TTD: టీటీడీలో సంపన్నులదే రాజ్యం.. వారి క్లబ్ గా మారిపోయిందా?

TTD: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు వివాదాలకు కేరాఫ్ గా మారుతోంది. నిత్యం ఏదో ఒక సమస్యతో బోర్డు వార్తల్లోకి వస్తోంది. ప్రధానంగా బోర్డులో జరిగే నియామాకాలపై ఇతరుల నుంచి విమర్శలు వస్తూనే ఉన్నాయి. టీటీడీ బోర్డులో జరిగే నియామకాల్లో ప్రభుత్వ జోక్యం ఉన్నందువల్ల ఈ సమస్య వస్తుందని అంటున్నారు. అయితే ఈ పరిస్థితి ఎప్పటి నుంచో ఉన్నా.. జగన్ ప్రభుత్వం వచ్చాక తీవ్రమైందని ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా కర్ణాటకకు చెందిన ఎమ్మెల్యేను టీటీడీ బోర్డులో […]

Written By: NARESH, Updated On : October 8, 2021 10:09 am
Follow us on

TTD: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు వివాదాలకు కేరాఫ్ గా మారుతోంది. నిత్యం ఏదో ఒక సమస్యతో బోర్డు వార్తల్లోకి వస్తోంది. ప్రధానంగా బోర్డులో జరిగే నియామాకాలపై ఇతరుల నుంచి విమర్శలు వస్తూనే ఉన్నాయి. టీటీడీ బోర్డులో జరిగే నియామకాల్లో ప్రభుత్వ జోక్యం ఉన్నందువల్ల ఈ సమస్య వస్తుందని అంటున్నారు. అయితే ఈ పరిస్థితి ఎప్పటి నుంచో ఉన్నా.. జగన్ ప్రభుత్వం వచ్చాక తీవ్రమైందని ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా కర్ణాటకకు చెందిన ఎమ్మెల్యేను టీటీడీ బోర్డులో ప్రత్యేక ఆహ్వానితులుగా చేర్చడంపై తీవ్ర చర్చకు దారితీసింది. ఆయన నియామకంపై కొందరు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు.

ఈస్టిండియా కాలంలోనే తిరుమల ఆలయాన్ని కొన్ని నియమాల ప్రకారం నడిపించాలని అనుకున్నట్లు ‘హిస్టరీ ఆఫ్ హిందూ రిలిజియన్ ఎండోర్స్ మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్’లో పేర్కొన్నారు. 1933లో మద్రాసు చట్టంతో తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలన హథారాంజీ అనుమంతుల నుంచి ఒక కమిటీగా మారింది. ఆ సమమయంలో ఈ కమిటీలో ఏడుగురు సభ్యులున్నారు. 1951లో మద్రాసు హిందూ లిలిజియన్ అండ్ చారిటబుల్ ఎండోర్స్ మెంట్ కి మారింది. ఆ తరువాత ధర్మకర్తల మండలి వచ్చింది. ఇందులో 5గురు సభ్యులున్నారు. ఆ తరువాత 1966లో టీటీడీ కొత్త చట్టం వచ్చింది. ఆ సమయంలో 11కి పెరిగింది. 1983లో టీటీడీ అధికారంలోకి వచ్చాక బోర్డులోచాలా మార్పులు వచ్చాయి. ఇలా బోర్డు సభ్యుల్లో కొందరు రాజకీయ నాయకులు ఉత్సాహం చూపడంతో ఆ సంఖ్య 82కి చేరింది.

1951 టీటీడీ యాక్ట్ ప్రకారం బోర్డుకు తొలి చైర్మన్ గా వెంకటస్వామి నాయుడు నియామకమయ్యారు. అయితే ఆసమయంలో ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు. దీంతో రాజకీయ నాయకులు నేరుగా బోర్డు పదవుల్లోకెక్కడా ప్రారంభించారు. ఆ తరువాత ఎన్టీరామారావు అత్తిలి ఎమ్మెల్యే వీకేడీవీఎస్ రాజును నియమించడంతో మరింత రాజకీయం పులుముకుంది. 1983 నుంచి 2021 వరకు 23 మంది చైర్మన్లుగా నియమకం అయిన వారిలో ముగ్గురు ఐఏఎస్ అధికారులుంటే మిగతావారందరూ రాజకీయ నాయకులే ఉన్నారు.

అయితే అది రాను రాను ముఖ్యమంత్రులు తమకు అనుకూలమైన వారిని నియమించుకుంటూ వస్తున్నారు. తాజాగా సీఎం జగన్ 52 మంది ప్రత్యేక ఆహ్వానితులను నియమించారు. దీనిపై వివాదం నెలకొంది. అయితే ఇలా నియమించడంపై విమర్శలొస్తాయని అధికార పార్టీలకు తెలియంది కాదు. కానీ జగన్ తమ బంధువులకు పదవులను కట్టబెట్టడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రతిపక్షాల నాయకులు ఆరోపిస్తున్నారు. తన వ్యాపార అవసరాలకు టీటీడీ బోర్డును వాడుకుంటున్నారని కమ్యూనిస్టులు అంటున్నారు.

ఇక ప్రత్యేక ఆహ్వానితుల్లో బెంగుళూరుకు చెందిన యలహంక ఎమ్మెల్యేను నియమించడం వివాదం రాజుకుంది. ఆయన బోర్డులోకి రావడానికి జగన్ స్వప్రయోజనమే అని అంటున్నారు. ఎందుకంటే యలహంకలో జగన్ భారీ బంగళా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. తన సొంత ఊరి ఎమ్మెల్యేను బోర్డులోకి తీసుకొచ్చారని అంటున్నారు. అయితే ఆయనకు జగన్ కు ఏదో సంబంధం ఉండడం వల్లే ఆయనకు ఈ బోర్డులో చోటు కల్పించారని అంటున్నారు.

ఇదే కాకుండా టీటీడీ బోర్డు రెడ్డీలకే పరిమితం అయ్యిందని ఆరోపణలు వస్తున్నాయి. ఎందుకంటే టీటీడీ బోర్డు చైర్మన్ గా జగన్ బాబాయ్ వైవి రెడ్డి, ఎగ్గిక్యూటివ్ ఆఫీసర్ కేఎస్ జవహర్ రెడ్డి, అదనపు ఈవో ఏవీరెడ్డిలుగా ఉన్నారు. ఇదిలా ఉండగా 52 ప్రత్యేక ఆహ్వానితుల నియామకంపై కొందరు కోర్టుకు వెళ్లడంతో హైకోర్టు జీవోను నిలిపివేసింది. టీటీడీలో గతంలోనూ రాజకీయ వివాదాలు చోటు చేసుకున్నా జగన్ ప్రభుత్వంలో అవి తీవ్రమయ్యాయని ఆరోపిస్తున్నారు. ఇక్కడ అర్హులైన వారిని కాకుండా ముఖ్యమంత్రి సన్నిహిత వర్గాలకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారని అంటున్నారు.