Shah Jahan: ప్రపంచంలోని అద్భుతమైన కట్టడాల్లో తాజ్ మహల్ ఒకటి. పర్యాటక ప్రేమికులు ఒక్కసారైనా ఇక్కడికి వచ్చి వెళ్లాలనుకుంటారు. అంతటి అతి సుందరమైన కట్టడంపై ఓ సీక్రెట్ బయటపడింది. తాజ్ మహల్ నిర్మించడానికి కారణాలేంటి..? ఈ తాజ్ మహల్ ను అక్కడే నిర్మించడానికి కారణాలేంటి..? పలు ఆసక్తి విషయాలు మీకోసం..
షాజహాన్ అసలు పేరు సాహాబుద్దీన్ మహహ్మద్ ఖుర్రం. అయితే అతను పరిపాలించిన కాలాన్ని బట్టి అతనికి షాజహాన్ అని పేరు పెట్టారు. జహంగీర్-నూర్ జహాన్ కు అత్యంత ప్రియమైన తనయుడు షాజహాన్. 1607వ సంవత్సరంలో షాజహాన్ 14 ఏళ్ల వయసులో మీనా బజార్ గుండా వెళుతుండగా సిల్క్ ఐటమ్స్ అమ్ముతున్న ఓ యువతి కనిపించింది. ఆ యువతి షాజహాన్ ను ఆకర్షించింది. అయితే ఆ అమ్మాయి ఎవరో కాదు తనకు బంధువైన భానుభేగమని తరువాత తెలిసింది. దీంతో షాజహాన్ తన తండ్రి వద్దకు వెళ్లి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఉందని చెప్పాడు. అయితే కొడుకుపై ఉన్న ప్రేమతో జహంగీర్ వాళ్ల పెళ్లికి ఒప్పుకున్నాడు. అయితే వారి వయసు చిన్నది కావడంతో పెళ్లిని వాయిదా వేశాడు.
Also Read: Telangana TDP: టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఎదగాలని చూస్తున్న టీడీపీ?
ఆ తరువాత ఐదేళ్లు గడిచిన తరువాత 1612లో షాజహాన్ పెళ్లి జరిగింది. అయితే 1610లోనే వేరే అమ్మాయితో షాజహాన్ కు పెళ్లి జరిగింది. అజ్మన్ భేగంతో పెళ్లి అయిన తరువాత ఆస్థానానికి షాజహాన్ రాజు అయ్యాడు. దీంతో అజ్మన్ ను తన లక్కీ భార్యగా భావించాడు. దీంతో ఆమెకు ముంతాజ్ మహల్ అని పేరు పెట్టాడు. షాజహాన్ కు ఎంతమంది భార్యలున్నా ముంతాజ్ మహల్ అంటే విపరీతమైన ప్రేమ. ముంతాజ్ ప్రేమ, తెలివికి షాజహాన్ ముగ్గుడయ్యేవాడు. ఒక్క క్షణం కూడా తనని వదిలి ఉండేవాడు కాదు. వీరి ప్రేమ ఎంత మధురమైనది అనడానికి వీరికి కలిగిన 14 మంది సంతానమే నిదర్శనం. 14వ బిడ్డను కంటుండగా ముంతాజ్ మరణించింది. దీంతో ఆమె గుర్తుగా 22 ఏళ్లపాటు శ్రమించి తాజ్ మహాల్ ను కట్టాడు షాజహాన్. 1666 సంవత్సరంలో షాజహాన్ ను ఆయన కొడుకు అయిన ఔరంగజేబు జైలులో పెట్టి చంపించాడు.
అయితే ముంతాజ్ పై షాజహాన్ కు ప్రేమ ఉంటే ఆమె ఎందుకు అలా చనిపోయింది..? అన్న ప్రశ్న ఎదురవుతోంది. 14 మంది సంతానం కలిగిన షాజహాన్ ముంతాజ్ ను ఎంత కష్టపెట్టాడోనని అనుకుంటున్నారు. అంతేకాకుండా ముంతాజ్ పై అంత ప్రేమ ఉన్నప్పుడు ఇతరులతో సంబంధాలను ఎందుకు పెట్టుకునేవాడనేది ప్రశ్న. షాజహాన్ కు అమ్మాయిలంటే పిచ్చి అని.. ఎప్పుడూ ఎవరినో ఒకరిని చరుస్తూనే ఉండేవాడని కథలుకథలుగా చరిత్రలో చెబుతారు. ఇక అతి క్రూరమైన నిజం ఏంటంటే తన కూతురిని కూడా షాజహాన్ వదలలేదని ప్రాన్సెస్ వెనియర్ అనే చరిత్ర కారుడు తన పుస్తకంలో రాశాడు. ‘షాజహాన్ కూతురైన జహనారా అచ్చం ముంతాజ్ మహలాగే ఉండేది. అందుకే తన కూతురికి పెళ్లి చేయకుండా తనని అనుభవించేవాడు. అంత క్రూరమైన వ్యక్తి తన ప్రేమకు చిహ్నంగా తాజ్ మహల్ ను కట్టాడం హస్యస్పదంగా ఉంది. ’ అని ఆయన పుస్తకంలో రాశారు.
ఇక తాజ్ మహాల్ పై మరో కథనం ఉంది. తాజ్ మహల్ నిర్మాణం ప్రపంచంలోనే అందమైన కట్టడంగా పేరు పొందింది. అయితే ఇది ఒక హిందూ దేవాలయంపై నిర్మించారని తెలుస్తోంది. ఎందుకంటే తాజ్ మహల్ చుట్టూ ఓ పెద్ద ప్రహారీ గోడ ఉంది. దీనిని రెడ్ స్టోన్స్ తో నిర్మించారు. అంతేకాకుండా ఈ ప్రహారి గోడకు ఒకచోట ద్వారాన్ని మూసివేసినట్లు ఆకారం ఉంది. అంటే ఇక్కడ ఏదో సీక్రెట్ దారి ఉన్నట్లు తెలుస్తోంది. ఇక తాజ్ మహల్ కు దగ్గర ఆగ్రా ఫోర్ట్ ఉంది. ఈ పోర్ట్ కు తాజ్ మహల్ కు మధ్య సీక్రెట్ దారి ఉంది. దీనిని బట్టి చూస్తే తాజ్ మహల్ కింద హిందూ దేవాలయానికి సంబంధించిన ఆనవాళ్లను చూడొచ్చని చరిత్రకారులు అంటున్నారు.
అయితే ఇక్కడి అధికారులు అలాంటి విషయాలను అడిగితే తప్పుగా సమాధానం ఇస్తున్నారని అంటున్నారు. కానీ ఇక్కడి కొన్ని ఆనవాళ్లు చూస్తే కచ్చితంగా కింద ఏదో నిర్మాణం ఉన్నట్లు పేర్కొంటున్నారు. సాధారణంగా ముస్లింల భవనాలు, కట్టడాలు ఒక రకంగా ఉంటాయి. కానీ తాజ్ మహల్ చుట్టూ ఉన్న కట్టడం హిందే దేవాలయాన్ని పోలి ఉంది. అందుకే ఇక్కడ ఒకప్పుడు దేవాలయం ఉందని కొందరు వాదిస్తున్నారు. అయితే అసలు నిజం ఎన్నటికి బయటపడుతుందో చూడాలి.