Pawan Kalyan NBK : పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలన్నది అందరి కల. ఆ కలను నెరవేర్చుకునేందుకు ఆయన కష్టపడుతున్నాడు. ప్రజల్లోకి వెళుతున్నారు. ‘వారాహి’తో యాత్రకు సిద్ధమవుతున్నారు. పార్టీని నడిపేందుకు మాత్రమే పవన్ సినిమాలు చేస్తున్నాడు. అందులో ఎలాంటి డౌట్ లేదు. అయితే ఆయన చేసే సాయం కొండంత.. కానీ బయటకు వచ్చింది చాలా తక్కువ. తాజాగా ఒక ముసాలవాడ పవన్ గురించి చెప్పిన నిజాలు.. ఆమె మాటలు స్ఫూర్తిని పంచాయి.
అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే అంటూ బాలయ్య హోస్ట్ గా నిర్వహిస్తున్న షోకు పవన్ కళ్యాణ్ గెస్ట్ గా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ లేటెస్ట్ ప్రోమో తాజాగా విడుదలైంది. వైరల్ గా మారింది. ఒక ముసలావిడ ఈ స్టేజీపైకి వచ్చి బాలయ్య, పవన్ లతో ఇంటరాక్ట్ అయ్యింది. ఈ సందర్భంగా ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.
ముసలావిడ స్టేజీపైకి రాగానే పవన్ ఆప్యాయతతో ఆమెను గట్టిగా హత్తుకున్నాడు. ‘నాకు ఇద్దరు కొడుకులు చచ్చిపోయారు. కానీ ఒక కొడుకు ఉన్నాడు. ఆ కొడుకు పవన్ కళ్యాణ్. పవన్ సీఎం అయ్యాక అప్పుడు చచ్చిపోతాను’ అంటూ ఎమోషనల్ అయ్యింది. మధ్యలో ఆమె గాథను ఆహా వాళ్లు హైడ్ చేశారు.
దీంతో ఇద్దరు కొడుకులనుకోల్పోయిన ఆ బామ్మకు పవన్ కళ్యాణ్ అండగా నిలబడ్డాడని.. ఆమెకు ఆర్థిక సాయం చేశాడని తెలుస్తోంది. పవన్ సీఎం అయ్యాకే చచ్చిపోతానన్న బామ్మ మాట అనగానే పవన్ కళ్యాణ్ ఏమోషనల్ అయ్యి ఆమె కాళ్లకు నమస్కరించాడు. ఈ సీన్ అన్ స్టాపబుల్ లో హైలెట్ గా నిలిచింది.
ఇక జగన్ తో రాజకీయవైరం.. ‘హరిహర వీరమల్లు’ సినిమా గురించి పవన్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. దర్శకుడు క్రిష్ కూడా పవన్ తో కలిసి ఈ షోలో సందడి చేశాడు. సింహం, పులి మధ్యలో కూర్చున్నట్టు ఉందని అన్నాడు. ఆ ఆసక్తికర ప్రోమోను కింద చూడొచ్చు.