Homeజాతీయ వార్తలుTrain Video : వీడికి ఏమైందిరా బాబు.. ప్రయాణికుడిని దారుణంగా కొట్టిన టీటీఈ

Train Video : వీడికి ఏమైందిరా బాబు.. ప్రయాణికుడిని దారుణంగా కొట్టిన టీటీఈ

Train Video : భారతీయ రైల్వేలు ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే వ్యవస్థగా గుర్తింపు పొందాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా.. పరిస్థితులకు అనుగుణంగా ఆధునీకరణ చెందుతూ.. ఇప్పుడు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ వంటి రైళ్లను అందుబాటులోకి తెచ్చారు. త్వరలో దేశంలో బుల్లెట్ రైలును ట్రాక్‌పైకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నారు. అయితే, అదే సమయంలో, రైళ్లు కొన్నిసార్లు పట్టాలు తప్పడం, నీటి లీకేజీలు, నాణ్యత లేని ఆహారంతో ఇబ్బంది ప్రయాణికులను ఇబ్బంది పెడుతున్నాయి. అయినా భారతీయ రైళ్లలో మెరుగైన సౌకర్యాలను అందించడానికి కేంద్రం, రైల్వేలు నిరంతరం కృషి చేస్తున్నాయి. ఇన్ని సేవలను అందిస్తున్న రైల్వేలకు నష్టం చేకూర్చేందుకు కొందరు పాల్పడుతున్నారు. అలాగే సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత కొన్ని రైళ్లకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. అలాంటిదే మరో వీడియో ప్రస్తుతం ట్రెండింగులో ఉంది.

ఉత్తరప్రదేశ్ గుండా వెళుతున్న రైలుకు సంబంధించిన ఓ దారుణమైన వీడియో బయటపడింది. ఈ వీడియో రైలు నంబర్ 15708 అమృత్‌సర్ కతిహార్ ఎక్స్‌ప్రెస్‌కు చెందినదని చెబుతున్నారు. ఇందులో టీటీఈ ప్రయాణీకుడి మెడపై తన్ని, బెల్టుతో దారుణంగా కొడుతున్నాడు. రైలులో ప్రయాణిస్తున్నప్పుడు ప్రయాణికులకు-టికెట్ అధికారి మధ్య చిన్న పాటి ఘర్షణలు సహజంగానే జరుగుతుంటాయి. సీటు విషయంలోనో.. లేదంటే వెయిటింగ్ లిస్టు విషయంలోనో గొడవలు సాధారణం. ఈ సమయంలో ప్రయాణికులకు సర్ది చెప్పడమో.. లేదంటే పోలీసులను పిలిచి పరిష్కరించుకోవడమో చేయాలి కానీ.. భౌతికదాడులకు దిగడం ఏ మాత్రం పద్ధతి కాదు. పిల్లలు, పెద్దలు, మహిళలు, కుటుంబాలతో కలిసి ప్రయాణం చేస్తుంటారు. ఏదైనా జరిగితే కంగారెత్తి పోతుంటారు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో అలాంటి భయాందోళన కలిగిస్తోంది. అందులో టీటీఈ తీరు మరీ భయంకరంగా ఉంది.

అమృత్సర్ నుంచి కతిహార్‌కు రైలు ప్రయాణిస్తుంది. బోగీలో బాత్రూంలు ఉండే చోట ఒక ప్రయాణికుడిని టీటీఈ, కోచ్ అటెండెంట్ దారుణంగా కొట్టారు. ప్రయాణికుడి మెడపై టీటీఈ కూర్చుని.. ఊపిరాడక కుండా చేస్తే.. ఇంకో వైపు అటెండెంట్ బెల్టు తీసుకుని ఇష్టం వచ్చినట్లు కొడుతూనే ఉన్నాడు. అంతటితో ఆగకుండా టీటీఈ బూటు కాళ్లతో ప్రయాణికుడిపై పదే పదే జంప్ చేస్తూ కనిపించాడు. ఇంకోవైపు బెల్టుతో కొడుతూనే ఉన్నాడు. అయితే ప్రయాణికుడిలో మాత్రం స్పృహ తప్పినట్లు కనిపిస్తుంది. అతడి ప్యాంట్ కూడా తీసే ప్రయత్నం చేశారు. అయితే ఈ దృశ్యాలు ఎవరో రహస్యంగా చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. తెగ వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో లక్నో డీఆర్‌ఎం దృష్టికి వెళ్లగా.. నిందితులపై చర్యలు తీసుకున్నారు.

ఈ వీడియోకు సంబంధించి సోషల్ మీడియాలో రైల్వే మంత్రి @RailwaySeva @RailMinIndia @Central_Railway కి ట్వీట్ కూడా చేయబడింది. రైల్వే మంత్రిత్వ శాఖ కూడా ఈ వీడియోను పరిగణనలోకి తీసుకుంది. నిందితుడైన అటెండర్, టిటిఇపై చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. అయితే, ఆ ప్రయాణీకుడు ఎక్కడి నుండి వచ్చాడు. అతను నిజంగా తాగి ఉన్నాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. అతనికి టికెట్ ఉందో లేదో ఇంకా తెలియదు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular