TS Election Results 2023: బీఎస్పీ.. జాతీయ పార్టీ. ఉత్తర ప్రదేశ్‌కే పార్టీ పరిమితమైనా.. దేశవ్యాప్తంగా పోటీ చేస్తుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కీలకంగా మారుతోంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో సిర్పూర్, నిర్మల్ అభ్యర్థులు కోనప్ప, ఇంద్రకరణ్‌రెడ్డి బీఎస్పీ నుంచి గెలిచారు. తర్వాత టీఆర్‌ఎస్‌లో మెర్జ్ అయ్యారు. తాజాగా కూడా బీఎస్పీ కీలక పాత్ర పోషిస్తోంది. పార్టీ రాష్ట్ర చీఫ్‌గా ఉన్న ఆర్‌ఎస్.ప్రవీణ్‌కుమార్ అన్నీతానై వ్యవహరించారు. ఈ ఎన్నికల్లో ఆయన సిర్పూర్ నుంచే పోలీ చేస్తున్నారు. ఇక్కడ ఆయన గెలిచే అవకాశం ఉందని సర్వేలు చెబుతున్నాయి. ఆయన గెలిస్తే రికార్డు అవుతుందని అంటున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా..
ఇక రాష్ట్రవ్యాప్తంగా కూడా కొన్ని స్థానాల్లో బీజేపీ కీలకంగా మారబోతోంది. పటాన్‌చెరు, సిద్దిపేట, పెద్దపల్లి, మిర్యాలగూడలో బీఎస్పీ ప్రభావం చూపుతుందని తెలుస్తోంది.
– పటాన్‌చెరులో బీఆర్‌ఎస్ నేత నీలం మధు బీఎస్పీ నుంచి బరిలో ఉన్నారు. ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన ఆయన అక్కడ బలంగా ఉన్నారు.
– ఇక పెద్దపల్లిలో కూడా ఉన్నత విద్యావంతురాలు దాసరి ఉష బరిలో ఉన్నాయు. యువ నాయకురాలు అయిన ఉష పార్టీ చీఫ్ ప్రవీణ్‌కుమార్ స్ఫూర్తితో ఎన్నికల బరిలో నిలిచారు. పెద్దపల్లిలో చాలా వరకు బలం పుంజుకున్నారు. దీంతో ఆమె ఈ ఎన్నికల్లో భారీగా ఓట్లు చీలుస్తుందని తెలుస్తోంది. ఉష ప్రభావంతో సిట్టింగ్ ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి విజయరమణారావుపై ప్రభావం పడుతుందని అంటున్నారు.
– సిద్దిపేటలో కూడా బలమైన నేత గాదోని చక్రధర్‌గౌడ్ ఉన్నారు. ఆర్థికంగా బలమైన నేత కావడం, సామాజిక సేవా కార్యక్రమాలతో ప్రజలకు అనేక విధాలుగా ఆదుకోవడం, ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఆర్థికసాయం చేయడం ద్వారా రాజకీయ నేతగా ఎదిగారు. ఈయన గెలవకపోయినా హరీశ్‌రావు ఆధిక్యం తగ్గిస్తారని అంటున్నారు.
– ఇక మిర్యాల గూడ నుంచి జాడి రాజు బీఎస్పీ తరఫున బరిలో ఉన్నారు. ఈయనకు పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదు. కానీ, బీఆర్‌ఎస్ నాయకులు ఎన్నికల ప్రచార సమయంలో రాజుపై దాడి చేయడంతో ఆయనపై సానుభూతి పెరిగింది. దీంతో ఇక్కడ కొన్ని ఓట్లు బీఎస్పీకి పోలవుతాయని తెలుస్తోంది.