‌ వేడ్‌ గా ప్రసిద్ధి పొందింది. ఈ కేసులో మూడేళ్ల పాటు వాదనలు విన్న అమెరికా సుప్రీంకోర్టు రోకు అనుకూలంగా 7-2 మెజారిటీతో తీర్పు చెప్పింది. రో ఈ కేసు వేసే సమయానికి అమెరికాలో నాలుగు రాష్ట్రాల్లో మాత్రమే గర్భస్రావం చట్టబద్దం. 16 రాష్ట్రాలు కొన్ని పరిమితులతో గర్భస్రావానికి అనుమతిస్తున్నాయి. మిగతా ముప్పై రాష్ట్రాల్లో మాత్రం నిషేధం ఉండేది. అమెరికాలో రాజ్యాంగం కల్పించే హక్కుల విషయంలో రాష్ట్రాలు ప్రభావితం చేయలేవు. చట్టాలు అసలు పనిచేయవు. రో వర్సెస్‌ వేడ్‌ తీర్పులో సుప్రీంకోర్టు గర్భస్రావాన్ని రాజ్యాంగం కల్పించిన హక్కుగా పేర్కొనడంతో ఆ చట్టాలన్నీ చిత్తు కాగితాలయ్యాయి. చట్టాన్ని మొత్తం తన చేతిలోకి తీసుకోకుండా మహిళల ఆరోగ్యాన్ని, కడుపులో బిడ్డ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని కొన్ని నియంత్రణలు విధించే హక్కును సుప్రీంకోర్టు అప్పట్లో రాష్ట్రాలకు ఇచ్చింది. తాజా తీర్పుతో ఇప్పుడు గర్భస్రావ చట్టాలు రాష్ట్రాల పరిధిలోకి వెళ్లినట్లయింది. రో వర్సెస్‌ వేడ్‌ తీర్పు ఇచ్చే సమయానికి ఫీటల్‌ వయబిలిటీ 28 వారాలుగా ఉండేది. ఫీటల్‌ వయబిలిటీ అంటే బిడ్డ తల్లి కడుపులో కాకుండా బయట వాతావరణం లో ఎన్ని వారాల వయసులో జీవించగలదనే కొలమానం. తర్వాత కాలంలో వైద్యరంగంలో వచ్చిన అధునాతన పరిజ్ఞానాల కారణంగా ఫీటల్‌ వయబిలిటీ 23-24 వారాలకు పెరిగింది. అయినప్పటికీ.. 15 వారాలు దాటితే గర్భస్రావం కుదరదంటూ మిసిసిపీ రాష్ట్రం నిషేధం విధించడమే ఈ వివాదానికి మూలం.

US Supreme Court Ends Abortion Rights
US Supreme Court Ends Abortion Rights

మిసిసిపీ రాష్ట్రంలో ఇచ్చిన తీర్పుతో

ప్రస్తుతం అమెరికాలో డెమోక్రాటిక్ పార్టీ వ్యక్తే అధ్యక్షుడుగా ఉన్నప్పటికీ రిపబ్లికన్ల చేతిలోనే అధికంగా రాష్ట్రాలు ఉన్నాయి. ఇక గర్భస్రావం చట్టబద్దం కాదని సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడానికి బీజం మిసిసీపీ రాష్ట్రంలో పడింది. రిపబ్లికన్ల ఆధిపత్యం ఉన్న మిసిసిపి రాష్ట్రంలో 2018లో ఒక చట్టం చేశారు. దాని ప్రకారం.. ఒక మహిళ తెలిసో తెలియకో గర్భం దాల్చిన 15 వారాల తర్వాత గర్భస్రావం చేయించుకునే హక్కు లేదు. ఈ తీర్పు అప్పట్లో పెను దుమారాన్ని లేపింది. దీనిపై జాక్సన్‌ ఉమెన్స్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ అనే సంస్థ జిల్లా కోర్టును ఆశ్రయించింది. కోర్టు 1973 నాటి ‘రో వర్సెస్‌ వేడ్‌’ తీర్పును ఉటంకిస్తూ ఆ సంస్థకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీంతో మిసిసిపి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. సుప్రీంకోర్టు అసలు రాజ్యాంగం గర్భ స్రావాన్ని చట్టబద్దం చేయలేదని, ఆ హక్కు మహిళలకి లేదని కుండ బద్దలు కొట్టింది. ఇక ఈ తీర్పును అమెరికా అధ్యక్షుడు జో బైడన్ అమెరికాకు చీకటి రోజుగా అభివర్ణించారు. మాజీ అధ్యక్షుడు కొంత మంది వెర్రి తనంతో ఈ తీర్పు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏమౌతుంది

సుప్రీం కోర్టు తీర్పు అమెరికన్లలో ఆగ్రహానికి కారణమవుతున్నది. ఇది అమెరికా మహిళల్ని ద్వితీయ శ్రేణి పౌరులుగా మార్చుతుందని హక్కుల కార్యకర్తలు అంటున్నారు. సుప్రీం కోర్టు లో మెజారిటీ న్యాయవాదులు ట్రంప్ హయాంలో నియమితులయిన వారే. ఇక సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో రిపబ్లికన్ల అధ్వర్యంలో ఉన్న మహిళలు ప్రభావితం అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాగా ఈ తీర్పు నవంబరు లో జరిగే మధ్యంతర ఎన్నికల పై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. ఇదే విషయాన్ని కొద్ది రోజుల క్రితం పొలిటికో అనే పేపర్ ఉటంకించింది. అదే ఇప్పుడు అమెరికాలో నిజం అయింది.

Also Read:Minister KTR: రాజుతో కయ్యం.. మంత్రులతో నెయ్యం.. కేటీఆర్ కొత్త స్ట్రాటజీ ఇదేనా

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular