Chandrababu Jail: ఎవరి నోటికి ఏది తోస్తే అది రాయడం, కూయడమే ప్రజెంట్ జర్నలిజం ట్రెండ్. రంగూ రుచీ వాసన చిక్కదనం లేని టీ అసలు టీయే కాదన్నట్టు.. పరిపక్వత, పరిణతి, హుందాతనం, కామన్ సెన్స్ గట్రా ఏమీ లేకపోతే అది అసలు వార్తే కాదని ఎవరూ చెప్పలేదు. చెప్పాల్సిన పనిలేదు. ఉదాహరణలుగా చంద్రబాబు అరెస్టుకు సంబంధించిన టీవీ వార్తలు, పత్రికా వార్తలు చదివితే చాలు. పైగా ఇందులో ఏ పాజిటివ్ లక్షణం లేకపోవడం కాదు, పాచి కంపు కొడుతుండడం అదనపు విశేషం.
ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత.. యూట్యూబ్ అనేది మన జీవితాల్లోకి మరింత చర్చికి వచ్చిన తర్వాత ఎవరికి వారే సొంతంగా చానల్స్ ఏర్పాటు చేసుకుంటున్నారు. మేము తోపు జర్నలిస్టులం అని చెప్పుకుంటున్నారు. సరే వాళ్లకు అది ఒక ఉపాధి మార్గం.. చూసే వాళ్ళు చూస్తారు. ఇష్టం లేనివారు స్కిప్ చేస్తారు. అని టీవీ5 లాంటి మెయిన్ స్ట్రీమ్ ఛానల్ లో కూడా జర్నలిజం ఇలా ఏడిస్తే ఏమని చెప్పుకోవాలి.(అది మెయిన్ స్ట్రీమ్ జర్నలిజం అంటే చేసేది ఏమీ ఉండదు) ఇప్పటికే చంద్రబాబు అరెస్టు తర్వాత ఆంధ్రజ్యోతి నడి బజార్లో బట్టలు విప్పి నాట్యం చేస్తోంది. ఒంటికి పసుపు రంగు పూసుకొని పోతురాజు ఆడినట్టు ఆడుతోంది. చంద్రబాబు అరెస్టు తప్ప ఇక ఆ పత్రికలో మరో వార్త కనిపించడం లేదు. ఇక ఈనాడు అయితే చెప్పాల్సిన పని లేదు. పత్రికా జర్నలిజం ఇలా తగలబడింది అనుకుంటే.. టీవీ జర్నలిజం మరింత పాతాళానికి దిగజారిపోయింది. టీవీ 5 లో సాంబశివరావు అనే ఒక టీవీ ప్రజెంట్ స్థాయికి ఏ తెలుగు జర్నలిస్టూ చేరుకోలేడు. ఇంతకీ ఆయన చెప్పేది ఏంటయ్యా అంటే.. చంద్రబాబును అరెస్టు చేసిన రాజమండ్రి జైల్లో దోమలు ఉన్నాయట.. ఆ దోమలతో చంద్రబాబును కుట్టించి చంపడానికి జగన్ కుట్ర పన్నాడట.. ఎక్కడి నుంచో దోమలు తీసుకొచ్చి స్లో పాయిజన్ ప్రయోగిస్తున్నారట.. బహుశా పాత్రికేయన్లో ఎవరు ఇంతకుమించి ఇప్పటివరకు దిగజారలేదు. ఏమో, తమ రికార్డును తామే బద్దలు కొట్టడానికి ఇంకా దిగజారడం కూడా వీళ్ళకే సాధ్యమేమో.. చివరకు యూట్యూబ్ ఛానల్స్ కూడా సిగ్గుపడే స్థాయికి వీళ్ళ రిపోర్టింగ్ చేరుకుంది. ఇక సాంబశివరావు వీడియో మీద సోషల్ మీడియాలో మీమ్స్, సెటైర్లు జోరుగా పడుతున్నాయి. బహుశా ఆ దోమలను జగన్ పులివెందుల నుంచి తెప్పించుకుంటాడు, కసిగా కుట్టడానికి అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. వీరు ఇలా ఉంటే ఒక నాయకుడు ఆ జైలులో ఏసీ లేదని చెబుతాడు. ఇంకొక ఆమె ఆయనకు భద్రత లేదంటుంది.. అక్కడ వేడి నీళ్లు ఏవి అని అడుగుతుంది. ఇన్ని సౌకర్యాలు ఉంటే అది జైలు ఎందుకు అవుతుంది? అదేమైనా పార్క్ హయత్ హోటలా? అక్కడికి వెళ్లి సౌకర్యాలు అనుభవించడానికి ఆయన అతిధి కాదు, విచారణ ఖైదీ.
టీవీ_5 సాంబశివరావు వీడియోను కాస్త పక్కన పెడితే గతంలో దోమల గురించి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సుదీర్ఘంగా ప్రసంగించారు. దోమలు ఎవరైనా కుడతాయని, అవి మంచి సోషలిస్టులని పేర్కొన్నారు. “దోమలకు నేను కుట్టేది ఎమ్మెల్యేనో, మంత్రి నో అని తెలవదు. అది కొడితే జ్వరమో, మలేరియానో, ఇంకేదైనా సలి జ్వరమో వస్తుంది. దెబ్బకు పోయి దవాఖానాలో పడతాం.” అని ఆ మధ్య కేసీఆర్ వ్యాఖ్యానించారు.. ప్రస్తుతం చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న నేపథ్యంలో దోమల ప్రస్తావన తెరపైకి వచ్చింది.. టీవీ5 సాంబశివరావు దీనిపై వీరలెవల్లో లెక్చర్లు ఇవ్వడంతో.. దానికి కౌంటర్ గా వైసీపీ వాళ్లు కేసీఆర్ గతంలో మాట్లాడిన దోమలకు సంబంధించిన వీడియోను కౌంటర్ గా పోస్ట్ చేస్తున్నారు. దీంతో అనివార్యంగా ఈ దోమల ఎపిసోడ్ మధ్యలోకి కెసిఆర్ వచ్చినట్టు అయింది. ఇక ఏ మాట కా మాట ఈ పచ్చ మీడియా చేస్తున్న అతి ప్రచారం వల్ల చంద్రబాబు అరెస్టుకు సంబంధించి కలిగే ఆ కాస్త సానుభూతి కూడా మాయమైపోతుంది. పచ్చ మీడియా చేసే భజనలు క్వాలిటీ లేదు. పాడే కీర్తనలో శృతీ లేదు. ఇవి లేకపోతే వాటిని మొరుగుళ్ళు అంటారు తప్ప వార్తా కథనాలు అనరు. ఘాటుగా ఉన్నా ఇదే నిజం!
చివరికి చిన్న ప్రాణమైన దోమల మీద వీళ్ళ ఏడుపు ఏంటో pic.twitter.com/wbja1xHVtM
— Anitha Reddy (@Anithareddyatp) September 22, 2023
దోమలు కొడుతున్నాయి అంటే బెయిల్ ఇవ్వరు.
వేరే జైలు కి option ఇచ్చి ఏది కావాలో అడగమంటారు.
Options లో రెండు
తీస్ హజార్
అండమాన్
పనిలో పని కేసీఆర్ దోమలు గురించి చెప్పిన రెండు మాటలు వినండి. pic.twitter.com/IQ2RlKLLWR
— Anitha Reddy (@Anithareddyatp) September 22, 2023