Homeజాతీయ వార్తలుUP Election 2022 Result: యూపీలో బీజేపీ ఊపు.. రైతులు ఉద్యమించిన పశ్చిమ యూపీలోనూ ప్రభంజనం

UP Election 2022 Result: యూపీలో బీజేపీ ఊపు.. రైతులు ఉద్యమించిన పశ్చిమ యూపీలోనూ ప్రభంజనం

UP Election 2022 Result: అంద‌రూ ఎంత‌గానో ఎద‌రు చూసిన యూపీ ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డుతున్నాయి. ప్ర‌స్తుతం ఎన్నిక‌ల కౌంగింట్ జ‌రుగుతోంది. అయితే ముందు నుంచి యూపీలో బీజేపీకి వ్య‌తిరేకంగా ఓటింగ్ ప‌డుతుంద‌ని, ఎస్పీకి మెజార్టీ సీట్లు వ‌స్తాయ‌ని అంద‌రూ అంచ‌నా వేశారు. కానీ ఎగ్జిట్ పోల్స్ లో మాత్రం బీజేపీకి చాలా స‌ర్వేలు మెజార్టీ సీట్లు వ‌స్తాయ‌ని అంద‌రూ చెప్పారు. ఇప్పుడు వాస్త‌వంగా ఇదే జ‌రుగుతోంది.

UP Elections
UP Elections

అయితే ఎవ‌రూ ఊహించ‌ని విధంగా యోగి నేతృత్వంలో బీజేపీ అద్భుత‌మైన రిజ‌ల్ట్ ను సాధిస్తోంది. ఉద‌యం 11గంట వ‌ర‌కు 264 స్థానాల‌ను సొంతం చేసుకుంది. ఇంకా ఈ సంఖ్య పెరిగే అవ‌కాశం కూడా ఉంది. ఇప్ప‌టికే మ్యాజిక్ ఫిగ‌ర్ ను దాటేసింది. దీంతో రెండోసారి యూపీలో బీజేపీకి అధికారం ఖాయం అని తెలిసిపోతోంది. ఇంకో విష‌యం ఏంటంటే.. ఎగ్జిట్ పోల్స్ చెప్పిన దాని కంటే కూడా ఎక్కువ సీట్లు వ‌చ్చేలా క‌నిపిస్తున్నాయి.

Also Read: యూపీ సహా 3 రాష్ట్రాల్లో బీజేపీ జైత్రయాత్ర.. పంజాబ్ లో ఆమ్ ఆద్మీ దూకుడు

ఇక ఎస్పీకి 127, బీస్పీకి 6, కాంగ్రెస్‌కు 4 సీట్లు మాత్ర‌మే వ‌చ్చాయి. మొత్తంగా చూస్తుంటే.. బీజేపీకి ద‌రి దాపుల్లో కూడా ఏ పార్టీ లేక‌పోవ‌డం ఇక్క‌డ గ‌మ‌నార్హం. మ‌రో ముఖ్య‌మైన విష‌యం ఏంటంటే.. ప‌శ్చిమ యూపీలో రైతులు ఉద్య‌మంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. బీజేపీకి వ్య‌తిరేకంగా ఢిల్లీలో చేసిన నిర‌స‌న‌లో వీరే ఉండ‌టంతో.. బీజేపీకి సీట్లు త‌గ్గుతాయ‌ని అంతా అనుకున్నారు.

UP Elections
UP Elections

కానీ అంద‌రికీ షాక్ ఇస్తూ ప‌శ్చిమ యూపీలో కూడా బీజేపీకి ఏ మాత్రం సీట్లు త‌గ్గ‌లేదు. ఇంకా చెప్పాలంటే.. పశ్చిమ యూపీని స్వీప్ చేసే దిశలో బీజేపీ దూసుకుపోతోంది. ఇక ఓటింగ్ శాతం కూడా బీజేపీకే చాలా ఎక్కువ‌గా ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు బీజేపీకి 52 శాతం వ‌స్తే.. బీఎస్పీకి 22.1 శాతం, ఎస్పీకి 16.3 శాతం ఓటింగ్ వ‌చ్చింది. ఈ స‌ర‌ళిని చూస్తుంటే.. బీజేపీ తిరుగు లేని శ‌క్తిగా ఎదిగింద‌నేది చాలా క్లియ‌ర్ గా క‌నిపిస్తోంది. రెండోసారి యోగి సీఎం అవ‌డం ఖాయం అయిపోయింది.

Also Read: ఎగ్జిట్ పోల్స్ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో నిజం అవుతాయా?

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.

1 COMMENT

  1. […] UP Election Result 2022: కాషాయ లాల్చి పైజామా డ్రైస్సు .. ముహంపై చిరునవ్వు.. ఇంకా యువకుడిలాగానే కనిపించే.. ఆదిత్య యోగీనాథ్ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అభ్యర్థిగానే పోటీ చేశారు. త్వరలో రెండోసారి సీఎం పీటమెక్కుతారు. కానీ ఆయన గురించి దేశ వ్యాప్తంగా చర్చలు పెడుతున్నారు. ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో రికార్డు బద్దలు కొట్టి రెండో సారి సీఎం అయిన ఘనత యోగికి మాత్రమే దక్కుతుంది. అంతేకాకుండా తనపై ఎన్నో ఆరోపణలు.. ఒత్తిడి ఉన్నా వాటిని ఛేదించుకొని మెజారిటీ సీట్లు సాధించి పేరు సంపాదించాడు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ తరువాత.. కాబోయే ప్రధాని అని పేరు తెచ్చుకున్న యోగి సీఎం గా చేసిన కొన్ని సంస్కరణలు అద్భుత ఫలితాలిచ్చాయి. అందుకే ఆయన పక్షాన ప్రజలు ఉండి రెండోసారి సీఎం కూర్చునే విధంగా చేశారు. […]

Comments are closed.

Exit mobile version