https://oktelugu.com/

BJP UP Elections 2022: కేంద్రంలో అధికారానికి యూపీయే మార్గం..: ఎందుకు కీలకం?

BJP UP Elections 2022:  403 అసెంబ్లీ స్థానాలు.. 80 పార్లమెంట్ స్థానాలు.. అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రతీ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. కానీ యూపీ ఎలక్లన్స్ దేశంలోనే ప్రత్యేకమైనవి. ఇక్కడ అధికారంలోకి వచ్చిన పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని శాసించే స్థాయిలో ఉంటుంది. అంతేకాకుండా ఇప్పటి వరకు 9 మంది ప్రధానులు(మోదీతో సహా) యూపీ నుంచే పనిచేశారు. చారిత్రక ప్రదేశాలతో పాటు ఆధ్యాత్మిక కేంద్రాలను కలిగి ఉన్న […]

Written By:
  • NARESH
  • , Updated On : January 21, 2022 / 10:45 AM IST
    Follow us on

    BJP UP Elections 2022:  403 అసెంబ్లీ స్థానాలు.. 80 పార్లమెంట్ స్థానాలు.. అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రతీ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. కానీ యూపీ ఎలక్లన్స్ దేశంలోనే ప్రత్యేకమైనవి. ఇక్కడ అధికారంలోకి వచ్చిన పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని శాసించే స్థాయిలో ఉంటుంది. అంతేకాకుండా ఇప్పటి వరకు 9 మంది ప్రధానులు(మోదీతో సహా) యూపీ నుంచే పనిచేశారు. చారిత్రక ప్రదేశాలతో పాటు ఆధ్యాత్మిక కేంద్రాలను కలిగి ఉన్న యూపీకి రాజకీయంగా అనేక సంఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ మరోసారి పాగా వేసేందుకు ఇప్పటికే తీవ్ర ప్రయత్నాలు ప్రారంభించింది. ఇక ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకే కాకుండా ప్రతిపక్షాలకూ ప్రాధాన్యత ఉంటుంది.

    BJP UP Elections 2022:

    ప్రస్తుత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్. అక్కడ సీఎంగా చాలా కాలం పనిచేశారు. అయితే ఆయన వారణాసి నుంచి గెలిచి ప్రధాన మంత్రిగా కొనసాగుతున్నారు. ఆయన యూపీని ఎంచుకోవడంలో ఈ రాష్ట్రానికి ఎంత ప్రాధాన్యత ఉందో అర్థం చేసుకోవచ్చు. 1951లో యూపీలో మొదటిసారి అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో 347 అసెంబ్లీ స్థానాలు. ఈ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి గోవింద్ వల్లభ్ పంత్. ఇందిరా గాంధీ హత్య జరిగిన తరువాత 1985లో రాజీవ్ గాంధీ ప్రధాన మంత్రి అయ్యారు. ఈ సమయంలో యూపీకి వీర్ బహదూర్ సింగ్ ను సీఎం చేశారు. దీంతో 33 ఏళ్ల పాటు కాంగ్రెస్ పాలనే సాగింది. ఆ తరువాత 1989లో సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ శకం ప్రారంభమైంది.

    Also Read: రాధేశ్యామ్’, ‘ఆర్ఆర్ఆర్’ కొత్త రిలీజ్ డేట్లు ఇవే !

    1989 వరకు యూపీలో అత్యధిక స్థానాలు గెలుచుకున్న పార్టీనే కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసేంది. కానీ ఇప్పటి నుంచి అలా జరగలేదు. 1991లో పీవీ నరసింహారావు ప్రధాని అయినప్పుడు యూపీలో కాంగ్రెస్ 5 సీట్లు మాత్రమే గెలుచుకుంది. కానీ అయోధ్యలో రామమందిరం నిర్మాణ ఉద్యమంతో యూపీలో బీజేపీ పాగా వేసింది. ఈ కారణంగా 1991, 1996, 1998లో వరుసగా మూడు లోక్ సభ ఎన్నికల్లో 50కి పైగా సీట్లు గెలుచుకుంది. దీంతో 1996, 1998లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి తోడ్పడింది. అయితే 2004, 2009లో మాత్రం బీజేపీ వెనుకబడింది. ఇక 2007లో ఆ రాష్ట్ర ప్రజలు బీఎస్పీకి అవకాశం ఇవ్వగా.. 2012లో సమాజ్ వాదీ పార్టీని గెలిపించారు. అయితే 2017లో మూడో స్థానంలో ఉన్న బీజేపీ అనూహ్యంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అవతరించింది.

    రామమందిరం ఉద్యమం ప్రారంభమైన తరువాత బీజేపీ నేత కల్యాణ్ సింగ్ 221 సీట్లు గెలుచుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే బాబ్రీ మసీదు కూల్చివేతతో ఆయన ప్రభుత్వాన్ని రద్దు చేశారు. ఆ తరువాత సమాజ్ వాదీ పార్టీ, బహుజన పార్టీలు హవా సాగించాయి. 1996 ఎన్నికల్లో బీజేపీ పూర్తి మెజారిటీ సాధించలేకపోయింది. దీంతో బీజేపీకి మాయావతి మద్దతు కోరడంతో అంగీకరించారు. తలా రెండున్నర సంవత్సరాల ఒప్పందంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే బీజేపీ వంతు రాగానే మాయావతి మద్దతు ఉపసంహరించారు.

    2017 ఎన్నికల్లో బీజేపీ పుంజుకొని 312 సీట్లు గెలవడంతో ఆదిత్యానాథ్ సీఎం అయ్యారు. రాష్ట్రంలో పలు సంస్కరణలు తీసుకొచ్చిన ఆయనే మరోసారి సీఎం అవుతారని అంటున్నారు. కానీ ఢిల్లీలో జరిగిన రైతుల ఉద్యమం ఈ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉన్నాయి. రైతు నాయకుడు టికా నాయక్ ఉత్తరప్రదేశ్ కు చెందిన వ్యక్తి కావడం విశేషం. కాగా ఇక్కడ మరోసారి బీజేప సర్కార్ వస్తే 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలోకి రావడానికి బీజేపీకి మార్గం సుగమం అవుతుందని అనుకుంటున్నారు.

    Also Read: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఏడాది పాలన ఎలా సాగిందంటే?