UP Elections 2022: దేశంలో అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్టంలో రాజకీయ సమీకరణాలు జోరందుకున్నాయి. ముఖ్యంగా కుల సమీకరణాలపై నేతలు దృష్టి పెట్టారు. కొందరు నాయకులు కులాల వారీగా రాజకీయం చేసి అత్యధిక ప్రయోజనం పొందారు. కొన్ని వర్గాల తరుపున పోరాటం చేసి అధికారంలోకి వచ్చినవారూ ఉన్నారు. ఇప్పుడు కూడా అదే చేసేలా ప్రయత్నిస్తున్నారు. యూపీలో 1937 నుంచి 1967 వరకు అగ్రవర్ణాలే ఆధిపత్యం చెలాయించగా.. ఆ తరువాత పరిస్థితులు తారుమారయ్యాయి. మూడు దశాబ్దాలుగా వేచి చూసిన నిమ్న వర్గాలు 1967 తరువాత రాజకీయాల్లో అభివృద్ధి చెంది పట్టు సాధించారు. 2017లో బ్రాహ్మణ కులానికి చెందిన ఆదిత్యనాథ్ యోగీ సీఎం పీఠంలో కూర్చున్నారు. అయితే త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి యోగీ పీఠంపై కూర్చుంటారా..? లేక కుల సమీకరణాల్లో ఇతరులు చేజిక్కించుకుంటారా..? అనే చర్చ జోరుగా సాగుతోంది.
యూపీలో బ్రాహ్మణులు 10 శాతం ఉన్నారు. అలాగే యాదవులు, జాటవ్ లు (దళితులు) ఎక్కువగా కనిపిస్తారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బ్రాహ్మణ కులాలతో పాటు యాదవేతర, జాటవేతర కులాలు బీజేపీకి సపోర్టు చేయడంతో 312 సీట్లు గెలుచుకొని అధికారంలో కూర్చుంది. అయితే జాటవ్ లు 11 శాతం ఉండగా.. వీరు బీఎస్పీ కి మద్దతు ఇస్తారు. ఇక యాదవ్ లు సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ)కే జై కొడుతారు. దీంతో గత ఎన్నికల్లో బీజేపీ యాదవేతర, జాటవేతర కులాలను దగ్గరకు చేర్చుకొని ప్రయోజనం పొందింది. అయితే బీఎస్పీ అధికారంలో ఉన్నప్పుడు యాదవులు కూడా కలిసి వచ్చారు.
అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్న యోగికి కొన్ని కులాలు దూరమైనట్లు తెలుస్తోంది. ఇందుకు ఆయన తీసుకున్న నిర్ణయాలే కారణమని అంటున్నారు. జనవరి ప్రారంభంలో ఎన్నికల తేదీని ప్రకటించాక ముగ్గురు యాదవేతర ఓబీసీ మంత్రులు స్వామి ప్రసాద్ మౌర్య, దారాసింగ్ చౌహాన్, దర్శన్ సింగ్ సైనీ తమ పదవులకు రాజీనామా చేసి 12 మంది శాసన సభ్యులతో ఎస్పీలో చేరారు. మూడు నెలల కిందట ఓబీసికి చెందిన సుహేల్ దేవ్ సైతం ఎస్పీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో బీసీలంతా ఒకే గూటికి చేరుతున్నారా..? అనే చర్చ మొదలైంది. ఇక 2014, 2019 ఎన్నికల్లో మాదిరిగానే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీసీలదే హవా సాగుతుందని కొందరు అంచనా వేస్తున్నారు.
1946-1954న ఉత్తరప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా పండిత గోవింద్ వల్లభ్ ఎన్నికయ్యారు. ఈయన బ్రాహ్మణ వర్గానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆ తరువాత డాక్టర్ సంపూర్ణానంద్ కాయస్థ కుటుంబంలో జన్మించాడు. ఇలా 1967 వరకు అగ్రవర్ణానికి చెందిన వారే సీఎం పీఠంపై కూర్చున్నారు. యూపీలో మొత్తం పనిచేసిన ముఖ్యమంత్రుల్లో 21 మంది అగ్ర వర్ణాలకు చెందిన వారే. దళితుల, బీసీల అభ్యున్నతి కోసం పోరాడిన రామ్ మనోహర్ లోహియా, రైతు నేత చరణ్ సింగ్. కాన్సీరామ్ లు అగ్రవర్ణాల ఆధిపత్యానికి గండి కొట్టారు. వాసత్వానికి 1952లోనే డాక్టర్ లోహియా పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి రాజకీయ నైపుణ్యాన్ని సాధించారు.
కుల సమీకరణాల ద్వారానే కాంగ్రెస్ ను ఎదుర్కోగలమని సోషల్ లిస్టు పార్టీ తరుపున వాదించారు. దీంతో వారిని కులాల వారీగా గుర్తించకుండా వెనుకబడిన వర్గాల వారిగా పేర్కొంటూ వారిలో చైతన్యాన్ని నింపారు. అప్పటి వరకు కాంగ్రెస్లో కొనసాగిన ఆయన ఆ పార్టీ నుంచి బయటికి వచ్చారు. ఆయనతో పాటు జాట్లు, గుజ్జర్లు, కుర్మీలు, యాదవులు అధిక సంఖ్యలో బయటికి వచ్చారు. అయితే 1967లో లోహియా మరణం తరువాత చరణ్ సింగ్ ఆ బాధ్యతలను తీసుకున్నారు. కొన్నేళ్ల తరువాత ఆయన భారతీయ లోక్ దల్ లో చేరారు. దీంతో బీసీలంతా ఒక్కటి కావడంతో అగ్ర వర్ణాలకు కొన్నేళ్లపాటు రాజ్యాధికారం దక్కలేదు. ఇక బీఎస్పీ అధినేత కాన్షీరాం 1980 వరకు యూపీ అసెంబ్లీలో అడుగుపెట్టని వారి జాబితాను సేకరించారు. 1993 ఎన్నికల్లో యూపీ అసెంబ్లీ మధ్యంతర ఎన్నికల్లో ఎస్పీతో పొత్తు పెట్టుకున్నారు. దళిత సిక్కు కుటుంబంలో పుట్టని కాన్షీరాం బీఎస్పీని బలీయ శక్తిగా మార్చారు.
ఇదిలా ఉండగా కాంగ్రెస్లో 1980 వరకు బ్రహ్మణులు అధికంగా పదవులు పొందారు. కానీ ఇందిరా గాంధీపెద్ద కొడుకు సంజయ్ గాంధీ బాధ్యతలు చేపట్టిన తరువాత ఠాకూర్లకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. అంతేకాకుండా అప్పటి కేంద్ర మంత్రి, కులీన ఠాకూర్ అయిన విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ను ఎంపిక చేసి లక్నోకు పంపారు. అయితే 2014 నుంచి ఠాకూర్లు బీజేపీకి మద్దతు ఇస్తున్నారు. అయితే 2017లో అధికారంలోకి వచ్చిన బీజేపీకి ఠాకూర్లు సహకరించినా యోగి పాలనకు విసుకు చెంది ఆ పార్టీని వీడుతున్నారని అంటున్నారు. మరోవైపు బ్రాహ్మన వర్గాన్ని కూడా పట్టించుకోలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో బీజేపీకి కుల సమీకరణ ఉపయోగపడుతుందా..? లేక బీసీ కులాల పోటీలో చతికిల పడుతాయా..? అనేది తేలాల్సి ఉంది.