
అసలే కరోనా కల్లోలం.. ఇంతటి కల్లోల సమయంలో ఎవరూ ప్రజారవాణా వాడడం లేదు. అందరూ సొంత వాహనాలు, కార్లు కొంటూ ముందుకెళుతున్నారు. ఈ క్రమంలోనే కరోనా లాక్ డౌన్ తర్వాత ఆర్టీసీ బస్సులకు గిరాకీ తగ్గింది. అందరూ కరోనా భయానికి బస్సుల్లో పోకుండా బైక్ లు, కార్లలో వెళుతున్నారు. ఈ క్రమంలోనే ఆర్టీసీ సంస్థలకు భారీగా ఆదాయం పడిపోయింది. జీతాలు ఆర్టీసీ ఉద్యోగులు, సిబ్బందికి ఇవ్వడం కానాకష్టమైంది.
ఈరోజు 6వ తేదీ. ఇప్పటికీ తెలంగాణఆర్టీసీ ఉద్యోగులకు జీతాలు పడలేదు. ఈ క్రమంలోనే ఈ నెలకు సంబంధించిన జీతాలు చెల్లించకుంటే సమ్మెబాట పడుతామని తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు సర్కార్ కు డెడ్ లైన్ విధించారు.
ఇప్పటికే తమ 59 సమస్యలను ప్రభుత్వానికి, సంస్థ యాజమాన్యానికి నివేదించామని..కానీ ఇప్పటివరకు స్పందన రాలేదని ఉద్యోగులు వాపోతున్నారు. తెలంగాణ స్టేట్ జేఏసీ, తాజాగా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ శర్మకు ఒక లేఖ రాసింది. ఈనెల జీతాలను ఇవాళ ఆగస్టు 6న పంపిణీ చేయాలని లేదా.. రాష్ట్ర వ్యాప్తంగా .. ముందుగా ప్రకటించినట్టుగా ఆగస్టు 7న సమ్మెకు దిగుతామని జేఏసీ ఎండీకి స్పష్టం చేశాయి.
తమ సమస్యలు పరిష్కరించాలంటూ మెమోరాండం సమర్పించి ఇప్పటికే 25 రోజులు గడిచినప్పటికీ తమకు ఇంతవరకు ఎలాంటి స్పందన రాలేదని చెబుతున్నారు.
అసలే కరోనా కల్లోలంలో ఆదాయం లేక అలమటిస్తున్న టీఎస్ ఆర్టీసీ సంస్థకు ఇప్పుడు ఉద్యోగుల సమ్మెపై మరింత కృంగదీయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే జరిగితే తెలంగాణ ఆర్టీసీ సంస్థ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతుందని అంటున్నారు.