YS Viveka Murder Case: వివేకా హత్య కేసులో రెండు కోణాలు

YS Viveka Murder Case: ఉత్కంఠ రేపుతున్న వివేకా హత్య ఎందుకు జరిగిందన్న సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఏ కోణంలో హత్య చేశారన్న దానిపై ప్రధానంగా రెండు కోణాలు ఉన్నట్లు సీబీఐ ముందుకు వెళ్తున్న విధానాన్ని బట్టి తెలుస్తోంది. అవినాష్ రెడ్డి అరెస్టు తాత్కాలికంగా కొద్ది రోజులు వాయిదా పడింది. ఆయన అరెస్టు తరువాత సీబీఐ అసలు విషయాన్ని బయట పెడుతుందని అనుకుంటున్న తరుణంలో హై కోర్టు ఆదేశాలతో గుట్టు ఇంకొన్ని రోజులు కొనసాగనుంది. నాలుగేళ్ల […]

Written By: SHAIK SADIQ, Updated On : April 19, 2023 12:41 pm
Follow us on

YS Viveka Murder Case

YS Viveka Murder Case: ఉత్కంఠ రేపుతున్న వివేకా హత్య ఎందుకు జరిగిందన్న సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఏ కోణంలో హత్య చేశారన్న దానిపై ప్రధానంగా రెండు కోణాలు ఉన్నట్లు సీబీఐ ముందుకు వెళ్తున్న విధానాన్ని బట్టి తెలుస్తోంది. అవినాష్ రెడ్డి అరెస్టు తాత్కాలికంగా కొద్ది రోజులు వాయిదా పడింది. ఆయన అరెస్టు తరువాత సీబీఐ అసలు విషయాన్ని బయట పెడుతుందని అనుకుంటున్న తరుణంలో హై కోర్టు ఆదేశాలతో గుట్టు ఇంకొన్ని రోజులు కొనసాగనుంది.

నాలుగేళ్ల అనంతరం ఓ కొలిక్కి వస్తున్నట్లు కనిపిస్తుందని వివేకా హత్య కేసు విచారణ వైసీపీ అధికారంలోకి వచ్చిన మొదట్లో పెద్దగా కనిపించలేదు. ఆ తరువాత జగన్, వైసీపీ నేతలు పొంతనలేని ప్రకటనలు చేశారు. ఒక దశలో ప్రధాన వైసీపీ నేతలు పోలీసులను ప్రభావితం చేస్తున్నారన్న వాదనలు వినిపించాయి. తమకు ఏపీ ప్రభుత్వంపై నమ్మకం లేదని కేసును తెలంగాణాకు మార్చాలని వివేకా కూతరు హై కోర్టుకు విన్నవించుకున్న అనంతరం కేసు విచారణలో ఊపందుకుంది.

దాదాపుగా 300 మందికి పైగానే సాక్షులను విచారించిన సీబీఐ అనుమానితుల జాబితాను రెడీ చేసుకుంది. వారిలో డ్రైవర్ దస్తగిరి అప్రూవర్ గా మారిపోయి అన్ని విషయాలను సీబీఐ అధికారులకు చెప్పేశాడు. హత్యోదంతం జరిగిన తీరును కళ్లకు కట్టినట్లు చెప్పినట్లు తెలుస్తుంది. అప్పటి వరకు సంక్లిష్టంగా ఉన్న కేసు విచారణలో కదలిక వచ్చింది. దస్తగిరి చెప్పిన వాటిని నిర్థారణ చేసుకున్న సీబీఐ అధికారులు ఆ మేరకు కేసును ముందుకు తీసుకెళ్లగలిగి, పలువురిని అరెస్టు చేశారు.

YS Viveka Murder Case

దస్తగిరి వాంగ్మూలాన్నే బేస్ చేసుకొని విచారణ ప్రారంభించిన సీబీఐ, అంతకు ముందు జరిగిన పరిణామాలన్నింటిని బేరీజు వేసుకుంది. అధునాతన టెక్నాలజీని వాడుకుంది. ఎంపీ అవినాష్ రెడ్డి అసలు సూత్రధారుడని నిరూపణ చేసేందుకు సాక్ష్యాలను క్రోడీకరించడం మొదలుపెట్టింది. ఆయన ప్రధాన అనుచరులు ఇద్దరిని అరెస్టు చేసిన అనంతరం అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని అరెస్టు చేయడం సంచలనంగా మారింది. ప్రస్తుతం అవినాష్ రెడ్డికి ఎంతో ఉత్కంఠ తరువాత బెయిల్ మంజూరైంది.

ఇదిలా ఉండగా, అవినాష్ రెడ్డి సీబీఐ అధికారుల తీరుపై మండిపడుతున్నారు. దస్తగిరి చెప్పిన ప్రకారం విచారణ చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. వివేకా కూతరు సునీత, ఆమె భర్త కోణంలో ఎందుకు విచారణ చేయడం లేదని అంటున్నారు. వివేకాకు రెండో పెళ్లి అయ్యిందని, ఆస్తి కోసమే ఈ హత్య జరిగిందని ఆరోపిస్తున్నారు. అయితే, సీబీఐ అధికారులు వాటిని లెక్కలోకి తీసుకున్నట్లు కనబడటం లేదు. ఒక స్పష్టతతో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది.