Ramana Deekshithulu Tweets: శ్రీవారి సేవలో రమణ దీక్షితులు(Ramana Deekshithulu) తరించారు. ప్రధాన అర్చకుడిగా సేవలందించారు. గత ప్రభుత్వం ఆయనను ఇంటికే పరిమితం చేసింది. కానీ జగన్ అధికారంలోకి వచ్చాక మళ్లీ తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రెండేళ్లుగా ఎదురు చూస్తున్నారు. కానీ ఆయనకు పిలుపు మాత్రం రాలేదు. దీంతో సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతూ తనలోని ఆగ్రహాన్ని చూపెడుతున్నారు. దీనిపై అందరిలో కూడా సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
ఉత్తిత్తి జీవోలతో మోసం చేసే జగన్ రమణ దీక్షితులు విషయంలో పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. వైసీపీ అదికారంలోకి వస్తే మళ్లీ ప్రధాన అర్చకుని పదవి ఇస్తామని నమ్మబలికింది. జగన్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదు. అవసరం అయినప్పుడు మాత్రమే జగన్ కు రమణదీక్షితులు గుర్తుకు వస్తారు. గతంలో ఎల్వీ సుబ్రహ్మణ్యంను సీఎస్ గా ఉన్న సమయంలో తొలగించారు.
ఆ సమయంలో హిందువుల్లో వ్యతిరేకత వస్తుందన్న అనుమానంతో రమణదీక్షితులును ప్రధాన అర్చకుడిగా నియమించారు. కానీ రమణ దీక్షితులుకు ఆ పదవి వల్ల ప్రయోజనం లేదు. ఆలయంలోకి ప్రవేశం దక్కలేదు. దీనిపై రమణ దీక్షితులు పలు విధాలుగా ట్వీట్లు(Tweets) పెడుతున్నారు. జగన్ ప్రభుత్వం తనను పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. హిందువుల్ని ఆకట్టుకోవడానికి జగన్ పలు రకాలుగా ప్రణాళికలు రచించారు.
ఈ నేపథ్యంలో రమణ దీక్షితులును అర్చకుడిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసినా ఎన్నికలయిపోయాక విధులు నిర్వహించే అవకాశం ఇవ్వలేదు. దీంతో కోర్టు ఉత్తర్వులను సాకుగా చూపారు. ఇప్పుడు రమణదీక్షితులు ట్వీట్లు పెడుతున్నారు. మరోసారి హిందువుల్ని బుజ్జగించే పరిస్థితి వచ్చినప్పుడు రమణదీక్షితులు గురించి జగన్ ఆలోచించే అవకాశం ఉందని ప్రత్యేకంగా చెబుతున్నారు.