TTD Board 2021: టీటీడీనా.. పునరావాస బోర్డా? ఇంత మంది సభ్యులా?

TTD Board 2021: తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ను వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మరీ దారుణంగా 75 మందితో కార్యకవర్గం నియమించడం విమర్శలకు తావిస్తోంది. దేవుడికి ఎలాంటి ప్రయోజనం లేకున్నా కమిటీల పేరుతో అనవసరంగా పెత్తనం ఆపాదించడం సమంజసం కాదని తెలుస్తోంది. అయినా ప్రభుత్వం తన తీరు మార్చుకోవడం లేదు. ఫలితంగా సర్కారు విమర్శల పాలవుతోంది. అయినా నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్న ధోరణిలోనే ఉండిపోతోంది. ఈ నేపథ్యంలో టీటీడీ బోర్డు ప్రకటనలో […]

Written By: Srinivas, Updated On : September 16, 2021 5:40 pm
Follow us on

TTD Board 2021: తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ను వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మరీ దారుణంగా 75 మందితో కార్యకవర్గం నియమించడం విమర్శలకు తావిస్తోంది. దేవుడికి ఎలాంటి ప్రయోజనం లేకున్నా కమిటీల పేరుతో అనవసరంగా పెత్తనం ఆపాదించడం సమంజసం కాదని తెలుస్తోంది. అయినా ప్రభుత్వం తన తీరు మార్చుకోవడం లేదు. ఫలితంగా సర్కారు విమర్శల పాలవుతోంది. అయినా నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్న ధోరణిలోనే ఉండిపోతోంది. ఈ నేపథ్యంలో టీటీడీ బోర్డు ప్రకటనలో ఇంత మంది సభ్యులుగా ఉండటం ఏమిటనే ప్రశ్నలు వస్తున్నాయి.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలకమండలి నియామకంలో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రాజకీయ పబ్బం గడుపుకోవడానికే ప్రభుత్వం ఇలా వ్యవహరించడం ఏమిటని అడుగుతున్నారు. సభ్యులుగా 25 మంది ఉంటారు. 50 మంది ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించారు.వారు బోర్డు సమావేశాలకు మాత్రం హాజరు కావలసిన అవసరం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టీటీడీ బోర్డు నియామకంపై బహిరంగంగానే విమర్శలు వస్తున్నాయి.

టీటీడీ సభ్యుల హోదాలో దర్శనాలు, ప్రసాదాలు, కాటేజీలు బుక్ చేయించుకుని రాజకీయం చేయడమే ధ్యేయంగా పెట్టుకున్న ప్రభుత్వం ఇంతమందికి పెత్తనం ఇవ్వడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అధికారాలు చెలాయించుకోవడం, బ్రోకర్ వ్యవస్థను పెంచిపోషించేందుకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు సమాచారం. దీంతో టీటీడీ పాలకవర్గం కూర్పుపై ప్రతిపక్షాలు సైతం పెదవి విరుస్తున్నాయి. ఇంత పెద్ద మొత్తంలో సభ్యులను నియమించి సభ్యులకున్న విలువ తీస్తున్నారని చెబుతున్నారు.

టీటీడీ సభ్యుల హోదాలో దేవుడికి సేవ చేయాలనే సంకల్పం ఎందరిలో ఉంటుంది. తమ స్వార్థ ప్రయోజనాల కోసమే తప్ప దేవుడి కోసం ఎంత మేరకు సేవ చేస్తారో అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఏదేమైనా టీటీడీ బోర్డులో ఇంత మందిని నియమించి ప్రభుత్వం తన అసమర్థతను నిరూపించుకుంటోంది. నియామకాల పునరావాస కేంద్రంగా టీటీడీ మారిపోయిందని చెబుతున్నారు.