https://oktelugu.com/

Omicron Variant: భారత్ లోకి ఒమిక్రాన్ వైరస్.. థర్డ్ వేవ్ వస్తుందా? నిపుణుల మాట ఇదీ

Omicron Variant: చైనాలోని వూహాన్ లో పుట్టిన మహమ్మారి రూపం మార్చుకుంటూ వివిధ దేశాల్లో శక్తిని పెంచుకుంటూ మళ్లీ మళ్లీ విరుచుకుపడుతూనే ఉంది. మనిషి నిర్లక్ష్యం.. టీకాలు తీసుకున్నామన్నా ధైర్యం ఏమో కానీ.. ఇప్పుడు ప్రపంచ దేశాల ప్రజలకు కరోనా కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఇప్పటికే మొదటి, రెండో వేవ్ లను ఎదుర్కొన్న ప్రజలకు ఇప్పుడు మూడో ముప్పు పొంచి ఉంది. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న దక్షిణాఫ్రికాలో రూపాంతరం చెందిన ‘ఒమిక్రాన్’ కరోనా వేరియంట్ ఇప్పుడు విశృంఖలంగా […]

Written By:
  • NARESH
  • , Updated On : December 3, 2021 / 09:29 AM IST
    Follow us on

    Omicron Variant: చైనాలోని వూహాన్ లో పుట్టిన మహమ్మారి రూపం మార్చుకుంటూ వివిధ దేశాల్లో శక్తిని పెంచుకుంటూ మళ్లీ మళ్లీ విరుచుకుపడుతూనే ఉంది. మనిషి నిర్లక్ష్యం.. టీకాలు తీసుకున్నామన్నా ధైర్యం ఏమో కానీ.. ఇప్పుడు ప్రపంచ దేశాల ప్రజలకు కరోనా కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.

    Omicron Variant

    ఇప్పటికే మొదటి, రెండో వేవ్ లను ఎదుర్కొన్న ప్రజలకు ఇప్పుడు మూడో ముప్పు పొంచి ఉంది. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న దక్షిణాఫ్రికాలో రూపాంతరం చెందిన ‘ఒమిక్రాన్’ కరోనా వేరియంట్ ఇప్పుడు విశృంఖలంగా విరుచుకుపడుతోంది. ఇప్పటికే యూరప్ లో దీని తీవ్రతకు పలు దేశాలు లాక్ డౌన్ దిశగా సాగుతున్నాయి. అసలే శీతాకాలం.. వైరస్ లకు అనువైన కాలం. దీంతో ఇది మరింత రెచ్చిపోతూ ప్రజలకు సోకుతోంది.

    భారత్ ప్రజలు ఆందోళన చెందుతున్నట్టే ఒమిక్రాన్ వైరస్ మన దేశానికి పాకింది. తాజాగా బెంగళూరుకు వచ్చిన ఆఫ్రికా వాసుల ద్వారా ఐదుగురికి ఒమిక్రాన్ వైరస్ నిర్ధారణ అయ్యింది. హైదరాబాద్లోనూ ఒకరికి ఇలాంటి అనుమానంతో వారి శాంపిల్ ను టెస్టుల కోసం పంపించారు.

    ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు థర్డ్ వేవ్ భయం పట్టుకుంది. ఒమిక్రాన్ దెబ్బకు ఆఫ్రికా దేశాలతోపాటు యూరప్ దేశాలు వణికిపోతున్నాయి. వచ్చిపోయే విమానాల ద్వారా ఈ వైరస్ అన్ని దేశాలకు పాకుతోంది.

    ఒమిక్రాన్ వైరస్ అంత్యంత ప్రమాదకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఇది వ్యాక్సిన్ లకు కూడా లొంగడం లేదని ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా భారత్ లోనూ ఈ వైరస్ బయటపడడంతో 140 కోట్ల జనాభా ఉన్న దేశంలో ఈ వైరస్ ను నియంత్రించడం సాధ్యమా? ఎలా అరికట్టాలన్నది ప్రభుత్వాలకు తలకు మించిన భారంగా మారింది. కేసులు పెరిగే థర్డ్ వేవ్, లాక్ డౌన్ లు తప్పవని అంటున్నారు.

    Also Read: నిర్లక్ష్యానికి ఒమిక్రిన్ మూల్యం

    రెండో వేవ్ కూడా ఇలానే సైలెంట్ గా ప్రారంభమైంది. కానీ దెబ్బకు దేశంలో మరణ మృదంగం వినిపించింది. ఇప్పుడు ‘ఒమిక్రాన్’పై కూడా ప్రభుత్వాలు, ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటికే కొన్ని ప్రభుత్వాలు కఠిననిబంధనలు విధించాయి. తెలంగాణలో మాస్క్ లేకుండా తిరిగితే రూ.1000 జరిమానా నిబంధన అమల్లోకి తెచ్చారు. విదేశాల నుంచి వచ్చే విమానాల రాకపోకలను ఆపేయాలనే డిమాండ్ వ్యక్తం అవుతోంది.

    అయితే రెండోవేవ్ లో ప్రజల నిర్లక్ష్యం వల్లే వైరస్ వ్యాప్తి ఎక్కువైంది. ఇప్పుడు మూడో వేవ్ ముప్పు ముంగిట కూడా వ్యాక్సిన్లువేసుకున్నామన్న ధైర్యంతో ప్రజల్లో నిర్లప్తత మొదలైంది. అదే కొంప ముంచేలా కనిపిస్తోందని నిపుణులు అంటున్నారు. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని వ్యాక్సిన్ తీసుకున్నా మాస్కులు, శానిటైజర్లు, భౌతికదూరం పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే ఒమిక్రాన్ తో భారత్ కు మూడో ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు. థర్డ్ వేవ్ , లాక్ డౌన్ రావాలంటే అది ప్రజల చేతిలోనే ఉంది. మరి వాళ్లు జాగ్రత్తలు పాటిస్తేనే ఈ ముప్పును అరికట్టగలమని నిపుణులు సూచిస్తున్నారు.

    Also Read: మహామ్మరి ‘ఒమ్రికాన్’.. అప్రమత్తంగా ఉండాల్సిందే..!