Huzurabad TRS: తెలంగాణ సీఎం కేసీఆర్ అంతరంగం అంత ఈజీగా అర్థం కాదు అంటారు. కానీ ప్రతిపక్ష టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాత్రం టీఆర్ఎస్ గుట్టూ మట్లు అన్ని చెప్పేస్తుంటారు. గతంలో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళతాడని చెప్పింది రేవంత్ రెడ్డినే. అన్నట్టుగానే అది జరిగింది. ఇప్పుడు కూడా ఓ హాట్ కామెంట్ చేశారు. హుజూరాబాద్ ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ లో తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. గుజరాత్ ఎన్నికలతోపాటు తెలంగాణలో ఎన్నికలు జరుగుతాయని రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడీ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.
హుజురాబాద్ ఎన్నికల తర్వాత టీఆరెఎస్ లో చాలా మార్పులొస్తాయని, పార్టీ లో తిరుగుబాటు తప్పదని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన సీఎల్పీ లో మీడియా తో చిట్ చాట్ లో అనేక అంశాలను ప్రస్తావించారు. ప్రధానంగా నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు ఎన్నికలు ఉండవు అన్న అంశాలను ప్రస్తావిస్తూ టిఆర్ఎస్ లో హుజురాబాద్ ఉప ఎన్నికల తర్వాత తిరుగుబాటు తప్పదని అన్నారు. విజయ గర్జన సభ పెడ్త అని కేసీఆర్ ప్రకటించడం రాబోయే తిరుగుబాటును ఎదుర్కోడానికేనని ఆయన పేర్కొన్నారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలతో కేసీఆర్ భయంతోనే వున్నారని అది బయటపడకుండా ప్రవర్తిస్తున్నారని అన్నారు..
ముందస్తు ఎన్నికలు వెళ్లమని కేసీఆర్ చెప్పడం హాస్యాస్పదంగా వుందని రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం
పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల కలిసి రావని, 6 నెలల ముందే అసెంబ్లీ ఎన్నికలు వస్తాయని ఆయన వివరించారు., విజయ గర్జన సభలు కేసీఆర్ భయంతోనే పెడ్తుండని ఇవే టీఆర్ఎస్ పార్టీకి చివరి సభలు అవుతాయని అన్నారు..
హరీష్ రావు ను కూడా కేసీఆర్ త్వరలో పార్టీ నుండి బయటికి పంపుతాడని, మిత్ర ద్రోహి పేరుతో.. స్మశాన వాటికకు పంపుతాడని ఈటెల గెలిచిన ఓడిన ఎవరికి లాభం లేదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
గుజరాత్ తోనే తెలంగాణలో ఎన్నికలు వస్తాయి, 2022 ఆగస్ట్ 15 తో స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతుందని, దీంతో కొత్త శకానికి నాంది అని కేసీఆర్.. ఎన్నికలకు వెళ్తారని రేవంత్ రెడ్డి చెప్పారు.మోడీ డైరెక్షన్ లో కేసీఆర్ గుజరాత్ ఎన్నికలతో కలిసి ముందస్తూ ఎన్నికలలో వెళ్తారని, రాష్ట్రంలో బిజేపి ని బలోపేతం చేసే.. కుట్ర జరుగుతోందని వివరించారు.
ఇప్పుడే ముందస్తు ఎన్నికలు అంటే తన పార్టీలో మరింత గందరగోళం వస్తదని కేసీఆర్ చెప్పడం లేదని అన్నారు. ప్రతి నియోజక వర్గంలో నాయకులకు టికెట్ల ఇచ్చే పరిస్తితి లేదు కాబట్టి వారిని ముందస్తుగానే అలర్ట్ కాకుండా ఈ డ్రామా ఆడుతున్నడని అన్నారు. ముందస్తు ఎన్నికల గురించి కేసీఆర్ ను ఎవరు అడిగారని ముందస్తు ఎన్నికల విషయం ఎందుకు మాట్లాడుతున్నారని అన్నారు.మరో రెండేళ్లు నా సర్కార్ అధికారంలో ఉంటుందని చెప్పుకోవడం కోసమే ఈ ముందస్తు ఉండదని చెప్పడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నాడని అన్నారు.
విజయ గర్జన సభ ఎందుకు పెడ్తున్నాడని, రాష్ట్రంలో ఏం అభివృద్ధి, సంక్షేమం సాధించాడని విజయ ఘర్జన సభ అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణలో ఎంపీలు 16 గెలుస్తం, కేంద్రంలో చక్రం తిప్పుతామని కేసీఆర్ అంటున్నారు, ఇది దేనికి సంకేతమని అన్నారు. టీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో.. దళిత, గిరిజనులకు 3 ఎకరాల భూమి ఇస్త అని ఉందని.. దళితలు, సీఎం పదవి కావాలని అడగలేదు. దళిత సీఎం అని ముడేకరాల భూమి ఇస్తా అని కేసీఆర్ మోసం చేసిండని రేవంత్ ఆరోపించారు.
దళిత బంధు కూడా అడగలేదు.. వాళ్లు అడిగింది a,b,c,d వర్గీకరణ అది ఇవ్వలేదని కేసీఆర్ పై రేవంత్ విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ఆర్ ఇన్నిసార్లు ప్రధానికి కలిశారు కదా ఎప్పుడైనా ఎస్సీలో ఏబీసీడీ వర్గీకరణ గురించి ప్రధాన మోడీని ఆడిగారా అంటూ నిలదీశారు. కేసీఆర్..దళిత ద్రోహి అని రేవంత్ రెడ్డి విమర్శించారు.
కేసీఆర్ సొంత పార్టీ లోనే దళితులకు ప్రాధాన్యత లేదని పార్టీ అధ్యక్ష పదవీ కోసం.. కేసీఆర్ నామినేషన్ వేసే సమయంలో.. ఒక్క దళితుడు కూడా లేరని నిన్న వేదికపై కూడా కేసీఆర్ పక్కన దలితున్ని కూర్చోబెట్టుకొలేదని విమర్శించాడు. *దళిత ద్రోహి నాయకత్వంలో మరో దళిత నాయకుడు మోత్కుపల్లి నర్సింలు జాయిన్ అవుతున్నాడని అన్నారు. యూపీ ఎన్నికల్లో బీజేపీకి కేసీఆర్ సహకారం ఉంటుందని, దాని వెనక అంతర్గత ఒప్పందం జరిగిందని కేసీఆర్ పై కేసులు, దాడులు జరగకుండా ఒప్పందం జరిగిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
గుజరాత్ ఎన్నికల సమయానికి తెలంగాణలో సర్కార్ ను కేసీఆర్ రద్దు చేస్తాడని రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. సర్కార్ ను నడపాల్సిన సమయంలో పార్టీపై కేసీఆర్ దృష్టి పెట్టడం ఏంటని ఆయన ప్రశ్నించారు. టీఆర్ఎస్ లో జరుగుతున్న పరిణామాలన్నీ ముందస్తు ఎన్నికల కోసమేనని అన్నారు.