అమెరికా రెండు ట్రిలియ‌న్ డాల‌ర్ల ప్యాకేజీ

వేగంగా క‌రోనా వైర‌స్ మహమ్మారి వ్యాపిస్తూ, తీవ్రత గల దేశాలలో మూడో దేశంగా మారిన అమెరికాలో దీనిని కట్టడి చేయడం కోసం అమెరికా భారీ ఉద్దీప‌న ప్యాకేజీని చేపట్టింది. ఆధునిక ప్రపంచ చరిత్రలోనే ఇప్పటి వరకు మరే దేశంలో కూడా ప్రకటించని రీతిలో భారీగా సుమారు రెండు ట్రిలియ‌న్ డాల‌ర్ల ప్యాకేజీ ఇవ్వ‌డానికి సేనేట‌ర్లు, వైట్‌హౌజ్ బృందం అంగీక‌రించారు. వ్యాపార‌వేత్త‌ల‌కు, కార్మికుల‌కు, వైద్య సిబ్బందికి.. ఈ ప్యాకేజీ ఇవ్వ‌నున్నారు. ప్ర‌తి ఒక్క‌రికీ ఉద్దీప‌న ప్యాకేజీ నుంచి నేరుగా […]

Written By: Neelambaram, Updated On : March 25, 2020 4:35 pm
Follow us on

వేగంగా క‌రోనా వైర‌స్ మహమ్మారి వ్యాపిస్తూ, తీవ్రత గల దేశాలలో మూడో దేశంగా మారిన అమెరికాలో దీనిని కట్టడి చేయడం కోసం అమెరికా భారీ ఉద్దీప‌న ప్యాకేజీని చేపట్టింది.

ఆధునిక ప్రపంచ చరిత్రలోనే ఇప్పటి వరకు మరే దేశంలో కూడా ప్రకటించని రీతిలో భారీగా సుమారు రెండు ట్రిలియ‌న్ డాల‌ర్ల ప్యాకేజీ ఇవ్వ‌డానికి సేనేట‌ర్లు, వైట్‌హౌజ్ బృందం అంగీక‌రించారు.

వ్యాపార‌వేత్త‌ల‌కు, కార్మికుల‌కు, వైద్య సిబ్బందికి.. ఈ ప్యాకేజీ ఇవ్వ‌నున్నారు. ప్ర‌తి ఒక్క‌రికీ ఉద్దీప‌న ప్యాకేజీ నుంచి నేరుగా ఖాతాల్లోకి డ‌బ్బులు బదిలీ చేస్తారు. క‌రోనా వ‌ల్ల దెబ్బ‌తిన్న వ్యాపార‌ వ‌ర్గాల‌కు కూడా ఈ ప్యాకేజీ డ‌బ్బు వెళ్తుంది. త్వ‌ర‌లోనే ఈ చ‌ట్టాన్ని అమ‌లు చేయ‌నున్నట్లు ప్రకటించారు.

ఆధునిక‌ అమెరికా చ‌రిత్ర‌లో ఇది అతిపెద్ద ఉద్దీప‌న ప్యాకేజీ అని నిపుణులు చెబున్నారు. ప్ర‌తి ఒక వ్య‌క్తికి ప్యాకేజీ కింద వ్యక్తులకు 1200 డాల‌ర్లు, దంపతులకు 2,400 డాలర్లు, నలుగురు సభ్యుల కుటుంబానికి 3,000 డాలర్లు ఇస్తారు. ప్ర‌తి ఒక చిన్నారికి 500 డాల‌ర్లు ఇచ్చేందుకు కూడా అంగీకారం జ‌రిగింది.

కంపెనీలలో పనిచేస్తున్న ఉద్యోగులు ఇంటి వద్ద ఉండిపోగా, వారికి జీతాలు ఇవ్వడం కోసం 500 మంది లేదా అంతకన్నా తక్కువ మంది ఉద్యోగులు గల కంపెనీల కోసం 367 బిలియన్ డాలర్లు ఖర్చు చేయనున్నారు. ఒకొక్క కంపెనీకు 10 మిలియన్ డాలర్ల వ్యాపార రుణాలు ఇస్తారు.

వారానికి 600 డాలర్లు చొప్పున నాలుగు నెలల వరకు నిరుద్యోగ భృతిని ఇస్తారు. ఆరోగ్య సేవలు, సామజిక సేవలు అందించే వారి కోసం 242 మిలియన్ డాలర్లు వ్యయం చేస్తారు.

అమెరికాలో జీవిస్తున్న దాదాపు ప్ర‌తి ఒక్క‌రికీ ఈ సొమ్ము అందుతుంది. నిరుద్యోగుల‌కు కూడా ప్యాకేజీ సొమ్ము చెల్లిస్తారు. అమెరికాలో ఇప్పటికే 55 వేలమందికి పైగా కరోనా సోకగా, మరో 802 మంది మృతి చెందారు.