Jobiden on Kabul Crisis: కాబుల్ సంక్షోభంపై అమెరికా అధ్యక్షుడి సంచలన ప్రకటన

Jobiden on Kabul Crisis: అఫ్గనిస్తాన్ లో తాలిబన్ల ఆగడాలు పెరిగిపోతున్న క్రమంలో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. కాబుల్ విమానాశ్రయంలో అఫ్గాన్ ప్రజల ఆర్తనాదాలు చూస్తుంటే జనం తిప్పలు ప్రత్యక్షంగా చూసిన వారి మనసులు కలచివేస్తున్నాయి. కాబుల్ నుంచి వాయుమార్గంలో ప్రజలను తరలించడం మామూలు విషయం కాదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యానించారు. అఫ్గనిస్తాన్ నుంచి ఈనెల 31లోగా తన బలగాలను ఉపసంహరించుకోవాలని అమెరికా భావించింది. జులై నుంచి ఇప్పటి వరకు 18 వేల […]

Written By: Srinivas, Updated On : August 22, 2021 5:55 pm
Follow us on

Jobiden on Kabul Crisis: అఫ్గనిస్తాన్ లో తాలిబన్ల ఆగడాలు పెరిగిపోతున్న క్రమంలో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. కాబుల్ విమానాశ్రయంలో అఫ్గాన్ ప్రజల ఆర్తనాదాలు చూస్తుంటే జనం తిప్పలు ప్రత్యక్షంగా చూసిన వారి మనసులు కలచివేస్తున్నాయి. కాబుల్ నుంచి వాయుమార్గంలో ప్రజలను తరలించడం మామూలు విషయం కాదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యానించారు. అఫ్గనిస్తాన్ నుంచి ఈనెల 31లోగా తన బలగాలను ఉపసంహరించుకోవాలని అమెరికా భావించింది.

జులై నుంచి ఇప్పటి వరకు 18 వేల మందిని తరలించింది. తాలిబన్లు కాబుల్ ను ఆక్రమించినా అక్కడి అంతర్జాతీయ విమానాశ్రయం మాత్రం ఇప్పటికే అమెరికా బలగాల స్వాధీనంలోనే ఉంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో అమెరికా, మిత్ర దేశాల వారు విదేశీ బలగాలతో పనిచేసిన అఫ్గాన్లు భారీగా విమానాశ్రయానికి చేరుకుంటున్నారు. అయితే ధ్రువపత్రాల పరిశీలన ఆలస్యం కావడంతో తరలింపు ఆలస్యం అవుతోందని తెలుస్తోంది. దీంతో అమెరికా తీరుపై విమర్శలు కూడా వస్తున్నాయి.

కాబుల్ నుంచి ఎక్కువ మందిని విదేశాలకు తరలించే సామర్థ్యం అమెరికాకు మాత్రమే ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మిత్ర దేశాలకు చెందిన సుమారు 65 వేల మందిని తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో అమెరికన్లకే ప్రాధాన్యం ఇస్తున్నారు. సమస్యాత్మక పరిస్థితుల్లో సాయుధ బలగాలను వెనక్కి నెట్టి తరలింపు ప్రక్రియ చేపట్టేందుకు అమెరికా సంసిద్ధత వ్యక్తం చేస్తోంది.

కాబుల్ విమానాశ్రయంల సుమారు ఆరు వేల మంది అమెరికన్ బలగాలు విధులు నిర్వహిస్తున్నాయి. సైనిక విమానాలే కాకుండా విదేశాలకు చెందిన పౌర రవాణా విమానాలు కూడా రాకపోకలు సాగిస్తున్నాయి. అఫ్గాన్ మహిళలు, పాత్రికేయులు సహా అమెరికా జర్నలిస్టులను సైనిక విమానాల్లో తరలిస్తున్నారు. అఫ్గాన్ విడిచి వెళ్లే ప్రసక్తే లేదని చెబుతున్నారు.

అమెరికా అధ్యక్షుడు బైడెన్ వ్యాఖ్యల నేపథ్యంలో కాబుల్ విమానాశ్రయంలో ఉత్కంఠ నెలకొంది. ప్రజల తరలింపులో పక్షపాతం ఉండదని చెబుతున్నారు. ప్రజల ఆకలిదప్పులు గుర్తించి వారి బాధలు పట్టించుకుంటామని చెప్పారు. అఫ్గనిస్తాన్ లో తాలిబన్ల ఆగడాలు పెరిగిపోవడంతో ప్రజలు తలదాచుకోవడానికి కూడా ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది.