Unbelievable facts in Kashmir : 1990 నుంచి 2018 వరకు కాశ్మీర్ ప్రభుత్వ ఉద్యోగులు ఎటువైపు?

  Unbelievable facts in Kashmir ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీర్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయో చూస్తున్నాం. కానీ ఇప్పటికీ ఆ ఉగ్ర మూకల దాడులు అక్కడక్కడ జరుగుతూనే ఉన్నాయి. ఫలితంగా కర్ఫ్యూ, రకరకాల ఆంక్షలు. అసలు భారతదేశ విభజన తర్వాత కాశ్మీర్ ప్రజలు కంటినిండా నిద్రపోయింది ఎప్పుడని? కేవలం హిందువులే లక్ష్యంగా చేసుకుని సాగే ఉగ్రమూకలకు ఒకరు షెల్టర్ ఇస్తారు. ఇంకొకరు తిండి, ఇతరత్రా అవసరాలు చూసుకుంటారు. మరికొందరు డబ్బు, సెల్ ఫోన్లు […]

Written By: NARESH, Updated On : March 29, 2023 10:13 pm
Follow us on

 

Unbelievable facts in Kashmir ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీర్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయో చూస్తున్నాం. కానీ ఇప్పటికీ ఆ ఉగ్ర మూకల దాడులు అక్కడక్కడ జరుగుతూనే ఉన్నాయి. ఫలితంగా కర్ఫ్యూ, రకరకాల ఆంక్షలు. అసలు భారతదేశ విభజన తర్వాత కాశ్మీర్ ప్రజలు కంటినిండా నిద్రపోయింది ఎప్పుడని? కేవలం హిందువులే లక్ష్యంగా చేసుకుని సాగే ఉగ్రమూకలకు ఒకరు షెల్టర్ ఇస్తారు. ఇంకొకరు తిండి, ఇతరత్రా అవసరాలు చూసుకుంటారు. మరికొందరు డబ్బు, సెల్ ఫోన్లు ఇతరత్రా వ్యవహారాలు పర్యవేక్షిస్తారు.

అసలు కాశ్మీర్లో ఉగ్రవాదులకు లభించని సౌకర్యం అంటూ ఏముందని? ఉగ్రవాదులకు సహకరిస్తున్నదే ప్రభుత్వ ఉద్యోగులు. నమ్మేందుకు కొంచెం దిగ్భ్రాంతి కలిగించినా.. నమ్మి తీరాల్సిన నిజం ఇది. ఉగ్రవాదులకు అండదండలు అందిస్తున్నారని ఏకంగా 40 మంది ఉద్యోగులను లెఫ్టినెంట్ గవర్నర్ డిస్మిస్ చేశారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

హిజుబుల్ ముజాహిదీన్.. ఆ దిక్కుమాలిన పాకిస్తాన్ కు పుట్టిన ఓ ఉగ్రవాద మూక. ఈ సంస్థ చీఫ్ పేరు సయ్యద్ సలావుద్దీన్. ఈ సంస్థను నిషేధిత జాబితాలో ప్రపంచం ఎప్పుడో పెట్టేసింది. ఇక సలావుద్దీన్ కు ఏడుగురు సంతానం. ఈ ఏడుగురూ కాశ్మీర్ ప్రభుత్వంలో ఉద్యోగులు. ఉగ్రవాదులకు సౌకర్యాలు కల్పించడం, వారిని హిందువులపై దాడులు చేసేలా పురిగొల్పడం, ఏకంగా భారత సైన్యం కాన్వాయ్ పైకే బాంబులు విసిరేలా ప్రోత్సహించడం చేస్తుండే వారు. ఘనత వహించిన అప్పటి ప్రభుత్వం వీరిని చూసి చూడకుండా వదిలేసేది. పైగా ట్యాక్స్ పేయర్లు కట్టిన పన్నులను జీతాలుగా ఇచ్చేది. ఇలా ఈ ఏడుగురే కాకుండా బోలెడు మంది అక్కడ ప్రభుత్వ శాఖల్లో పాతుకుపోయారు. భారత సైన్యానికి వ్యతిరేకంగా, పాకిస్తాన్ కు అనుకూలంగా పని చేస్తున్నారు. అయితే ఆర్టికల్ 370 రద్దు తర్వాత కేంద్రం మరీ ముఖ్యంగా అమిత్ షా, అజిత్ దోవల్ కాశ్మీర్ పై ప్రత్యేకంగా కాన్సన్ట్రేషన్ పెట్టారు. ఏళ్లనాటి రాచపుండుకు ఆర్టికల్ 370 రద్దు మాత్రమే పరిష్కారం కాదని, తెరపైకి ఆర్టికల్ 311 ను తీసుకొచ్చారు. ప్రభుత్వంలోని ఉగ్రవాదులకు అనుకూలమైన ఉద్యోగులను ఏరివేశారు.

1990 నుంచి 2018 వరకు కాశ్మీర్ ప్రభుత్వ ఉద్యోగులు ఎటువైపు? అన్న దానిపై రామ్ గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు