Homeఆంధ్రప్రదేశ్‌TV5 Sambasiva Rao: లోకేష్ + కళ్యాణ్ కలిస్తే ‘లోక కల్యాణమే’.. టీవీ5 సాంబశివుడి డిఫినేషన్...

TV5 Sambasiva Rao: లోకేష్ + కళ్యాణ్ కలిస్తే ‘లోక కల్యాణమే’.. టీవీ5 సాంబశివుడి డిఫినేషన్ ఇదీ.. వైరల్ వీడియో

TV5 Sambasiva Rao: “వార్త యందు జగతి వర్ధిల్లాలి”. మీడియా ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావాలి. నాలుగో స్తంభంగా ప్రజాసామ్య పరిరక్షణకు కృషి చేయాలి. వ్యవస్థలన్నీ భ్రష్టుపట్టిపోతున్నప్పుడు వాచ్‌ డాగ్‌గా చర్నాకోల్‌ పట్టుకుని తన వంతు పాత్ర పోషించాలి. మీడియా ఇలా ఉండేది కాబట్టే అడాల్ఫ్‌ హిట్లర్‌ లాంటి నియంత “నేను వంద కత్తులకు భయపడను. పదునైన పెన్నుకు భయప డతాను” అని వ్యాఖ్యానించాడు.కాలం మారుతున్నా కొద్దీ మీడియా కూడా తన విశ్వసనీయతను కోల్పోవడం మొదలుపెట్టింది.

వార్తలకు బదులుగా న్యూసెన్స్‌ను ప్రసారం చేయడం, ప్రచురించడం పెరిగిపోయింది. ఫలితంగా మీడియా అంటేనే ఏవగింపు మొదలయింది. ఇది ఎక్కడి దాకా వెళ్లిందంటే ప్రజా సమస్యలను గాలికి వదిలేసి పార్టీల డప్పు కొట్టే స్థాయికి దిగజారింది. అంతే కాదు అందులో పని చేస్తున్న పాత్రికేయులు(కొందరు మాత్రమే) పార్టీకి అనుకూలంగా మాట్లాడేస్తున్నారు. ఓ సాక్షి, టీ న్యూస్‌.. అవన్నీ పార్టీ చానెల్స్‌. మరి ఈటీవీ, ఏబీఎన్‌, టీవీ5, మహా టీవీ.. వీటిని ఏ కేటగిరీలో చేర్చాలి? జర్నలిజం ముసుగులో చేస్తున్నది పచ్చ ప్రచారం కాదా?

చంద్రబాబు అరెస్ట్‌ అయిన తర్వాత ఈ చానెల్స్‌ పటాటోపం పతాక స్థాయికి చేరింది. ఓ చానెల్‌ లో దోమలతో చంద్రబాబు మీద దాడికి రంగం సిద్ధమవుతోందని చెబుతారు. ఇక టీవీ5 చానెల్‌లో అయితే లోకేష్‌, పవన్‌ కల్యాణ్‌ కలిశారు.. ఇక లోక కల్యాణమే అని ఆ ఛానెల్ ప్రజెంటర్ సాంబశివరావు ప్రకటించేశారు. మరి ఇది ఏం జర్నలిజమో వారే చెప్పాలి?ఆమధ్య చంద్రయాన్_3 ప్రయోగం విజయవంతమైనప్పుడు ఇక చంద్రయానమే, ఆంధ్రాలో జరిగేది కూడా ఇదే అని సాంబశివరావు వ్యాఖ్యానించారు. ఆ తర్వాత కొద్ది రోజులకు చంద్రబాబు నాయుడు స్కిల్ పథకంలో అవకతవకలకు సంబంధించి అరెస్టయ్యారు. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ లోకేష్, బాలకృష్ణకు భరోసా ఇచ్చారు..ములాఖత్ ద్వారా చంద్రబాబును పవన్ కళ్యాణ్ పరామర్శించారు. అనంతరం బయటికి వచ్చి వచ్చే ఎన్నికల్లో టిడిపి తో కలిసి పోటీ చేస్తామని ప్రకటించారు. వాస్తవానికి ఇక్కడ పవన్ కళ్యాణ్ ముందడుగు వేయకుంటే టీడీపీ పరిస్థితి మరో విధంగా ఉండేది.

అణువణువూ పచ్చ అభిమానం నింపుకున్న సాంబశివరావు లోకేష్ పవన్ కళ్యాణ్ ను కలిపి లోక కళ్యాణం అని వ్యాఖ్యానించాడు. లోకేష్ ను ముందు వరుసలో నిలిపేందుకు తెగ తాపత్రయ పడిపోయాడు. గతంలో పవన్ కళ్యాణ్ ఇదే విధంగా టిడిపికి మద్దతు ఇచ్చినప్పుడు.. రాజధాని రైతుల విషయంలో అన్యాయం జరుగుతున్నప్పుడు ప్రశ్నిస్తే.. పచ్చ మీడియా అడ్డగోలుగా వార్తలు రాసింది. ఇప్పుడు కూడా అదే బుద్ధిని ప్రదర్శిస్తోంది. కాగా సాంబశివరావు పచ్చ పైత్యం పట్ల నెటిజెన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ” అప్పుడు ఇక చంద్రయానమే అన్నావు. ఇప్పుడు లోక కళ్యాణం అంటున్నావు. అంటే లోకేష్ కూడా అరెస్ట్ అవుతాడా” అని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సాంబశివరావు మాట్లాడిన మాటల తాలూకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular