https://oktelugu.com/

శ్రీవారి దర్శనం రోజులో ఎంతమందికి దక్కనుంది?

దేశవ్యాప్తంగా కేంద్రం లాక్డౌన్ విధించడంతో అన్ని దేవాలయాలు, ప్రార్థనా మందిరాలు మూతపడ్డాయి. కేవలం పూజారులు దేవాలయాల్లో నిత్యపూజలు చేస్తుండగా భక్తులకు దర్శనాలను రద్దుచేశారు. ఇటీవల కేంద్రం గ్రీన్, ఆరెంజ్, రెడ్ జోన్లలో సడలింపులు ఇస్తుంది. ఈనేపథ్యంలోనే దాదాపు అన్నిరంగాలకు కేంద్రం షరతులతో కూడిన అనుతమలను ఇస్తోంది. కేవలం సామూహికంగా, ఎక్కువ సంఖ్యలో గుమ్మికూడే ప్రాంతాలైన దేవాలయాలు, సినిమా థియేటర్లు, భారీ పరిశ్రమలకు వంటి వాటికి మాత్రమే ఇప్పటివరకు అనుమతి లభించడం లేదు. అయితే ఈనెల 17తో లాక్డౌన్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : May 14, 2020 5:01 pm
    Follow us on

    దేశవ్యాప్తంగా కేంద్రం లాక్డౌన్ విధించడంతో అన్ని దేవాలయాలు, ప్రార్థనా మందిరాలు మూతపడ్డాయి. కేవలం పూజారులు దేవాలయాల్లో నిత్యపూజలు చేస్తుండగా భక్తులకు దర్శనాలను రద్దుచేశారు. ఇటీవల కేంద్రం గ్రీన్, ఆరెంజ్, రెడ్ జోన్లలో సడలింపులు ఇస్తుంది. ఈనేపథ్యంలోనే దాదాపు అన్నిరంగాలకు కేంద్రం షరతులతో కూడిన అనుతమలను ఇస్తోంది. కేవలం సామూహికంగా, ఎక్కువ సంఖ్యలో గుమ్మికూడే ప్రాంతాలైన దేవాలయాలు, సినిమా థియేటర్లు, భారీ పరిశ్రమలకు వంటి వాటికి మాత్రమే ఇప్పటివరకు అనుమతి లభించడం లేదు. అయితే ఈనెల 17తో లాక్డౌన్ 3.0 ముగియనుండటంతో దేవాలయాలకు సడలింపులిచ్చేందుకు కేంద్రం సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది.

    లాక్డౌన్ కారణంగా దేవాలయాల్లోకి భక్తులను అనుమతించకపోవడంతో దేవాదాయ శాఖ వేలకోట్ల రూపాయాల ఆదాయాన్ని కోల్పోయింది.  ఈ పరిస్థితుల్లో దేవాలయ సిబ్బంది, కార్మికులకు జీతాలిచ్చే పరిస్థితుల్లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా దేవాయాలను నమ్ముకొని జీవనం సాగిస్తున్న వ్యాపారులు భారీగా ఆదాయం కోల్పోవాల్సి వచ్చింది. ఈనేపథ్యంలో తిరిగి దేవాలయాలు తెరుచుకోనుండటంతో ఆయా దేవాలయాలు తగిన చర్యలు తీసుకుంటున్నాయి. ఈమేరకు తిరుమల తిరుపతి దేవస్థానం పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిచ్చేందుకు సన్నహాలు చేస్తుంది. తొలుత ప్రయోగాత్మకంగా కొందరిని శ్రీవారి దర్శనానికి అనుమతించాలని టీటీడీ నిర్ణయినట్లు సమాచారం.

    శ్రీవారి దర్శనానికి ప్రతీరోజు 14గంటలపాటు భక్తులను అనుమతించాలని టీటీడీ భావిస్తోంది. గంటకు 500మంది మాత్రమే స్వామిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మొదటి మూడురోజులు టీటీడీ ఉద్యోగులను అనుమతి ఇవ్వనున్నారు. తర్వాత 15రోజులపాటు స్థానికులను శ్రీవారి దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు. టీటీడీ నిర్ణయంతో రోజుకు 7వేల మంది మాత్రమే స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉంటుంది. శ్రీవారిని దర్శించుకోవాలంటే ముందుగా ఆన్‌లైన్లో స్లాట్ బుక్ చేసుకోవాలి. తొలిగా మొదట సర్వదర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శన భక్తులకు టికెట్లను టీటీడీ విక్రయించనుంది. ఈమేరకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా టీటీడీ అన్నిరకాల సదుపాయాలను కల్పించేందుకు చర్యలు చేపడుతోంది.