https://oktelugu.com/

YS Viveka Murder Case: వివేకా హత్య కేసులో ట్విస్టులు

వైఎస్ వివేకానందరెడ్డి(YS Vivekananda Reddy) హత్య కేసు మలుపులు తిరుగుతోంది. ఈ కేసుల కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సాక్షుల నుంచి సేకరించిన వివరాలతో కేసులో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి(Bhaskar Reddy) మంగళవారం విచారణకు హాజరు కావడంతో వివేకా కేసుపై సీబీఐ పట్టు బిగిస్తోంది. ఈ నేపథ్యంలో వివేకా కుమార్తె సునీతారెడ్డి ఇచ్చిన 15 మంది అనుమానితుల జాబితాలో భాస్కర్ […]

Written By:
  • Srinivas
  • , Updated On : August 18, 2021 / 07:01 PM IST
    Follow us on

    వైఎస్ వివేకానందరెడ్డి(YS Vivekananda Reddy) హత్య కేసు మలుపులు తిరుగుతోంది. ఈ కేసుల కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సాక్షుల నుంచి సేకరించిన వివరాలతో కేసులో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి(Bhaskar Reddy) మంగళవారం విచారణకు హాజరు కావడంతో వివేకా కేసుపై సీబీఐ పట్టు బిగిస్తోంది. ఈ నేపథ్యంలో వివేకా కుమార్తె సునీతారెడ్డి ఇచ్చిన 15 మంది అనుమానితుల జాబితాలో భాస్కర్ రెడ్డి పేరు కూడా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.

    ఈ నేపథ్యంలో సీబీఐ అధికారులు భాస్కర్ రెడ్డిని మొదటిసారిగా విచారణకు రప్పించారు. మరోవైపు కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో సీబీఐ అధికారుల మరో బృందం చేపట్టిన విచారణకు జగదీశ్వర్ రెడ్డి, భరత్ కుమార్ హాజరయ్యారు. వీరిలో జగదీశ్వర్ రెడ్డి వైఎస్ వివేకానందరెడ్డి పొలం పనులు చూసే వారు కాగా భరత్ కుమార్ సీబీఐ అరెస్టు చేసిన సునీల్ యాదవ్ బంధువు.

    దీంతో వివేకా హత్య వెనుక కారణాలు ఏమై ఉంటాయనే కోణంలో విచారణ చేపడుతున్నారు. రాజకీయ వివాదాలు, ఆర్థిక లావాదేవీలపై కూడా ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. పలు కోణాల్లో భాస్కర్ రెడ్డిని ప్రశ్నించినట్లు సమాచారం. దీంతో కొన్ని కీలకమైన ఆధారాలు లభించినట్లు చెబుతున్నారు. ఇప్పటికే సెంట్రల్ జైల్ లో ఉన్న అనుమానితుడు సునీల్ నుంచి కూడా పలు కోణాల్లో సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది.

    సునీల్ తమ్ముడు కిరణ్ మాట్లాడుతూ వివేకా హత్య కేసులో అసలు వారిని వదిలేసి ఏ సంబంధం లేని వారిని అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు. సీబీఐ సాధించింది ఏం లేదని విమర్శించారు. సింహాన్ని చిట్టెలుక చంపుతుందా? అని ప్రశ్నించారు. ఈ కేసులో పెద్ద వారిని వదిలేస్తున్నారని వాపోయారు. ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని విచారణకు పిలవడంతో ఆసక్తికరంగా మారింది.