TVK Tamil Nadu elections : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో నటుడు విజయ్ స్థాపించిన ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) పార్టీ ప్రదర్శిస్తున్న అద్భుతమైన పనితీరు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. తన తొలి ఎన్నికల్లోనే విజయ్ అత్యంత ప్రజాదరణతో సీఎం రేసులో నిలవడం, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానంతో పోలుస్తున్నారు. ఈ నేపథ్యంలో, కొందరు నెటిజన్లు విజయ్ విజయాన్ని పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ తో విజయ్ పోలిక
సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ ప్రధానంగా విజయ్ మొదటి ప్రయత్నం, పవన్ కళ్యాణ్ ప్రారంభ దశతో పోలికల చుట్టూ తిరుగుతోంది. జనసేన పార్టీ తన మొదటి ఎన్నికల్లో ఆశించిన స్థాయి ఫలితాలు సాధించలేకపోయిందనే వాదనను, విజయ్ సక్సెస్‌తో ముడిపెట్టి పవన్ కళ్యాణ్‌ను విమర్శిస్తున్నారు. ఎన్నికల్లో విజయ్ పూర్తిగా పవన్ కళ్యాణ్ ప్రచార శైలిని అనుసరించారు. ఫలితాలు అనుకూలంగా సాధించారు.
భిన్నంగా పరిస్థితులు..
విజయ్ తన పార్టీని పూర్తిగా స్వతంత్రంగా నడుపుతుండగా, పవన్ కళ్యాణ్ తన రాజకీయ ప్రయాణంలో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొని, ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా నిలిచి, వంద శాతం 21/21 విజయంతో డిప్యూటీ సీఎం స్థాయికి ఎదిగారు. 2019లో పవన్ కళ్యాణ్ ఒంటరిగా ఎన్నికల బరిలో నిలిచారు. కానీ ఎలాంటి ప్రభావం చూపలేకపోయారు. చివరకు పవన్ కళ్యాణ్ కూడా ఓడిపోయారు.
ప్రజాదరణతో ఎదిగి..
పవన్ కళ్యాణ్ పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు సుదీర్ఘ పోరాటం చేశారు. విజయ్ ప్రాచుర్యం వేరు, పవన్ కళ్యాణ్ గడించిన రాజకీయ అనుభవం వేరు అని విశ్లేషకులు భావిస్తున్నారు.
దుష్ప్రచారం వెనుక..
పవన్ కళ్యాణ్ వ్యతిరేక వర్గాలు, ఆయనను వ్యక్తిగతంగా దెబ్బతీయడానికి మాత్రమే తాజాగా విజయ్ త పోలుస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. కావాలనే సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏపీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఒక అత్యంత ప్రభావవంతమైన నాయకుడిగా నిరూపించుకున్నప్పటికీ, విజయ్ సాధిస్తున్న ఫలితాలను ఆయన వైఫల్యంగా చిత్రీకరించడం ద్వారా జనసేన ఓటు బ్యాంక్ లేదా ఆయన ఇమేజ్‌ను ప్రభావితం చేసే ప్రయత్నం జరుగుతోంది.
తమిళనాడు రాజకీయ పరిస్థితులు మరియు ఏపీ రాజకీయ సమీకరణాలు పూర్తిగా భిన్నమైనవి. విజయ్ సక్సెస్ ఒక నటుడిగా ఆయనకు ఉన్న ఇమేజ్‌ను ప్రతిబింబిస్తే, పవన్ కళ్యాణ్ స్థానం సుదీర్ఘ రాజకీయ పోరాటం మరియు ప్రజల మద్దతుతో వచ్చిన ఫలితం. కాబట్టి, ఈ రెండు వేర్వేరు రాజకీయ పరిణామాలను పోల్చడం కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే తప్ప, అందులో వాస్తవికత లేదని స్పష్టమవుతోంది.