KCR Good News To Unemployed : ఎంత వ్యతిరేకత ఉన్నా సరే ఒకే ఒక్క ప్రకటనతో తెలంగాణ నిరుద్యోగులను కూల్ చేసేశాడు కేసీఆర్.. ఇన్నాళ్లు కేసీఆర్ ను తిట్టిన నిరుద్యోగుల చేతనే తాజాగా పాలాభిషేకాలు చేయించుకున్నారు. కేసీఆర్ దెబ్బకు ఇప్పుడు టీఆర్ఎస్ నేతలు, నిరుద్యోగులు తెలంగాణలోని పాల డిపోలపై పడ్డారు. అక్కడి పాల ప్యాకెట్లతో కేసీఆర్ చేసిన ప్రకటనకు ఆయన క్షీరాభిషేకాలు చేసేశారు. దెబ్బకు పాల ప్యాకెట్లన్నీ ఖాళీ అయిపోయాయట..
కరోనా వేళ ప్రైవేటు ఉద్యోగాలన్నీ కొట్టుకుపోయాయి. ఉన్న కొలువులను కోసేస్తున్నారు. ఇంతటి కరువులో అల్లాడుతున్న నిరుద్యోగుల ఆకలి తీర్చేలా కేసీఆర్ ఏకంగా 80వేలకు పైగా పోస్టులకు నోటిఫికేషన్లు ఇవ్వడంతో నిరుద్యోగులు రోడ్లపైకి వచ్చి పండుగ చేసుకుంటున్నారు. టపాసులు కాల్చి.. స్వీట్లు పంచుతున్నారు. ఇన్ని రోజులు పడిన కష్టానికి ప్రతిఫలం దక్కుతుండడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడిన వీడియోలు, ఉద్యోగ వివరాలను వాట్సాప్, ఫేస్ బుక్ లలో షేర్ చేస్తూ స్టేటస్ లలో మోత మోగిస్తున్నారు. టీవీలకు, సెల్ ఫోన్లకు అతుక్కుపోయి 10 గంటల నుంచే కేసీఆర్ ప్రకటన కోసం ఎదురుచూశారు. కేసీఆర్ ఉద్యోగ ప్రకటనను నిరుద్యోగులు శ్రద్ధగా విన్నారు.
Also Read: KCR Shocks To Opposition Party’s: కేసీఆర్ ప్రతిపక్షాల నోళ్లకు తాళం వేశారా?
కేసీఆర్ ప్రకటన తర్వాత తెలంగాణలోని యూన్సివరిటీలు ఓయూ, కేయూల్లో సందడి నెలకొంది.విద్యార్థులంతా డీజే నృత్యాలతో కేసీఆర్ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకాలు చేశారు. ఇక ఇన్నాల్లుగా నిరుద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత తెచ్చుకున్న కేసీఆర్ ఈ ఒక్క ప్రకటనతో మొత్తం మార్చేశారు. వారి మద్దతు కూడా కూడగట్టుకున్నారు. నిరుద్యోగులకు ఎలాంటి గందరగోళం లేకుండా అన్ని విషయాల్లో క్లారిటీ ఇచ్చి పారదర్శకంగా ఉద్యోగాల భర్తీ జరుగుతుందనే భరోసా కల్పించారు.
ఇన్నాళ్లు అన్ని రంగాల్లో అన్ని వర్గాల నుంచి పాజిటివ్ స్పందన తెచ్చుకున్న కేసీఆర్ సర్కార్ కు ఒక్క నిరుద్యోగులు, ఉద్యోగాలే గుదిబండగా ఉండేవి. తాజా ప్రకటనతో ఇది పటాపంచలైపోయింది.
రాబోయే ఎన్నికల వరకూ 20 ఏళ్ల నుంచి 40 ఏళ్ల పైబడి వయసున్న యువత అంతా ఇక చదువుల్లో మునిగి తేలనున్నారు. తమ భవిష్యత్ కోసం కోచింగ్ ల బాటపడుతారు. ఇక ఈ రెండేళ్లు ఉద్యోగ నామ సంవత్సరం కానుంది. దీంతో ఆ వ్యతిరేకత సమసి వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ గెలుపునకు ఈ స్టెప్ బాగా దోహదపడనుంది. ఇలా తిట్టిన వాళ్లతోనే పొగిడించుకోవడం కేసీఆర్ సాధ్యం.. భళా కేసీఆర్ అని అందరూ అంటున్నారు.
Also Read: Ravi Teja Ramarao On Duty Movie: శరవేగంగా టాకీ పార్ట్ పూర్తి చేసిన ‘రామారావు’