https://oktelugu.com/

రేప్ డ్రామా ఆడిన యువతి సూసైడ్ కేసులో ట్విస్ట్

గత ఫిబ్రవరిలో హైదరాబాద్ లోని ఘట్ కేసర్ లో కిడ్నాప్ డ్రామా ఆడి తనపై ఆటోడ్రైవర్లు గ్యాంగ్ రేప్ చేశారని అబద్ధమాడిన ఫార్మసీ యువతి అనంతరం అదంతా ఫేక్ అని ప్రియుడితో కలిసి ఎంజాయ్ చేయడానికి వెళ్లిందని పోలీసుల విచారణలో తేలిన సంగతి తెలిసిందే. దాంతో పరువు పోగొట్టుకున్న యువతి మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఆమె తల్లిదండ్రులు ఇంట్లోనే బంధించడంతో బీపీ, షూగర్ మాత్రలు వేసుకొని చనిపోయింది. అయితే ఆ కేసులో ఇప్పుడు అనుకోని […]

Written By:
  • NARESH
  • , Updated On : April 14, 2021 / 11:13 AM IST
    Follow us on

    m

    గత ఫిబ్రవరిలో హైదరాబాద్ లోని ఘట్ కేసర్ లో కిడ్నాప్ డ్రామా ఆడి తనపై ఆటోడ్రైవర్లు గ్యాంగ్ రేప్ చేశారని అబద్ధమాడిన ఫార్మసీ యువతి అనంతరం అదంతా ఫేక్ అని ప్రియుడితో కలిసి ఎంజాయ్ చేయడానికి వెళ్లిందని పోలీసుల విచారణలో తేలిన సంగతి తెలిసిందే.

    దాంతో పరువు పోగొట్టుకున్న యువతి మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఆమె తల్లిదండ్రులు ఇంట్లోనే బంధించడంతో బీపీ, షూగర్ మాత్రలు వేసుకొని చనిపోయింది.

    అయితే ఆ కేసులో ఇప్పుడు అనుకోని ట్విస్ట్ వచ్చింది. ఆత్మహత్య చేసుకున్న బీఫార్మసీ విద్యార్థిని కేసులో కొత్త విషయాలు వెలుగుచూశాయి.

    తన కుమార్తె ఒక పెళ్లి అయ్యి ఇద్దరు పిల్లలు ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకుందని.. అతడు మోసం చేసి తన కూతురిని వాడుకున్నాడని బాధత యువతి తల్లి ఆరోపించింది. కీసర ఠాణా పరిధిలోని ఆర్ఎల్ఆర్ నగర్ కు చెందిన ఓ యువకుడు, అతడి స్నేహితురాలు కలిసి మాయమాటలతో తన కుమార్తె జీవితాన్ని నాశనం చేశారని ఆరోపించారు. అతడు మా ఇంటిముందే ఉండి తమ కూతురును ప్రేమ పేరుతో మోసం చేశాడని ఆరోపించారు. పెళ్లి అయ్యి పిల్లలు ఉన్న అతడు మానసికంగా.. శారీరకంగా ఇబ్బందులు పెట్టారని ఆరోపించారు.

    సదురు యువకుడి వల్లే ఆటోడ్రైవర్ల పేర్లు తమ కూతురు చెప్పిందని.. తమకు న్యాయం చేయాలని బాధిత యువతి తల్లి ఆరోపించింది. ఈ మేరకు ఆ ప్రియుడితో తన కూతురు సన్నిహితంగా ఉన్న ఫొటోలను రిలీజ్ చేసి సంచలనం సృష్టించింది.

    అయితే ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య కేసులో తమకు ఇంతవరకు ఆమె తల్లి నుంచి ఫిర్యాదు అందలేదని ఘట్ కేసర్ సీఐ తెలిపారు. ఈ కేసును మూసివేయలేదని.. ఫిర్యాదుచేస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు.