Married Womans Missing: ఆడవారికి రక్షణ లేకుండా పోతోంది. ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నా పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. దిశ, నిర్భయ లాంటి చట్టాలున్నా అవి కూడా వారిని రక్షించలేకపోతున్నాయి. దేశంలో నానాటికి ఆడవారిపై ఆకృత్యాలు పెరుగుతున్నాయి. పశువుల్లా పాడు చేస్తూ ప్రాణాలు తీస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆడవారు ఒంటరిగా బయటకు రావడం కష్టంగానే ఉంటోంది.

హైదరాబాద్ నగరంలో ఇద్దరు వివాహితలు ఒకే రోజు అదృశ్యం కావడం సంచలనం సృష్టిస్తోంది. పక్కపక్కేనే ఉండే చోట ఇద్దరు మహిళలు కనిపించకుండా పోవడం తెలిసిందే. దీంతో కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు. విశాఖపట్నం అక్కయ్యపాలెం కాలనీకి చెందిన లావణ్య, మధు భార్యాభర్తలు. నేరేడ్ మెట్ లోని తన పుట్టింటికి లావణ్య వచ్చింది. ఈనెల 13న ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆమె కనిపించలేదు. ఫోన్ చేస్తే స్విచాఫ్ వస్తోంది.

కామారెడ్డి జిల్లా లింగాపురం స్వామి ఆరు నెలల క్రితం భార్య సంధ్య తో మల్కాజిగిరి బీజేఆర్ కాలనీలో నివాసముంటున్నారు. స్వామి డ్రైవర్ గా పనిచేస్తుండగా సంధ్య అనుటెక్స్ లో సేల్స్ ఉమెన్ గా చేస్తోంది. ఈ నేపథ్యలో ఈనెల 13న ఇంటికి వచ్చిన స్వామికి భార్య కనిపించలేదు. దీంతో ఆమెకు ఫోన్ చేసినా స్విచాఫ్ వస్తోంది. పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇద్దరు వివాహితలు ఒకే రోజు అదృశ్యం కావడంతో ఆందోళన నెలకొంది. వారి ఫోన్లు కూడా స్విచాప్ రావడంతో కుటుంబీకులు కంగారు పడుతున్నారు. ఏం జరిగిందో ఇంతవరకు ఆచూకీ లభ్యం కావడంతో కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. తమ వారికి ఏమైందోనని బెంగ పెట్టుకున్నారు. పైగా ఇద్దరి ఇళ్లు కూడా పక్కపక్కనే ఉండటం గమనార్హం.
Also Read:Bithiri Sathi: ఆ ప్రముఖ ఛానల్ కు కూడా దూరమైన బిత్తిరి సత్తి.. వాళ్లే పంపించేశారా?