JP Nadda My Home Jupally: సమతామూర్తి విగ్రహావిష్కరణతో చినజీయర్ స్వామికి, సీఎం కేసీఆర్ కు మధ్య బంధం చెడిపోయింది. తెలంగాణలో సమతామూర్తి ఆలయానికి అన్ని సమకూర్చిన తనను కాదని.. మోడీని పిలిచి ప్రారంభోత్సవం చేయడం.. కనీసం శిలాఫలకంలో తన పేరు కూడా పెట్టకపోవడంతో చినజీయర్ స్వామిని దూరం పెట్టారు సీఎం కేసీఆర్.అప్పటి నుంచి ఆయనతో వైరం కొనసాగిస్తున్నారు. ఇక చినజీయర్ స్వామి వెంటే ఉండే ఆయన ఆప్తుడు, ప్రముఖ మైహోం గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వరరావుతో కూడా కేసీఆర్ కు చెడింది. కొద్దికాలంగా విభేదాలతో ఈ ఇద్దరు కూడా దూరంగా ఉంటున్నారు.
కేసీఆర్ చెప్పాడని.. ప్రోత్సాహించాడని గతంలో టీవీ9 ను కొనేశారు మైహోం రామేశ్వరరావు. ఏమైందో కానీ ఇప్పుడు కేసీఆర్ తో అంతగా సంబంధాలు లేవంటారు. చినజీయర్ స్వామితోపాటు రామేశ్వరరావుతో కూడా కేసీఆర్ కు కటీఫ్ అయిపోయిందని బయట టాక్.
టీఆర్ఎస్ కు దూరమైన టీవీ9 యజమాని, మైహోం గ్రూపు అధినేత జూపల్లి రామేశ్వర్ రావు ఇప్పుడు బీజేపీకి దగ్గరవుతున్నారు. ఈరోజు సాయంత్రం 6:50 నిమిషాలకు శంషాబాద్ నోవాటెల్ హోటల్ లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో జూపల్లి భేటీ కానున్నారు. సీఎం కేసీఆర్ తో రామేశ్వర్ రావుకు దూరం పెరిగిన నేపథ్యంలో బీజేపీ పెద్దను జూపల్లి కలవడం రాజకీయంగా ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.
తెలంగాణలో కేసీఆర్ అండ పోవడంతో కేంద్రంలోని బీజేపీ సపోర్టు కోసం.. వ్యాపారాల్లో అండ కోసమే జూపల్లి ఇలా బీజేపీ పంచన చేరబోతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికిప్పుడు కేసీఆర్ తో థ్రెట్ లేకపోయినా.. భవిష్యత్తులో ఎలాంటి ముప్పు లేకుండానే జూపల్లి బీజేపీతో సాన్నిహిత్యం కోసం ఇలా భేటికి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మరి ఈ భేటికి వెనుక అసలు కారణాలేంటన్నవి మాత్రం ఈ సాయంత్రం తెలియనున్నాయి.