UP Lakhimpur Kheri Violence: దేశంలో ప్రస్తుతం రెండు ఘటనలు అతలాకుతలం చేస్తున్నాయి. ఆ రెండు అంశాలు పేదోడికి.. ధనవంతుడికి మధ్య యుద్ధంగా సాగుతున్నా.. పేదోడు ఎన్నటికీ ప్రపంచానికి కనిపించడు. ఎందుకంటే సెలబ్రెటీ కాదు. పేదోడు గట్టిగా దేన్ని ప్రతిఘటించలేదు. ఎందుకంటే.. అతడి వెనక ఎవరూ ఉండరు.. పేదోడు ఎప్పుడు ప్రశ్నించలేదు.. ఎందుకంటే.. సమాధానం చెప్పే నాయకులు వారిని పిచ్చివాళ్లను చేస్తారు. అదే ధనికుడు.. ధనవంతుడు చిన్న పనిచేసినా.. ప్రపంచవింతగా చూస్తుంది ఈ లోకం.. ధనవంతుడు తిన్నా వార్తే.. పడుకున్నా వార్తే.. ఏం చేసినా వార్తే.. సమాజం కూడా అతడికే వత్తాసు పలుకుంది. ప్రస్తుతం దేశంలో రెండు ఘటనలు చాలా వైరల్ అవుతున్నాయి.

ఇటీవల ఉత్తర ప్రదేశ్ లకింపూర్ ఘటన ఎందరినో కదిలించింది. రైతులు రోడ్డుపై నిరసనకు దిగితే.. వారిపై కార్ల కాన్వయ్ దూసుకెళ్లింది. రైతులను తొక్కించుకుంటూ వెళ్లిన ఘటనకు సంబంధించిన దృశ్యాలు చాలా వైరల్ అయ్యాయి. మనిషిని అంత ఈజీగా చంపగలుగుతారా..? రైతు ప్రాణాలకు లెక్కనే లేదా? కార్ల కాన్వయ్ ఓ ముఖ్యమైన వ్యక్తిది. అదీ అందరికీ తెలుసు.. అయినా.. ప్రభుత్వాలు నోళ్లు మూసుకున్నాయి. ప్రపంచం నిశ్శబ్ధం పాటిస్తోంది. నిందితులను పట్టుకున్నారా.. లేదా అనే విషయం పక్కన పెడితే.. అంత ధైర్యంగా మనుషులపై అదీ.. అన్నం పెట్టే రైతన్నపై కార్లు ఎక్కించేస్తారా..? కాన్వయ్ లో మంత్రి కొడుకు ఉన్న విషయం అందరికీ తెలిసిందే.. కానీ అతడిని ఇంతవరకు పోలీసులు పట్టుకోలేదు. ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు. కానీ.. బాధితులను పరామర్శించడానికి వెళ్లిన వారిని మాత్రం పోలీసులు అరెస్టు చేస్తున్నారు. అక్కడ కమ్యూనికేషన్ సేవలు నిలిపివేస్తున్నారు. మరిన్ని ఆందోళనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దేశానికి అన్నం పెట్టే రైతులపై ఇంత ఆక్రోశమా..? పదినెలలుగా నిరసనలు తెలుపుతుంటే పట్టించుకోని ప్రభుత్వం ఆ నిరసనను కట్టడి చేయానికి విశ్వప్రయత్నాలు చేసింది.
అదే విధంగా షారూఖ్ కొడుకు ఆర్యన్ డ్రగ్స్ కేసులోనూ ప్రభుత్వం దేశాన్ని మొత్తం పక్కదారి పట్టించింది. ఆర్యన్ ను కావాలనే కేసులో ఇరికించారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. దేశంలో చాలా మంది డ్రగ్స్ బాధితులు ఉన్నారు. అందరిలో షారుఖ్ కొడుకు ఒకరు. దారితప్పాడు. మత్తుకు అలవాటు అయ్యాడు. డబ్బు విలాసం.. తల్లిదండ్రుల పెంపకం అతడిని ఆ దారిలో నడిపించింది. డ్రగ్స్ తో దొరికితే ఎవరిని ఏం చేయాలో అందరికీ తెలుసు.. కానీ కొత్తగా కాపాడేందుకు ఏం చేయాలన్నది నేర్పిస్తున్నారు. ఆర్యన్ భవిష్యత్ ఉన్న కుర్రాడు. అసలునౌకలో డ్రగ్స్ వాడారో లేదో తెలియదు. ఎన్సీబీ అధికారులే డ్రగ్స్ పెట్టారని ఆర్యన్ తోపాటు అతడి లాయర్లు, మిత్రులతో పాటు మరికొందరు ఆరోపిస్తున్నారు. సీసీ పుటేజీ తీయాలని అంటున్నారు. ఆర్యన్ డ్రగ్స్ వాడాడో లేదో తెలియదు.. కానీ అతడిని ఇప్పుడు ఓ అస్త్రంగా కొందరు వాడుకుంటున్నారన్నది నిజం.