Unstoppable 2: నందమూరి కుటుంబం లో గత కొంత కాలం నుండి అంతర్గత పోరు మొదలైంది..విజయవాడ లోని ఎన్టీఆర్ మెడికల్ యూనివర్సిటీ పేరు ని YSR మెడికల్ విశ్వ విద్యాలయం గా మార్చాలని వైసీపీ పార్టీ తీసుకున్న నిర్ణయం ని తెలుగు దేశం పార్టీ నాయకులూ మరియు నందమూరి కుటుంబ సభ్యులు తీవ్రంగా విమర్శించగా జూనియర్ ఎన్టీఆర్ మాత్రం చాలా సున్నితంగా ఈ అంశం పై స్పందించారు.

ఎన్టీఆర్ మరియు YSR మహా నాయకులని..ఎన్టీఆర్ పేరు తొలగించి రాజశేఖర్ రెడ్డి గారి పేరుని యూనివర్సిటీ కి పెట్టినంత మాత్రాన ఎన్టీఆర్ స్థానాన్ని ఎవరు చెరపలేరని..ఇందువల్ల రాజశేఖర్ రెడ్డి గారి గౌరవం కూడా పెరగదని ఆయన చెప్పుకొచ్చారు..ఎన్టీఆర్ లాంటి మహానాయకుడితో రాజశేఖర్ రెడ్డి ని పోలుస్తావా అంటూ బాలయ్య బాబు ఫ్యాన్స్ మరియు టీడీపీ కార్యకర్తలు జూనియర్ ఎన్టీఆర్ పై తీవ్రమైన విమర్శలు చేశారు..సోషల్ మీడియా లోనే కాదు బయట కూడా దీనిపై నిరసన జ్వాలలు రగిలాయి.
ఇది ఇలా ఉండగా రీసెంట్ గా ‘అన్ స్టాపబుల్’ షో లో బాలయ్య బాబు రాజశేఖర్ రెడ్డి ని పొగుడుతూ ‘ఎందరో మహానాయకులు మన తెలుగులో ఉన్నారు..వారిలో రాజశేఖర్ రెడ్డి గారు కూడా ఒకరు’ అంటూ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు నందమూరి ఫాన్స్ కి నషాలంకి అంటుకునేలా చేస్తోంది..ఎన్టీఆర్ YSR ని పొగిడినప్పుడు బాలయ్య ఫాన్స్ మరియు టీడీపీ కార్యకర్తలు ఆ రేంజ్ లో ట్రోల్ చేశారే..కానీ ఇప్పుడు బాలయ్య బాబు కూడా రాజశేఖర్ రెడ్డి గారిని పొగిడాడు కదా..మరి ఆయనని ఎందుకు ట్రోల్ చెయ్యరు..ఆయనని ఎందుకు ప్రశ్నించరు అంటూ ఎన్టీఆర్ ఫాన్స్ విరుచుకుపడుతున్నారు.
టీడీపీ వాళ్లకి మరియు నందమూరి ఫాన్స్ లో ఒక వర్గానికి ఎన్టీఆర్ చాలా సాఫ్ట్ టార్గెట్ అయ్యిపోయాడని,రాజకీయాలకు సంబంధం లేని మా హీరో పై సమయం దొరికినప్పుడల్లా విషం కక్కుతున్నారంటూ ఎన్టీఆర్ ఫాన్స్ సోషల్ మీడియా లో ఆరోపిస్తున్నారు..మరి దీనికి టీడీపీ కార్యకర్తలు ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారో చూడాలి.